Saturday, October 28, 2023

రాజకీయ రంగం సమస్తం కుళ్ళి కంపు కొడుతోన్న వైనం.


76. (social..49). 

రాజకీయ రంగం సమస్తం కుళ్ళి కంపు కొడుతోన్న వైనం.


 
ఏ పార్టీ చరిత్ర చూసినా ఏమున్నది గర్వకారణం ?

రాజకీయ రంగం సమస్తం కుళ్ళి కంపు కొడుతోన్న వైనం.

బీ.ఆర్.ఎస్  పార్టీలో టికెట్ ఇవ్వలేదని కాంగ్రెస్ పార్టీలోకి  .. 

కాంగ్రెస్ పార్టీ లో టికెట్ దొరకలేదని  బీ.ఆర్.ఎస్/బీ.జె.పీ.లోకి ....

పిల్లనిచ్చి/టికెట్ ఇచ్చి పెళ్లి చేసినా/గెలిపించినా   

తాళి కట్టిన మరుక్షణమే, కాళ్ళ పారాణి ఆరకుండానే  

వేరే వాళ్ళతో లేచి పోడనే గ్యారంటీ ఏమిటీ?

కళ్ళముందు కనిపిస్తున్నదే  కదా!

సర్వేలమీద సర్వేలు చేసి 

గెలుపు గుర్రాల పసిగట్టి వాటేసుకొనే వారు కొందరు.. 

గెలిపించిన కార్యకర్తలను, పార్టీని నట్టేట ముంచి 

డబ్బు కోసం /కాం ట్రాక్టుల కోసం 

గడ్డితినే వారు ఇంకొకరు...

చాలా భలేగుంది మీ రాజకీయం...

పార్టీ సభ్యత్వం లేకుండా శతాబ్దాల/దశాబ్దాల పార్టీలోకి 

లేచిపోయి వచ్చినోళ్ళకి  కుర్చీ లిస్తే 

వాళ్ళనే అందలమెక్కిస్తే 

ఇంతకాలం పల్లకీ మోసిన, చమటోడ్చిన,

త్యాగాలతో బతుకీడ్చిన  

కార్యకర్తలకు  ఎవ్వరు  భరోసా?

టికెట్ కోసం వచ్చిన అవతలోడికి 

నీ సిద్దాంతాలతో పనిలేదు 

నీ నాయకులపై గౌరవం వుండదు 

నిన్నటి వరకు నిన్ను బూతులు తిట్టినోడు 

ఈరోజు నీకు ఎలా ముద్దు అయినాడు? 

తప్పదు. మీకు బుద్ది చెప్పాలి .

వెట్టి చాకిరీని ఎప్పుడో నిషేధించాము కదా 

కార్యకర్తల వెట్టి చాకిరీకి ముగింపు పలకాలి. 

కార్యకర్తల వదిలేసి కాంగ్రెసు నాయకత్వం  .. 

ఉద్యమకారుల వదిలేసి అధికార పార్టీ నాయకత్వం  ..

యేరు దాటాక తెప్ప తగలేసినట్లుంది.

ఇలా ఎంతకాలం?

ఓటుతో ఈ మురికి పార్టీల ఉతికీయాలి.

యువతరం భవిష్యత్ కార్యాచరణ చేపట్టాలి.

-----PENDYALA VASUDEVA RAO

<!-- Google tag (gtag.js) --> <script async src="https://www.googletagmanager.com/gtag/js?id=G-1M93C8YK91"></script> <script> window.dataLayer = window.dataLayer || []; function gtag(){dataLayer.push(arguments);} gtag('js', new Date()); gtag('config', 'G-1M93C8YK91'); </script>


Saturday, September 30, 2023

పాలేరు అసెంబ్లీ నియోజక వర్గం...నియోజకవర్గాల పునర్విభజన...రాజకీయాలు.

75. (social 48). 

 


పాలేరు అసెంబ్లీ నియోజకవర్గం...

నియోజకవర్గాలపునర్విభజన... రాజకీయాలు.

ప్రధమంగా జరిగిన  నియోజకవర్గాల పునర్విభజన 1962.

1962 సం. లో ఖమ్మం అసెంబ్లీ నియోజకవర్గం నుండి విడదీసిన ప్రాంతాన్ని పాలేరు అసెంబ్లీ నియోజక వర్గంగా ఏర్పాటు చేశారు. అప్పుడు ఖమ్మం జిల్లా కాంగ్రెసు వర్గరాజకీయాల ఫలితంగా నిబంధనలకు భిన్నంగా వేంసూరు అసెంబ్లీ నియోజక వర్గానికి బదులుగా వాళ్ళ స్వలాభం కోసం పాలేరును ఎస్. సీ నియోజకవర్గంగా మార్చారు. అప్పటికింకా సర్వశ్రీ జలగం వెంగళరావు మరియు శీలం సిద్దారెడ్డిలు ఇరువురు జిల్లా నాయకత్వ హోదాలో లేరు.  

అప్పుడు రాష్ట్రంలో కాంగ్రెసు పార్టీ  "రావు మరియు రెడ్డి "వర్గాలుగా చీలిపోయి వుంది. జిల్లాలో రావు వర్గముదే పైచేయిగా వుండేది. ఖమ్మం జిల్లాకు పార్టీలో శ్రీ బొమ్మకంటి సత్యనారాయణ రావు ప్రాబల్యం ఎక్కువ. 

వేంసూరు అసెంబ్లీ సీటు అప్పటి జిల్లా కాంగ్రెసు ముఖ్య నాయకుడు బొమ్మకంటి సత్యనారాయణ రావుకు అవుసరం. ఖమ్మం అసెంబ్లీ రాజకీయాలలో పట్టువున్న వ్యక్తి శ్రీ పెండ్యాల సత్యనారాయణ రావు. నియోజకవర్గ రాజకీయాలలో శ్రీ పెండ్యాల సత్యనారాయణరావును తప్పించి జిల్లాలో ఆయన  ప్రాబల్యానికి అడ్డుకట్ట వేయటం లక్ష్యంగా నియోజకవర్గాల పునర్విభజన ప్రక్రియను శ్రీ బొమ్మకంటి సత్యనారాయణరావు ఉపయోగించుకున్నారు. పాలేరు అసెంబ్లీ నియోజకవర్గాన్ని "ఎస్. సీ" కి కేటాయించటంలో తన పలుకుబడిని ఉపయోగించారు. 

ఆ సమయంలో, పంచాయతీ సమితులు ఏర్పడనప్పుడు, పాలేరు బ్లాక్ కు బీ. డీ. ఓ (బ్లాక్ డెవలప్ మెంట్ ఆఫీసర్) అధ్యక్షునిగా, శ్రీ పెండ్యాల ఉపాధ్యక్షుడుగా సేవలను అందించారు. పాలేరు ప్రాంత అభివృద్దిలో పెండ్యాల సత్యనారాయణరావు పాత్ర మారువలేనిది.     

1957 సం.లో జరిగిన అసెంబ్లీ ఎన్నికలలో ఖమ్మం అసెంబ్లీ నియోజకవర్గ ఎమ్మెల్యేగా  శ్రీమతి తే ళ్ళ లక్ష్మీకాంతమ్మ గారిని అభ్యర్ధిగా నిర్ణయించటంలో గానీ, గెలిపించటంలో గానీ శ్రీ పెండ్యాల సత్యనారాయణరావు ప్రతిభకు ఉలిక్కిపడిన అప్పటి కాంగ్రెసు జిల్లా నాయకత్వం ఖమ్మం అసెంబ్లీ నియోజకవర్గం నుండి కొంత ప్రాంతాన్ని విడగొట్టి పాలేరు అసెంబ్లీ నియోజకవర్గం అని నామకరణం చేసి షెడ్యూల్ కులాల (ఎస్. సీ) నియోజకవర్గంగా మార్చేశారు. ఆ సమయంలోనే నియోజకవర్గాల పునర్విభజన ప్రక్రియ ప్రారంభం కావటం వారికి వరంగా మారింది. 

ఈ రాజకీయచర్యల పర్యవసానమే జిల్లా రాజకీయ పునరేకీకరణకై శ్రీ పెండ్యాల సత్యనారాయణరావు శ్రీకారం చుట్టారు.  ఫలితంగా కొత్తతరం రాజకీయ అరంగ్రేటం సర్వశ్రీ  జలగం వెంగళరావు, శీలం సిద్దారెడ్డి  రూపంలో అవతరించటానికి కారణం అయింది. నైజాంపోరాట సమయంలో శ్రీ  పెండ్యాల సత్యనారాయణ రావు వరంగల్లు జిల్లా నాయకత్వంలో కీలక భూమికను పోషించటం, తద్వారా ఏర్పడిన పరిచయాలు ఈ రాజకీయ పునరేకీకరణలో విజయం సాధించటానికి దోహదపడింది. 

