69. (NKP...12). ఖమ్మం జిల్లాలోని ఓ ఆర్ . టీ. సీ. బస్సు స్టాండు ....కధా.. మా వ్యధ..
ఖమ్మం లో ఓ ఆర్ . టీ. సీ. బస్సు స్టాండు ....కధా.. మా వ్యధ.. హలో సార్లూ! క్రింది మొదటి రెండు ఫోటోలు గుర్తుపడతారా? ఎక్కడివో చెప్పగలరా? ఈ మధ్య ఆర్.టీ. సి. పెద్దసారు సజ్జనారు సారూ నెటిజన్లను ఈ ప్రశ్నే అడుగుతే తడుముకోకుండా రాష్ట్రం నలుమూలలా వున్నోల్లంతా " ఖమ్మం బస్సు స్టాండు " అని చె ప్పేసినృ . బావుందని మెచ్చుకున్నరు. ఏంది మరి? ఏమనుకున్నారు. రాష్ట్ర రవాణా శాఖా మంత్రి నియోజకవర్గమా? మజాకా? మా ఖమ్మం బస్సు స్టాండు ఎప్పుడూ అంతేనండి. మీకో విషయం తెలుసా? శ్రీ జలగం వెంగళరావు రాష్ట్ర ముఖ్యమంత్రి గా వున్నప్పుడు ఇప్పుడందరికీ తెలిసిన పాత బస్సు స్టాండు ను కట్టించాడు. అంతకు ముందు రైల్వే స్టేషను ప్రక్కన బస్సులు ఆగేవి. అదే బస్సు స్టాండు అప్పుడు. పెరిగే అవుసరాల కొసమని పెద్దది కట్టించినరు. క్రింద ఫోటోనే ఆ బస్సు స్టాండు. బస్సు స్టాండు ప్రారంభోత్సవానికి తరువాతి ముఖ్యమంత్రి శ్రీ మర్రిచెన్నారెడ్డి వచ్చింరు{1979 లో అనుకుంటా) . రిబ్బను కత్తిరించే ముందు బస్సు స్టాండును అంతా చూసి, చేతిలో వున్న కర్రను ఊపుతూ "ఖమ్మానికి ఇంత పెద్ద బస్సు స్టాండా?" అన్నాడండి. నేను ప్రక్కనే వున్నా. ఖమ్మం ఎమ్మెల్యే అన...