39. (NKP-10). నా రాజకీయ జీవిత ప్రారంభపు జ్ఞాపకాలు
యూత్ క్లబ్ ప్రెసిడెంట్ గా సమాజ సేవ ఆరంభం. 1977 సం.లో నేలకొండపల్లి గ్రామంలోని అన్ని వర్గాల యువకులంతా కలిసి నన్ను ఏకగ్రీవంగా యూత్ క్లబ్ ప్రెసిడెంట్ గా ఎన్నుకున్నారు. లిబర్టీ యూత్ క్లబ్ గా దానికి నామకరణం చేసాము. ప్రెసిడెంట్ గా నేను, వైస్ ప్రెసిడెంట్ గా శ్రీ కంకిపాటి శ్రీనివాస రావు, సెక్రటరీగా చెరుకూరి సాంబశివరావు, జాయింట్ సెక్రటరీగా శ్రీ కొల్లి జగన్మోహనరావు, కోశాధికారిగా శ్రీ ఠాకూర్ రాంగోపాల్ సింగ్ మరియు శ్రీ కోనేరు కిశోరు యిత్యాదులు కార్య వర్గ సభ్యులుగా వున్నారు. కొంతకాలం తరువాత జూనియర్ కాలేజీలో జరిగిన ఇంటర్ ఫైనల్ క్లాసు ప్రతినిధి ఎన్నిక పరిణామాల పర్యవసానంగా గ్రామ వాతావరణం మారిపాయింది. యూత్ క్లబ్ లో లిబర్టీ కరువై పాయిందని కొందరు బయటకు వెళ్ళటం, నేను తప్పనిసరి పరిస్థితులలో రాజకీయాలలోకి రావటం జరిగింది. అప్పుడు వున్న నిబంధనల ప్రకారం సీనియర్ ఇంటర్ లో గెలిచిన ప్రతినిధే కాలేజీ ప్రెసిడెంట్ అవుతాడు. రాజకీయాలలోకి వచ్చిన తరువాత మొట్టమొదటి సారిగా సుందరయ్య చౌక్ లో కాంగ్రెస్ గద్దె నిర్మాణం ప్రారంభించాము. అప్పుడు CPM పార్టీ సానుభూతిపరుడు ఒక్కరు గద్దె నిర్మాణ స్థలాన్ని ...