ద్వితీయ నియోజక వర్గాల పునర్విభజన. 2004.

శ్రీమతి రేణుకా చౌదరి ఖమ్మం లోకసభా అభ్యర్ధిగా రంగప్రవేశం చేశాక శ్రీ వనమా వేంకటేశ్వరరావు ప్రెసిడెంటుగా ఏర్పడ్డ ఖమ్మం జిల్లా కాంగ్రెసు కమిటీకి నేను దశాబ్దం పైగా కార్యదర్శి బాధ్యతలు నిర్వహించటం జరిగింది. ఆ సమయంలోనే అసెంబ్లీ, లోకసభ నియోజకవర్గాల పునర్విభజన ప్రక్రియ ప్రారంభం అయింది. ఎలెక్షన్ కమీషను ప్రతిపాదనల ప్రకారం ఖమ్మం లోకసభ, కొత్తగూడెం అసెంబ్లీ నియోజకవర్గాలు షెడ్యూల్ తెగలకు (ఎస్. టీ) రిజర్వు చేయటంతో రాష్ట్ర కాంగ్రెసు పార్టీ జిల్లా డీలిమిటేషన్ కమిటీని ఏర్పాటు చేసినది. ఖమ్మం జిల్లా డీలిమిటేషన్ కమిటీకి చైర్మనుగా నన్ను నియమించారు. అందులో సర్వశ్రీ అయితం సత్యం, చింతనిప్పు లాలయ్య, కోట గురుమూర్తి, కొత్తా సీతారాములు  సభ్యులుగా నియమించబడ్డారు. జిల్లాలోని పది అసెంబ్లీ, లోకసభా నియోజకవర్గాల పునర్విభజనా ప్రతిపాదనల తయారీ బాధ్యత నా భుజస్కందయాలపై పడింది. ఈ కమిటీకి రాష్ట్ర స్థాయిలో కాంగ్రెసు సీనియర్ నాయకులు శ్రీ గాదె వెంకటరెడ్డి చైర్మనుగా వుండేవారు. జిల్లాలోని అన్నీవర్గాలతో, రాజకీయపార్టీలతో సుధీర్గ సంప్రదింపుల తరువాత, మూడు సంవత్సరాల  నిరంతర కృషితో మూడు ప్రతిపాదనలను తయారు చేశాను. జాతీయ స్థాయిలో డీలిమిటేషన్ కమిటీ అధికారిక చైర్మనుగా వున్న రిటైర్డ్ సుప్రీం కోర్టు జడ్జీ శ్రీ కులధీప్  సింగ్ గారితో డిల్లీలో రెండు సార్లు సమావేశమై నా ప్రపోజల్స్ ను వివరించి పరిశీలించేలా చేయగలిగాను. జిల్లాలోని అన్ని నియోజకవర్గాలలో (అసెంబ్లీ మరియు లోకసభ) నేను చేసిన ప్రతిపాదనలే చివరకు ఆమోదించబడ్డాయి. 

పాలేరు అసెంబ్లీ నియోజకవర్గం పేరును నేలకొండపల్లి అసెంబ్లీ నియోజకవర్గంగా చేసిన మార్పు ప్రతిపాదన మాత్రం కొందరి అభ్యంతరంతో సఫలం కాలేదు. ఈ ప్రయత్నంలో నా విజయం ఏమిటంటే పాలేరు అసెంబ్లీ నియోజకవర్గాన్ని జనరలు (ఓ. సీ) సీటుగా మార్చే ప్రక్రియలో సఫలీకృతుడిని అయ్యాను. గతంలో 1962 లో నిబంధనలకు వ్యతిరేకంగా జరిగిన తప్పును దశాబ్దాల తరువాత సరిదిద్దే అవకాశం నాకు దక్కింది. 

జిల్లా కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడిగా వున్న వనమా వేంకటేశ్వరరావు డీలిమిటేషన్ ప్రక్రియ అయిపోయేటంత  వరకు ఆయన నన్ను నిద్ర పోనివ్వకుండా, డిల్లీ వెళ్ళినా నన్ను తన వెంటనే తీసుకు వెళ్ళేవారు. అక్కడ తరచుగా డీలిమిటేషన్ కమిటీ అధికారిక సభ్యులైన సర్వశ్రీ గాదె వెంకటరెడ్డి, నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి మరియు మండలి బుద్దప్రసాదులతో సమావేశం అయ్యేవాళ్ళం. ఒకసారి గాదె వెంకటరెడ్డి గారు వనమా గారితో "వనమా! వాసుదేవరావు గారు లేకుంటే నువ్వు దిల్లీకి రావా? అని అడిగారు. శ్రీ వనమాకు కంగారు ఎక్కువ. కొత్తగూడెం అసెంబ్లీ నియోజకవర్గం తిరిగి ఓ.సీ కాకపోతే ఆయన తట్టుకోవటం కష్టమని భయపడ్డాము. దాంతో నేను ప్రొఫెషన్  కు ఎక్కువ డుమ్మా కొట్టవలసి వచ్చింది.  ఎక్కువ సమయం ఈ వ్యవహారానికే వెచ్చించ వలసి వచ్చింది. 

జిల్లాలో డీలిమిటేషన్ సమయంలో, సత్తుపల్లి అసెంబ్లీనియోజకవర్గం జనరలు స్థానంగా వుంచటమే ధ్యేయంగా సత్తుపల్లి సిట్టింగ్ ఏం. ఎల్. ఏ,  శ్రీ జలగం వెంకటరావు కూడా  డీలిమిటేషన్ ఫలితం అనుకూలంగా సాధించటానికి రాష్ట్ర, జాతీయ స్థాయిలో నాయకుల కలుస్తూ చురుకుగా వ్యవహరించారు. డీలిమిటేషన్ ప్రక్రియ పర్యవసానంగా జిల్లాలో ముఖ్యనాయకుల రాజకీయ భవితవ్యం కొత్త పుంతలు తొక్కింది. స్థానచలనాలు  జరిగి వారి రాజకీయజీవితాలపై ప్రభావాన్ని చూపాయి. 

క్రింది చిత్రాలలో మొదటిది  ఖమ్మం లో.. నెహ్రూ యువక కేంద్రంలో యువజన దినోత్సవ సమావేశములో శ్రీమతి రేణుకా చౌదరి గారితో. చిత్రంలో నెహ్రూ యువక కేంద్రం కో .. ఆర్డీనేటరు శ్రీ పీ. వైద్యనాధం మరియు ఆఫీసు సిబ్బందిని చూడవచ్చు. 

రెండవ చిత్రం శ్రీమతి  రేణుకాచౌదరి, వనమా వేంకటేశ్వరరావు, చింతనిప్పు లాలయ్య తదితరులతో నేలకొండపల్లిలో ... శ్రీ భక్త రామదాసు మందిరములో.

                                                                                         ----పెండ్యాల వాసుదేవరావు.

<!-- Google tag (gtag.js) --> <script async src="https://www.googletagmanager.com/gtag/js?id=G-1M93C8YK91"></script> <script> window.dataLayer = window.dataLayer || []; function gtag(){dataLayer.push(arguments);} gtag('js', new Date()); gtag('config', 'G-1M93C8YK91'); </script>

<


Wednesday, July 12, 2023

విలీనామా? విమోచనా? విద్రోహమా?.. ఈ సందిగ్ధత ఎందుకొచ్చింది?



74. (Social..47). 

విలీనామా? విమోచనా? విద్రోహమా?.. 

ఈ సందిగ్ధత ఎందుకొచ్చింది?

వందల సంవత్సరాల బానిసత్వం నుండి, ఎన్నోవేల జనాల బలిదానాల ఫలితంగా వచ్చిన హైదరాబాద్ రాష్ట్రఅవతరణ తేదీని ఉత్సవంగా జరుపుకొనే రాత/అదృష్టం తెలంగాణ ప్రజలకు లేకుండా పోయింది.

1). ప్రమాణ స్వీకారం నిజాం రాజు చేతుల మీదుగా.. 

ఏ నిజాంరాజుకు వ్యతిరేకంగా ప్రజలు పోరాటంచేశారో, ఆ నిజాంరాజు "ది గ్రేట్ నిజాం ఆఫ్ హైదరాబాద్ ఆఫ్ దక్కన్" మీర్ ఉస్మాన్ ఆలీఖాన్ చేతుల మీదుగా నూతనంగా ఏర్పడ్డ ప్రజా ప్రభుత్వ ముఖ్యమంత్రి ప్రమాణస్వీకారం చేయవలసిన దుస్థితి రావటం నా మనసును కలచి వేసింధి.

"మా నైజాం రాజు తరతరాల బూజు" అన్న స్వాతంత్ర సమర యోధులే ఆ రోజు నిజాం ముందు నిలుచుని అభినందించవలసిన స్థితి. ఇండియా ప్రభుత్వం హైదరాబాద్ దక్కన్ పై చేపట్టిన "ఆపరేషన్  పోలో " విజయవంతం అయి మీర్ ఉస్మాన్ ఆలీ ఖాన్ లొంగిపోయినా ఆయనని పజల అభీష్టానికి వ్యతిరేకంగా హైదరాబాద్ రాష్ట్ర "రాజ్య ప్రముక్ః " గా ఎందుకు ప్రకటించవలసి వచ్చిందో ఆనాటి సర్దార్ వల్లభాయి పటేల్ మరియు జవహర్లాల్ నెహ్రూలకే ఎరుక.

ఆనాడు ఇండియాలో విలీనమైన వందల సంస్థానాలలో దేనికీ ఇవ్వని ప్రత్యేకత ఈ సంస్థానంలోనే ఎందుకు? విలీనానికి ఆయనేమీ ఇండియాతో పోరాటం చేయలేదే! పోరాటము చేసి సంధి కుదుర్చుకోలేదే!  రాజీపత్రాలు  వ్రాసుకోలేదే! హైదరాబాద్ సంస్థాన పొలిమేరలలోకి భారతసైన్య ప్రవేశంతోనే, అందుకే ఎదురు చూస్తున్నట్లు వెంటనే లొంగిపోయి వంగి, వొంగి దండాలు పెడుతూ  లొంగి పోయాడే ! మరెమిటి రాజకీయం?

అందుకేనేమో ఆనాటి ఆస్థితిని, ఇండియాలో విలీనమైన హైదరాబాద్ దక్కన్ రాజ్యంపై  ఆనాటి తెలంగాణ నాయకులు జీర్ణించుకోలేక పలువురు పలురకాలుగా వ్యాఖ్యానించారు. ఆ నాటి రాష్ట్ర పరిస్థితిని హైదరాబాద్/తెలంగాణ  రాష్ట్రవిమోచమని కొందరు, రాష్ట్రవిలీనమని మరికొందరు హైదరాబాద్ రాష్ట్రవిద్రోహ దినమని ఎందరో! అందుకే నైజామురాజు భారతసైన్యానికి లొంగి పోయిన రోజును ప్రజలకు స్వేచ్చ లభించిన ఉత్సవంగా  జరుపుకునే యోగం లేకపోయింది.

పైది జరిగినదే అంతా విచిత్ర అనుకుంటే ….

2). విచిత్రం గమనించండి .. 

ప్రపంచంలోనే అత్యంత గొప్పగా చెప్పుకొనే "తెలంగాణా సాయుధ పోరాటం" గురించి అది ముగిసిన రెండు దశాబ్దాలకు గానీ కమ్మునిస్టులే వ్రాయలేదు. ఆ పోరాటానికి నాయకత్వం వహించిన శ్రీ పుచ్చలపల్లి సుందరయ్య తనకే ఆ విషయా గురించ పూర్తి సమాచారం లేదని సెలవిచ్చారు.

3). ఇంకో  విచిత్రమండీ.. 

వేలమంది తెలంగాణా ప్రజల/యువకుల బలిదానాలతో, ప్రత్యేక బంగారు తెలంగాణా రాష్ట్రంలో ప్రప్రధమ ముఖ్యమంత్రిగా  ప్రమాణ స్వీకారం చేశాక, ఆసెంబ్లీ  సాక్షిగా తన పూర్వీకులకు నైజాం రాజు ఎంతో మేలు చేశాడని కీర్తించటం, ఆ నిజాం ఆనాటి హైదరాబాద్  రాష్ట్రానికి చేసిన సేవలను కొనియాడటం చూసి యావత్తు తెలంగాణ విస్తుపోయింది.....

వేలమంది ఆత్మార్పణం తరువాత ఏర్పడ్డ (ఇండియాలో విలీనం తరువాత) హైదరాబాద్/తెలంగాణ రాష్ర ఆవిర్భావ ముహూర్తాన ఉన్నత స్థానంలో కనిపించిన శ్రీ శ్రీ శ్రీ నిజాం మీర్ ఉస్మాన్ ఆలీ ఖాన్ .. ఆతరువాత వందల మంది యువకుల ఆత్మ బలిదానాల ఫలితంగా ఏర్పడ్డ ప్రత్యేక తెలంగాణ రాష్ట్రంలో మళ్ళీ ఊపిరి పోసుకున్నాడు.ఇంతకంటే అదృష్టం మరెవ్వరికి  కుంటుంది ?


  పైవివారాలు  అప్పటి చరిత్ర. ఇవి ఈ నాటి చరిత్ర. శ్రీ బూర్గుల రామకృష్ణారావు హైదరాబాద్ 
రాష్ట్ర ముఖ్యమంత్రి గా ప్రమాణ స్వీకార ఫోటోను చూశాక  నా ఆలోచనాకెరటాల చిత్రాన్ని మీముందు వుంచాను. మీ కామెంట్స్ కి ఎదురు చూస్తూ.. 

                                                                                  మీ పెండ్యాల వాసుదేవరావు.   

<!-- Google tag (gtag.js) --> <script async src="https://www.googletagmanager.com/gtag/js?id=G-1M93C8YK91"></script> <script> window.dataLayer = window.dataLayer || []; function gtag(){dataLayer.push(arguments);} gtag('js', new Date()); gtag('config', 'G-1M93C8YK91'); </script>


Sunday, March 5, 2023

మా నేలకొండపల్లి శ్రీ వేంకటేశ్వర స్వామి దేవాలయం.

73. (NKP..16). 

శ్రీ వేంకటేశ్వర స్వామీ దేవాలయ చరిత్ర.


ఆరు వందల సంవత్సరాల పైగా చరిత్ర గల నేలకొండపల్లి లోని  శ్రీ వేంకటేశ్వర స్వామీ దేవాలయాన్ని పూర్వకాలంలో "నాగుల్ దేవాలయం" గా పిలిచేవారు.నిజాం కాలం నుండి 1967 సంవత్సరంలో రాష్ట్ర దేవాదాయ శాఖ స్వాధీనం చేసుకునే వరకు "దేవల్ బాలాజీ" అని పిలిచేవారు.
యిక్కడ స్వామీ స్వయంభూ మరియు శేషావతారం.యిక్కడ కొలువైవున్న దేముడు భక్తుల కోరిక తీర్చే స్వామియని భక్తుల విశ్వాసం.

320 ఎకరాలు పైగా పొలం ఉన్నా అందులో 100 ఎకరాలు సుమారుగా సాగర్ కాలువ క్రింద పోయింది. మిగిలిన భూమిలో రేగులగడ్డా తండాలో 150 ఎకరాలు పోను నేలకొండపల్లి మరియు పరిసర గ్రామాల్లో ఉంది. 1967 వరకు ముంతకల్దారులు గా మరియు స్థానాచార్యులు గా 17 తరాలు "ముడుంబాయ్" వంశస్థులు వున్నారు. వారి కోరిక ప్రకారం తదుపరి శ్రీ మరింగంటి కృష్ణమాచార్యులు వచ్చారు. ఉత్సవ సమయాల్లో స్వామి వాహన దారులుగా బెస్త కులస్థులు ఆనాటినుంచి ఈనాటి వరకు తరాలు మారినా సాంప్రదాయం కొనసాగిస్తున్నారు. మహిమ మరియు చరిత్ర ఉన్న ఈ దేవాలయం గురించిన చారిత్రక ఆధారాలు/ శిలా శాసనాలు లేకపోవటం దురదృష్టకరం.

దేవాలయం తో అనుభంధం.
మా వూరికి (నేలకొండపల్లి) తూరుపు దిక్కున పొలాల మధ్యన, వూరికి దూరంగా ఉన్న వెంకటేశ్వర దేవాలయం చుట్టూ వాగు(తూరుపు మినహా) ఉంటుంది. ఈదులు గీయటానికి వచ్చే గౌడలు, వాగులో చాకళ్ళు ఉదయం నుంచి సందడి.1958 ప్రాంతంలో ధ్వజస్థంభాన్ని వేశారు. నేను మా జీప్ లో మా ఫాథర్ తో వెళ్లిన గుర్తుంది. వీధి దీపాలు లేకున్నా అ చీకెట్లోనే ప్రతి శనివారం వెంకటేశ్వర దేవాలయానికి స్నేహితులతో వెళ్ళేవాడిని. ధర్మకర్తల కమిటీ వచ్చేవరకు గ్రామ మాలీ పటేల్ శ్రీ రావులపాటి రంగారావు గారు ప్రతి శనివారం భజన హార్మొనీ వాయిస్తూ చేసేవారు. నేనూ అందులో పాలుపంచుకొనే వాడిని. దేవాలయం లోనికి వెళ్ళాలంటే కత్వా పైనున్న రాతి గోడ ఎక్కి దిగవల  సిందే. యువకులతో బాటు వ్రుద్హులు అయినా, స్త్రీలు అయినా పిల్లలు అయినా దైవ దర్శనం కావాలంటే అలా వెళ్ళవలసిందే. దేవాలయానికి దాహ్షిణ దిక్కుగా చారిత్రాత్మక బైరాగుల గుట్ట వుంటుంది. యువకులము అందరము గుట్ట ఎక్కటానికి ప్రతేకంగా వెళ్ళే వాళ్లము. ఆ రోజులు ఆ అనుభవాలే వేరు.

అభివృధ్హి పధాన దేవాలయం--దేవాదాయ శాఖ నియామక కమిటీ ఆవిర్భావం.
1967 సంవత్సరం లో శ్రీ పెండ్యాల సత్యనారాయణరావు చైర్మన్ గా నేలకొండపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామి దేవ స్తానానికి  ధర్మకర్తల మండలిని రాష్ట్ర ప్రభుత్వం నియమించింది.వారి ఆధ్వర్యంలో దేవాలయం అభివృద్ధి తో శోభను సంతరించుకుంది. దేవాలయ ప్రవేశానికి వాగుపై సిమెంట్ వంతెన కట్టారు. ఎలక్ట్రిసిటీ సదుపాయం కల్పించారు. తిరుమల నుంచి మైక్ సెట్ తెప్పించారు, చుట్టూ రాతి కాంపౌండ్ కట్టించారు.పూజారి కుటుంబ అవుసరాల నిమిత్తం రూమ్ కట్టించారు. కొంత కాలం గోశాల నిర్వహించారు. వాగు అవతల వున్న రాతి మండపంలో శ్రీరామనవమి ఉత్సవాలు భారీ ఎత్తున నిర్వహించారు. ఉప్పుదిమ్మెల దగ్గరనుండి దేవాలయం వరకు విద్యుత్ వీధి దీపాలు వేయించారు. దేవాలయ ప్రాంగణం అంతా నల్లరాయి కావటంతో వాస్తు కూడా అవుసరం కావటం వల్ల భావి తవ్వించే ప్రయత్నాలు ఫలించలేదు. ఆదాయ పెంపు మార్గాలకు మాత్రం ప్రయత్నాలు ప్రారంభించారు.

క్రింది ఫోటో దేవాలయ ప్రవేశం తరువాత దేవాలయ ప్రాంగణం.

క్రింది ఫోటోలో దేవాలయం ముందర కనిపిస్తున్న తెల్ల రాతి కట్టడమే  ముజ్జిగుడెం మరియు అనాసాగరం గ్రామాలకు రహదారి ఒకప్పుడు. కత్వాకు వరద వచ్చినప్పుడు జనాలు ప్రాణాలకు తెగించి నడిచే వాళ్ళు.

                       ఈ క్రింద ఫోటోలో వెంకటేశ్వర స్వామి దేవాలయం ముందు 
            కనిపించే రాతి గోడ కట్టడమే దేవాలయ ప్రవేశానికి పోయే రోడ్డు1968 వరకు.

First published on dt: 13.04.2018.

                                                                                      ------పెండ్యాల వాసుదేవ రావు/

<!-- Google tag (gtag.js) --> <script async src="https://www.googletagmanager.com/gtag/js?id=G-1M93C8YK91"></script> <script> window.dataLayer = window.dataLayer || []; function gtag(){dataLayer.push(arguments);} gtag('js', new Date()); gtag('config', 'G-1M93C8YK91'); </script>

నా సాహిత్య జ్ఞాపకాలు.

                         నా సాహిత్య జ్ఞాపకాలు.

72. (NKP..15). ). 

సాహిత్య జ్ఞాపకాలు.

ఏవేవో జ్ఞాపకాలు.

అవన్నీ నా సాహిత్య ప్రపంచానికి సంబంధించినవి.

ఎప్పుడు భావావేశం వస్తే అప్పుడే...

ఎక్కడవుంటే అక్కడే ...వెంటనే వచన కవితలు వ్రాసే వాడిని. వ్రాసిన తేదీ, సమయం కూడా అందులో వ్రాసేవాడిని.

అప్పుడు నా వయస్సు 17 సంవత్సరాలు.

అది 1972 వ సంవత్సరం. రాష్ట్ర రాజధాని హైదరాబాద్ లో "సిటీ కాలేజీ"లో బి.కాం చదువుతున్న రోజులు. ఒకరోజు ఏదో పనిబడి ప్రిన్సిపాల్ గారిని కలవటానికి వెళ్లి ఆయన రూమ్ ముందర ఉన్న బెంచీపై కూర్చున్నా. ఇంతలో ఒక భావావేశం వెన్ను తట్టింది. వెంటనే నా జేబులో ఉన్న పెన్ను వడివడిగా చేతులో ఉన్న నోట్ బుక్ లో ఉన్న తెల్ల కాగితం పైకి దూసుకెళ్లింది. భావం అక్షర రూపం దాల్చింది. దాని ఫలితమే.."నేను ఆశావాదిని...." అనే నా వచన కవిత.

కోటి ఆశలతో, రంగుల భవిష్యత్తు కలలతో వందల మైళ్ళ దూరంలో ఉన్న హైద్రాబాద్ మహానగరంలో అడుగిడిన ఆనంద క్షణాలు అవి. ఇంతలో ఒక విద్యార్థి వచ్చి నా ప్రక్కనే కూర్చుని నేను వ్రాసిన కవితను చదివి.." ఏమిటండీ మీ ఆనందం అంత ఉరక లేస్తోంది...ఈ సమాజాన్ని, ఈ పరిస్థితులను చూస్తుంటే మీకంత ఆశాజనకంగా కనిపిస్తోందా" అని చర్చ లేవదీశాడు. ఏవేవో చర్చించాము.

అతని పేరు శ్రీ ఎస్. వి. సత్యనారాయణ. మొన్నా మధ్య "తెలుగు విశ్వవిద్యాలం వైస్ ఛాన్సిలర్" గా వున్నాడు. 

ఈ సంవత్సరం College మాగజైన్  కు కవిత ఎందుకు పంపకూడదు, పంపించండి అన్నాడు. పంపాను. సెలెక్ట్ అయింది. 

ఆ కవిత వ్రాయటమూ ఓ అందమైన జ్ఞాపకం.

అది B. Com (తెలుగు) ఫస్ట్ ఇయర్ Econamics క్లాస్ రూమ్.మా లెక్చరర్ శ్రీ జయశంకర్(అటుతరువాత "ప్రొఫెసర్ జయశంకర్ సారు" గా సూపరిచితులు) ఒక ప్రక్క పాఠం చెబుతుండగానే నా చేతిలో ఉన్న పెన్ను ఎదురుగా బల్లపై వున్న నోటు పుస్తకములోని తెల్లకాగితంలో అక్షర ప్రవాహాన్ని పారించింది. ఒక ప్రక్కన జయశంకర్ గారిని గమనిస్తూ వచ్చిన భావావేశాన్ని అక్షరబద్దం చేయటంలో నిమగ్నమై ఉన్న నన్ను  నా ప్రక్కనే ఉన్న నా సహవిద్యార్థి ఇంద్రారెడ్డి(అటు తరువాత "ఉమ్మడి AP హోమ్ మంత్రి" గా సుపరిచుతులు) మధ్య మధ్యలో మోచేత్తో నన్ను ఎలర్ట్ చేసేవాడు. అప్పుడు వ్రాసిన కవితే " బాపూ మరోసారి రావూ". ఇదే college మాగజైన్ కు పంపా. ఆ కవిత వ్రాయటానికి ఆ పీరియడ్ టైం పట్టింది. ఆ కవితను మాగజైన్ వ్యవహారాలు చూసే మా తెలుగు లెక్చరర్ శ్రీ రెడ్డి గారికి ఇచ్చాను. ఏమిటీ ఇది ఇంత పెద్దగా ఉంది. దీన్ని నువ్వే వ్రాశావా అని అడిగారు. "అమృతం కురిసిన రాత్రి" లో శ్రీ తిలక్ వ్రాసినంత పొడవుంది.

తరువాత మళ్లీ కలసిన శ్రీ ఎస్.వీ.ఎస్ సలహా మేరకు OU కాంపస్ లోని ఆర్ట్స్ కాలేజ్ లో యూనివర్సిటీ లెవల్లో జరిగే సెమినార్ కు మా "సిటీ కాలేజ్" ప్రతినిధిగా హాజరు ఐనాను. అదే నాజీవితాన్ని మలుపు తిప్పింది. ఎందరో పరిచయమయ్యారు. సర్వశ్రీ దువ్వూరి చక్రపాణి (IAS), CH. పాండురంగ మూర్తి(రిటైర్డ్ ఆర్టీసీ రీజినల్ మేనేజర్, కపిల రామ్మోహన్ తదితరులు). వారి పరిచయం వల్లనే YMCA వక్తృత్వ సాహిత్య కళా సమితి కార్య క్రమాలలో చురుకుగా పాల్గొన్నాను.

Dr నాగినేని భాస్కర్ రావు పరిచయంతో "యువ భారతి" సాహిత్య కార్యక్రమాలలో లీనమయ్యే వాడిని. విశ్వనాథం గారితో పరిచయం ఎన్నో విషయాలను తెలుసుకోవటానికి దోహద పడింది.

"నేను ఆశావాదిని..."కవితను శ్రీ దాశరధి రంగాచార్యకు (ఆయన ఇంట్లో )చూపించాను. "సంతోష స్థంభాలు" అని నేను కవితలో వ్రాసిన పదం పై భాషా ప్రాతిపదికన అభ్యంతరం చెప్పారు. ఆశతో ఉండటం అవుసరమే..."అగ్గిలా" ఉండాలన్నారు.

అప్పటికప్పుడే..

"నేను అగ్గిని..

మండుతాను.. మండిస్తాను..

మండే మంటలతో వెలుగులు పండిస్తాను"...అని వ్రాశా..


-----------పెండ్యాల వాసుదేవరావు.

<!-- Google tag (gtag.js) --> <script async src="https://www.googletagmanager.com/gtag/js?id=G-1M93C8YK91"></script> <script> window.dataLayer = window.dataLayer || []; function gtag(){dataLayer.push(arguments);} gtag('js', new Date()); gtag('config', 'G-1M93C8YK91'); </script>


Saturday, March 4, 2023

నేలకొండపల్లి PHC స్థల వివాదం చరిత్ర.

71. (NKP..14). 

నేలకొండపల్లి ప్రాధమిక ఆరోగ్యకేంద్ర
స్థల వివాదం....36 సం.ల క్రిందటి మాట. 

36 సం.ల క్రిందటి మాట.    (1).


నేలకొండపల్లి ప్రాధమిక ఆరోగ్యకేంద్రం, స్థానిక కో-ఆపరటివ్ రూరల్ బ్యాంకు స్థలాల మధ్య సరిహద్దు వివాదం వచ్చింది. 

ఒక 30 సార్లు కనీసం సంబంధిత అధికారులు సర్వే చేసి నివేధికలిచ్చారు. వివాదమైతే ఇప్పటికీ అంతే ఉంది.

విశేషము ఏమంటే స్థానిక గ్రామపంచాయతీ వారు అందులో మా భూమి ఉందంటూ ఆ స్థలంలో జొరబడి కొంత స్థలాన్ని తమ శానిటరీ సిబ్బందికి ప్రభుత్వ నిధులతో ఇళ్లు కట్టించి ఇచ్చారు. రక్షిత మంచినీటి సరఫరా పథకానికి సంబంధించిన వాటర్ ట్యాంక్, వాచమన్ రూమ్ కట్టించారు. ఆ ఇళ్లకు దోవ/రోడ్డు క్రింద కొంత స్థలం కేటాయించారు. స్థానిక మహిళామండలి భవన నిర్మాణానికి భూమి కేటాయించారు.

ఇదే అదనుగా కొందరు షాప్స్ కట్టారు. మరికొందరు ఈ భూమి మాదే అంటూ గుడిసెలు వేశారు.

ఈ ప్రాంత MLA లు గా చేసినవారు వివిధ కాలాలలో రాష్ట్ర కేబినెట్ మంత్రులుగా చేశారు. అయినా వారు ఎన్నడూ ఈ స్థలాలపై దృష్టి పెట్టలేదు. అది ఈ ప్రాంత ప్రజల దురదృష్టం.
ఆ స్థలం చేసుకున్న పాపం.

ఒక దశాబ్దం పాటు స్థానిక ప్రింట్ మీడియాకు ఇదో పెద్ద హాట్ టాపిక్. సీరియల్ వ్యాసాలు వ్రాశారు. వారికి కొద్దిగా ఓపిక సన్నగిల్లినట్లుంది. ఇప్పుడేమి మాట్లాడటం లేదు.

కోసామెరుపు ఏమిటంటే ఇటీవలే గ్రామపంచాయతీ నిధులతో పబ్లిక్ టాయిలెట్స్ నిర్మిస్తే స్థానిక MLA రిబ్బన్ కత్తిరించాడు. రక్షిత నీటి సరఫరా కు సంబంధించిన వాటర్ ట్యాంక్ ను కులగొట్టే శారు. ఏవో అభివృద్ధి కార్యక్రమాలకు ఆ స్థలం కావాలట.

ఈ మధ్యనే అటుగా వెళ్తూ ఆ స్థలాన్ని చూశాను. చాలా బాగుంది. ఒక చిన్న కాలనీలా వుంది. పక్కా భవంతులతో, షాపులతో, ఆ భవంతులకు సిమెంట్ రోడ్డుతో నవ యవ్వనంతో ఉంది.

అటు వెళుతే మీరుకూడా ఒక లుక్కేయండి.

36 సంవత్సరాల క్రిందటి మాట.   (2).


నేలకొండపల్లి, సింగారెడ్డిపాలెం రెవిన్యూ గ్రామాల మధ్య సరిహద్దులో ప్రస్తుతపు మెయిన్ రోడ్డులో పాత బోదులబండ డొంక ప్రక్కనే ఉన్న సర్వే నెంబర్ 219/1 లో ఒకే పట్టేదారు నుండి మొదటగా సహకార గ్రామీణ బ్యాంక్ (ఒక ఎకరం), ఆ తరువాత ప్రాధమిక ఆరోగ్య కేంద్రం(2ఎకరాలు) కొనుగోలు చేసి రిజిస్టర్డ్ డాకుమెంట్స్ ను పొందాయి.

దశాబ్దాల తరబడి రెండు సంస్థల స్థలాలకు ప్రహరీ గోడలు లేకపోవటంతో స్థలాల్లో కొంత భాగం ఆక్రమణలకు గురిఅయింది. సహకార బాంకు 1961 నుండి కొన్ని కారణాల వల్ల 1975 వరకు కార్యకలాపాలు లేక Defunct కావటం ఆక్రమణ దారులకు వరం గా మారింది.

సహకార గోదామును 1983 సం. లో లక్మి మహిళామండలికి స్థానిక గ్రామ పంచాయతీ పాలకవర్గం ధారాదత్తం చేయటంతో వివాదం రాజుకుని క్రమంగా సమస్య పక్కదారులు పట్టి రాజకీయ కార్చిచ్చులా వ్యాపించింది. అది ఇప్పటికీ కాలుతూనే ఉంది.

ఆ స్థలం పాత ఫోటోలు మీకోసం.


36 సంవత్సరాల క్రిందటి మాట (3).

అసలు జరిగిందేమిటంటే ------ 1).


సింగారెడ్డిపాలెం రెవిన్యూ గ్రామానికి చెందిన 219/1 సర్వే నంబరులో రిజిస్టర్డ్ డాక్యుమెంట్  నంబర్ 139/59,తేదీ.3.3.1959 ప్రకారం సహకార గ్రామీణ బ్యాంకు కు ఒక యకరం భూమి, రిజిస్టర్డ్ డాక్యుమెంట్ నంబర్ 1915/60, తేదీ.3.12.1960 ప్రకారం ప్రాధమిక ఆరోగ్య కేంద్రానికి రెండు ఏకరముల భూమిని ఆ సర్వే నంబరు పట్టాదారు నుండి కొనుగోలు చేశారు. ఆ స్థల స్వరూపాన్ని తెలిపే మ్యాప్ క్రింద ఇవ్వబడింది. 


అప్పుడు సింగారెడ్డిపాలెం గ్రామం సాంకేతికంగా మృత గ్రామం.ఎవ్వరు నివాసం లేరు. 

పైన పేర్కొన్న రెండు సంస్థల భూమికి కాంపౌండ్ వాల్స్ కట్టలేదు. ఆ రోజుల్లో అవుసరమనిపించలేదు. ఇలా ఉండగా 1961 నుండి సహకార గ్రామీణ బ్యాంకు సహకాశాఖ విచారణలో మునిగి కార్యకలాపాలు స్తంభించి 1975 వరకు మూతపడి పోయినది. పి. హెచ్.సి కి ఒక భవనాన్ని కార్య కలాపాల అవుసరాలకు నిర్మించారు.

ప్రాధమిక ఆరోగ్య కేంద్రం మరియు సహకార గ్రామీణ బ్యాంకు స్థలాల ఉమ్మడి మ్యాపు క్రింద చూడవచ్చు. ఈ మ్యాపును ఈ రెండింటి స్థలాలను కొనుగోలు చేసిన అప్పటి గ్రామ సర్పంచ్ పెండ్యాల సత్యనారాయణ రావు గారి స్వహస్తాలతో రాశారు. 

ఇలాఉండగా 1971 సం.లో అప్పటి ఖమ్మం జిల్లాలో రక్షిత నీటిసరఫరా పథకమును ఖమ్మం జిల్లా కలెక్టర్(మెమోరాండం. నంబరు.6654/progs. Vll/70-71, తేదీ. 18.11.1971) మంజూరు చేశారు. అందులో నేలకొండపల్లి గ్రామ పంచాయతీ ఉంది. పాలవంచ, బూర్గంపాడు, బయ్యారం, సుజాత నగర్ తదితర 9 గ్రామ పంచాయతీలు కూడా ఉన్నాయి. దానికి గ్రామ ప్రజల తరఫున స్థానిక గ్రామ పంచాయతీ "పీపుల్స్ కంట్రిబ్యూషన్" కట్టవలసి రావటంతో దానికి ప్రత్యామ్నాయంగా ఖాళీగా ఉన్న ప్రాధమిక ఆరోగ్య కేంద్ర స్థలాన్ని చూపంచటంతో జిల్లాపరిషత్ నిధులతో వాటర్ టాంకు, వాచమన్ క్వార్టరు నిర్మాణం చేశారు. 

నిర్మాణం పూర్తి కాగానే RC. NO.100/1977, తేదీ. 1.4.77 ప్రకారం జిల్లాపరిషత్ ఇంజనీరింగ్ శాఖ వారు ఆ నిర్మాణాలను స్వాధీనంలోకి తీసుకొనమని స్థానిక గ్రామ పంచాయతీకి  ఉత్తరం వ్రాయటంతో తేదీ. 30.04.77 నాటి గ్రామపంచాయతీ సమావేశములో ఎజెండా.నం.7 ప్రకారం తీర్మానించి స్వాధీనం చేసుకున్నారు. స్వాధీనం చేసుకున్న భూమి ఎ.0.14. కుంటలుగా పేర్కొంటూ, దాని చుట్టూ సిమెంట్ స్తంభాలతో తీగ వేసి కాంపౌండ్ నిర్మించాలని తేదీ. 29.07.77 నాటి పాలకవర్గ సమావేశంలో గ్రామపంచాయతీ ఎజెండా.నం.33 ద్వారా తీర్మానిం చారు. అప్పటి నుండీ ఆ 0.14 కుంటల భూమి గ్రామ పంచాయతీ ఆధీనంలో ఉంది.


రక్షిత మంచినీటి సరఫరాపధకం అమలుకు, ప్రజాప్రయోజనాలకోసం మాత్రమే గ్రామ పంచాయతీ ఆస్థలాన్ని స్వాధీనంలో ఉంచుకొన్నందున గ్రామపంచాయతీకి  దానిపై యాజమాన్యపు హక్కు రాదు. వేరేవాళ్లకు బధలాయించే హక్కు రాదు.

ప్రస్తుతం అక్కడున్న వాటర్ టాంక్ ను కూలగొట్టినందున, రక్షిత నీటి సరఫరా లేనందున ఆ స్థలాన్ని తిరిగి ప్రాధమిక ఆరోగ్య కేంద్రానికి స్థానిక గ్రామ పంచాయతీ వారు అప్పగించవలసి ఉంది.

ఇది ఇలావుంటే ప్రాధమిక ఆరోగ్య కేంద్రానికి ఈశాన్య దిక్కున ఉన్న 205/1 సర్వే నం కు చెందిన 0.3 కుంటల స్థలం 0.8 కుంటాలుగా మారడంతో అక్కడ పక్కా భవనాలు వెలిశాయి. తూర్పు ఆగ్నేయ భాగాన పట్టేదారు వారసులు వేసిన గుడిసెలు నేడు పక్కా భవనాలైనవి. మరి ఇవన్నీ పరిష్కారం అయ్యే దెన్నడో...... చూద్దాము.


పైన వున్నమూడు ఫోటోలు పట్టేదారు వారసులవి.  
క్రింద వున్న ఫోటో ఆ స్థలానికి ఈశాన్యం మూలాన వున్న ఆక్రమిత నిర్మాణాలను చూడవచ్చు.
వివిధ సందర్భాలలో పత్రికలలో వచ్చిన వార్తా క్లిప్పింగులను చూడవచ్చు.

జిల్లా సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ విడుదల చేసిన నిధులతో స్థానిక గ్రామపంచాయతీ శానిటరీ సిబ్బందికి నిర్మించిన గృహాలు. 

FIRST PUBLISHED ON DT: 12.02.2021.ON FACE BOOK WITH PHOTOS.
AUTHOR. PENDYALA VASUDEVA RAO. PRESIDENT  CRB, NELAKONDAPALLY.

----పెండ్యాల వాసుదేవరావు 

<!-- Google tag (gtag.js) --> <script async src="https://www.googletagmanager.com/gtag/js?id=G-1M93C8YK91"></script> <script> window.dataLayer = window.dataLayer || []; function gtag(){dataLayer.push(arguments);} gtag('js', new Date()); gtag('config', 'G-1M93C8YK91'); </script>


Thursday, March 17, 2022

ఏంది సామీ!


70. (NKP..13). 

ఏంది సామీ?





ఏంది సామీ యిది ?        గీ చిచ్చు ఏంది?

సన్యాసివి కదా....జర సైలెంటుగా వుండరాదురి.
తరం మారే.  విలువలు మారిపాయే.

రామున్ని నిందించిండని, రామాయణాన్ని కించపరిచిండని కత్తి మహేష్ ని నగర బహిష్కరణ చేసినరు గందా. 

మన సమ్మక్క, సారలమ్మ వనదేవతలని , గ్రామదేవతలని అది ఇది అని అవమానించినోన్ని ఏమి చెయ్యాలే అని గొంతెత్తి అడుగుతున్నరండీ.  పడేండ్ల సంది గిట్లనె  మాట్లాడుతున్న రాంట . పాత వీడియో  చూపిస్తున్నారు. 


శివయ్య, పార్వతీదేవి  గురించి గట్లనే మాట్లాడితివి. పార్వతీ దేవి గురించి వెకిలిగా మాట్లాడితివి. 


దేవుడంటే కేవలం వైష్ణవం అని విషపు భావజాలం ప్రజల్లో నింపేటోన్ని నెత్తికెక్కిచ్చుకునుడు అవసరమా. సమతా మూర్తి విగ్రహాన్ని వేలకోట్లు ఖర్చు చేసి పెట్టినా  దేవుళ్లను సమానంగా చూడలేనోనివి ఇంక మనుషులనేం చూస్తవ్..?

పూర్వం సనాతన హిందూ ధర్మాన్ని అనుసరించే వాళ్లలో  శైవులు( శివ భక్తులు) ,వైష్ణవులు( విష్ణువు భక్తులు) అంటూ వర్గాలుగా విభజింపడ్డారు.. వీళ్లకు అస్సలు పడేది కాదు..మా దేవుడు గొప్ప అంటే మా దేవుడు గొప్ప అని పోట్లాడుకునేవారు..

చిన్న జీయర్ వైష్ణవుడు..కాబట్టి ఈయన దృష్టిలో దేవుడు అంటే కేవలం విష్ణువు (అవతార రూపాలు).. ప్రజలను అందరిని వైష్ణవం వైపు మళ్లించే ప్రయత్నం చేస్తున్నాడు..అందుకే పార్వతి పరమేశ్వరులపై ఇతర దేవుళ్ళపై విషం చిమ్ముతున్నాడు..

రామానుజులు గొప్పవాడంటే చిక్కు లేదు. ఆదిశంకరుల చిన్నబుచ్చుడు మేధావిగా  గొప్పవాడవ ని పేరు వస్తదని ఆశా సామీ..

మా తెలంగాణ తాత (ముఖ్యమంత్రి గారు) నీ మాయలో పడిపాయే. 


పుణ్యానికి వందలకొద్దీ భూములు, గుట్టలు ఇచ్చి నీకఇక్కడ పీట వేసి ఆశ్రమం ఏర్పాటు చేసే. యాదాద్రి పర్యవేక్షణ బాధ్యత అప్పగించే. అన్నీ వేల కోట్లే నాయే.  

ఇప్పుడు జీయర్ సామి  తెలంగాణ కల్చర్ నే అవమానిస్తుంటే చర్యలు తీసుకోరా?
మేక మాంసం, పంది మాంసం తినే వాళ్ళను ఏమెమో ఆంటివీ, నచ్చ చెప్పుడు లేకపోగా అవమానిస్తివి .

మా తెలంగాణ తాత నీ మాయలో పడి పాయే....
సంప్రదాయాల వలువలు పీకేస్తున్న కళ్ళప్పగించి చూస్తుండి  పాయే. నువ్వాడినది ఆట, పాడింది పాట. 

నరనరాల్లో పెనవేసుకు పోయిన యాదగిరిగుట్ట పేరును చరిత్ర శిధిలాల్లోకి నెట్టేసి, గుట్ట పేరు మార్చి  యాదాద్రిగా మార్చేస్తివ.-----వేల సంవత్సరాల యాదగిరి పేరు కనుమగయ్యే. 

తరతరాల భద్రాచలం రాముడిని రామనారాయణుడుగా మార్చి సీతారామ కళ్యాణంలో ప్రవరలు మారిస్తివి...


జనాలను ఎర్రి వెధవల  చేస్తున్నా అనుకుంటున్నావు  సామీ.. 
నీకిది తగదు. 

నీ పూర్వాశ్రమాన్ని గెలుకు తున్నారు. తగ్గు సామీ. తగ్గు. ఆల్లు తగ్గుతారు. 


మత పెద్ద హుందాతనం కాపాడురీ. 

                                                                               ---------PENDYALA VASUDEVARAO.


<!-- Google tag (gtag.js) --> <script async src="https://www.googletagmanager.com/gtag/js?id=G-1M93C8YK91"></script> <script> window.dataLayer = window.dataLayer || []; function gtag(){dataLayer.push(arguments);} gtag('js', new Date()); gtag('config', 'G-1M93C8YK91'); </script>

Sunday, February 27, 2022

ఖమ్మం జిల్లాలోని ఓ ఆర్ . టీ. సీ. బస్సు స్టాండు ....కధా.. మా వ్యధ..

69. (NKP...12). 

ఖమ్మం లో 

ఓ ఆర్ . టీ.  సీ. బస్సు స్టాండు ....కధా.. మా వ్యధ.. 


హలో సార్లూ!

క్రింది మొదటి రెండు ఫోటోలు గుర్తుపడతారా?
ఎక్కడివో చెప్పగలరా?

ఈ మధ్య ఆర్.టీ. సి. పెద్దసారు సజ్జనారు సారూ నెటిజన్లను ఈ ప్రశ్నే అడుగుతే తడుముకోకుండా రాష్ట్రం నలుమూలలా వున్నోల్లంతా " ఖమ్మం బస్సు స్టాండు " అని చె ప్పేసినృ . బావుందని మెచ్చుకున్నరు.

ఏంది మరి? ఏమనుకున్నారు.

రాష్ట్ర రవాణా శాఖా మంత్రి నియోజకవర్గమా? మజాకా?

మా ఖమ్మం బస్సు స్టాండు ఎప్పుడూ అంతేనండి.

మీకో విషయం తెలుసా?


శ్రీ జలగం వెంగళరావు రాష్ట్ర ముఖ్యమంత్రి గా వున్నప్పుడు ఇప్పుడందరికీ తెలిసిన పాత బస్సు స్టాండు ను కట్టించాడు. అంతకు ముందు రైల్వే స్టేషను ప్రక్కన బస్సులు ఆగేవి. అదే బస్సు స్టాండు అప్పుడు. పెరిగే అవుసరాల కొసమని పెద్దది కట్టించినరు.
క్రింద ఫోటోనే ఆ బస్సు స్టాండు.



బస్సు స్టాండు ప్రారంభోత్సవానికి తరువాతి ముఖ్యమంత్రి శ్రీ మర్రిచెన్నారెడ్డి వచ్చింరు{1979 లో అనుకుంటా) . రిబ్బను కత్తిరించే ముందు బస్సు స్టాండును అంతా చూసి, చేతిలో వున్న కర్రను ఊపుతూ "ఖమ్మానికి ఇంత పెద్ద బస్సు స్టాండా?" అన్నాడండి.

నేను ప్రక్కనే వున్నా. ఖమ్మం ఎమ్మెల్యే అనంత రెడ్డి గారి ప్రక్కనే వున్నా. మా నాయనగారితో వెళ్లిన.
ఇంతకూ ఇదంతా ఎందుకంటే...మా ఖమ్మం బస్సు స్టాండు ఎప్పుడూ ప్రత్యేకతని కలిగి ఉంటుందని చెప్పటానికే....

మరి నేలకొండపల్లి బస్సు స్టాండు పాపం ఏంటండీ?



1989 లో శ్రీ జి.వి. సుధాకర రావు జిల్లా in-charge మంత్రి ప్రారంభం చేసినప్పటి నుండి ఈ రోజు వరకూ బస్సులు బస్సు స్టాండు లోకి పోవు. బస్సులకై జనాలంతా రోడ్డు మీదే పడిగాపులు. ముసలోళ్లు, పిల్లలు, పిల్లల తల్లులు, గర్భిణీలు, పేషెంట్లు, వికలాంగులు, విద్యార్థులంతా రోడ్డు మీదే.ఎండకు, వానకు.

ఇదేమి ఖర్మండీ బాబు?


నియోజక వర్గం "OC"(UN reserved) అవుతే బాగని, లోకలోల్లు వుంటే బావుంటదని కృషి చేశామాండి..
సరే. బయటోల్లు వస్తే వచ్చారు. అదృష్టం కొద్దీ మంత్రులయ్యారా... కనీసం మా బస్సు స్టాండు బాధలు నయం చేయలేదు. కన్నెత్తి చూడలా...

ఇక్కడో విశేషం వుందండోయ్!


పాలేరు అసెంబ్లీ నియోజకవర్గం మొత్తం మీద వున్న ఏకైక బస్సు స్టాండ్ 30 సం. ల. క్రిందటనే కట్టారు. ఇప్పటివరకు ఇంకో చోట ప్రభుత్వం బస్సు స్టాండు కట్టలేదంటే నమ్మండి.

నియోజక వర్గాల పునర్విభజన(డీలిమిటేషను) జిల్లా కమిటీకి నేనే రథ సారధిని లేండి.ఢిల్లీ కూడా వెళ్ళా. కులదీప్ Singh గారితో కూడా కలిసినా. మూడేండ్లు కష్ట పడ్డా దీన్ని "OC" ను చేయటానికి. ఆశించిన ఫలితం దక్కినా నియోజక వర్గం లాభపడిందా? జనాలే చెప్పాలా!

బాధ నయం చేయకపోగా బస్సు స్టాండు బస్సు స్టాండు స్థలంలో కొంత (చాలా) కోత పెట్టి లీజు కిచ్చారు. మూసేశారు.

క్రింద వున్న చిత్రం. నేలకొండపల్లి బస్సు స్టాండ్ లేఔట్ మ్యాప్. ప్రస్తుతం బస్సు స్టాండ్ క్రింద వున్న స్థలము మరియు లీజుకు ఇచ్చిన స్థలముల కొలతలు క్రింది చిత్రంలో చూడవచ్చు.


అయ్యా ఎమ్మెల్యే గారూ, ఎంపీ గారూ, రవాణా మంత్రి గారూ జర ఇటు దృష్టి పెట్టరాదే..... పుణ్య ముంటాది.
బస్సు స్టాండ్ చరిత్ర కాస్త ఇనుకొరి, చెప్తా.

నేలకొండపల్లి మండల కేంద్రంలో వున్న APSRTC బస్సు స్టాండ్ ఆవరణ నిరుపయోగంగా వున్నదని భావించి ఖమ్మం రీజినల్ ఆర్టీసీ విభాగము వారు, ఉపయోగం లోకి తేవటానికి చర్యలు వదిలేసి, తేదీ: 06.05.2013 నుండి తేదీ: 05.05.2023 వరకు ఒక ప్రైవేటు వ్యక్తికి పది సంవత్సరాలకు ఫంక్షన్ హాల్ నడుపటానికి లీజుకు లైసెన్స్ (నెలకు రూ. 5000/- తరువాత దఫా, దఫాలు నిర్దేశిత పెంపుతో) ఇవ్వటం, తరువాత ప్రయాణీకుల విజ్ఞప్తి, నాయకుల జోక్యంతో ఇదివరకు కాంట్రాక్ట్ ఒప్పందం లో వున్న నిబంధనల మేరకు స్థలం వేకెట్ చేయటానికి, లీజు రద్దు notice ను సంబంధిత అధికారులు లీజుకు తీసుకున్న వ్యక్తికి పంపారు. లీజుకు తీసుకున్న లైసెన్స్ దారుడు తాను ఇప్పటికే రూ.50,00,000 లు ఖర్చు చేశానని కోర్టు మెట్లు ఎక్కి, తనకు న్యాయం చేయమనగా మళ్లీ ఇంకొక కొత్త యెగ్రిమెంట్ తో ఒప్పందం చేసుకున్నారు.
దాని తాలూకు బస్సు స్టాండ్ ప్లాన్ పైన ఇవ్వటం జరిగింది. దాని ప్రకారముగా కూడా తేదీ: 05.05.2023 న లీజుకు తీసుకున్న బస్సు స్టాండ్ ప్రాంగణంలోని స్థలాన్ని ఓపెన్ గా (నిర్మాణాలు తీసేసి) అప్పచెప్పాలి. ఎప్పుడైనా బస్సు ప్రయాణీకుల కష్టాలు తొలగుతాయని తలుస్తాము.

సజ్జనారు (TSRTC MD) సారూ!


తెలంగాణా పల్లెలలో చాలాచోట్ల ఇప్పటికీ బస్సు స్టాండులు లేవు. ఎప్పుడో దశాబ్దాల క్రింద మేము కస్టపడి తెచ్చుకున్న బస్సు స్టాండును, పక్కా భవన సముదాయాన్ని రోడ్డు రవాణా సంస్థ చిన్న చూపు చూస్తోంది. మా బస్సు స్టాండ్ లీజు కాన్సెల్ చేసి ప్రయాణీకుల కస్టాలు తీర్చండి మహాప్రభూ !

బస్సు ప్రయాణీకుల అవస్థల గమనిస్తారు అని ఆశ. ప్రజాగ్రహాన్ని గుర్తిస్తారు అని ఆశ.
----పెండ్యాల వాసుదేవరావు.
Vasudeva Rao Pendyala

<!-- Google tag (gtag.js) --> <script async src="https://www.googletagmanager.com/gtag/js?id=G-1M93C8YK91"></script> <script> window.dataLayer = window.dataLayer || []; function gtag(){dataLayer.push(arguments);} gtag('js', new Date()); gtag('config', 'G-1M93C8YK91'); </script>


Sunday, March 1, 2020

పాత కట్టడాల కూల్చి వదిలేస్తే అభివృద్ధి అయిపోతుందా? ఈ జన్మస్థల ప్రాంగణానికి అధీకృత నిర్వాహకులు ఎవ్వరు?

68. (NKP-11). 

నేలకొండపల్లి లోని శ్రీ  భక్తరామదాసు జన్మస్థలంలో అభివృద్దికి ప్రభుత్వ యంత్రాంగం శ్రీకారం చుట్టారు. సంతోషమే. రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ కే.సి.ఆర్ గారికి అభివందనాలు. ఎవ్వరు చేయని పని మీరు చేశారు.రెండోసారి బంగారు తెలంగాణా ఏర్పడ్డ తరువాత ఖమ్మం జిల్లా పాలనాధికారి పేరిట మూడు కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం జమ చేసింది.

శ్రీ భక్తరామదాసు జన్మస్థల ప్రాంగణంలో వున్న కంపౌండు గోడలను కూలగొట్టి, అంతకు ముందే మందిరం లోపల వున్న ఏకశిలా తెల్లరాతి విగ్రహానికి అదనంగా వేరొక విగ్రహాన్ని ఆరుబయట స్థాపిస్తే, కల్యాణమంటప నిర్మాణం చేపడితే అది అభివృద్ధిలో భాగమా?  అసలు జనాల కోరిక లేమిటి? జన్మస్థలంపై  ఆశలేమిటి? ప్రభుత్వానికి మార్గధర్శకులెవ్వరు? వాటి/వారి  చట్టభద్దత ఎంతవరకు?

 ప్రభుత్వం ఇచ్చిన సొమ్ము ఖర్చు ఎలా చెయ్యాలో నిర్దేశించిన వారెవ్వరూ? ప్లాన్ తయ్యారీదారులెవ్వరు? జన్మస్థల  ప్రాంగణానికి నాధుడెవ్వరు, అమ్మా, అయ్యా  ఎవ్వరు?

అదేమి ఖర్మమో తెలీదుకానీ రాష్ట్రప్రభుత్వ గెజిటు నోటిఫికేషన్ రాకపూర్వమే అప్పటి రాష్ట్రమంత్రి శ్రీ తుమ్మల నాగేశ్వరరావు స్థానిక శాసనసభ్యులుగా ఉన్నప్పుడు అభివృద్ధి కార్యక్రమాలకు శంఖుస్థాపన పేరిట  వున్న కంపౌండు గోడను కూల్చేశారు. స్థానికులు ఎన్నో శ్రమలకు ఓర్చి దశాబ్దాల తరువాత కట్టుకున్నగోడ అది. రెండేళ్లు దాటినా కూల్చిన దాన్ని మళ్ళీ కట్టలేదు.

ఈ 2020 సం.లో జరిగిన శ్రీ భక్తరామదాసు జయంతి కార్యక్రమాలకు పదిరోజుల ముందర శ్రీ భక్తరామదాసు జన్మస్థల ప్రాంగణంలో వున్న కొన్ని ధృడమైన పాత కట్టడాల కూల్చేశారు. అందులో ఆర్.సి.సి స్లాబ్ నిర్మాణంతో వున్న స్టేజీని(మొత్తము సిమెంట్ నిర్మాణమే), దాని వెనుక గ్రీన్ రూముగా ఉపయోగపడిన ఆర్.సి.సి నిర్మాణపు గది(ఇటుక, సున్నం నిర్మాణం) కూడా వుంది. ఈ స్టేజీ వద్దని ఒక సంఘమువారు  నైరుతి స్థలంలో ఒక గద్దె నిర్మాణం చేసి పైకప్పుగా ఐరన్ రేకులేసి కొంతకాలం కార్యక్రమాలను నడిపారు. ఆ వేదికపైనే దైవకార్యక్రమాలను శ్రీరామదాసు ధ్యానమందిర పూజారికూడా నిర్వహించారు. అది పిశాచస్థలం. దైవకార్యక్రమాలు అక్కడ నిషిద్దం. ప్రస్తుతం దాన్నికూడా కూల్చివేసి, అదే స్థలంలో  ఆర్.సి.సి స్లాబ్ కానీ, రేకులు కానీ లేకుండా మరొక గద్దె నిర్మాణం చేసి  వేదికపైననే జయంతి కార్యక్రమాల నిర్వహించింది జిల్లాయంత్రాంగం. జన్మస్థల ప్రాంగణంలో దక్షిణ దిక్కున, తూర్పుఆగ్నేయ భాగాన వున్న కంపౌండ్ గోడను కూడా కూల్చేశారు. కూల్చివేతలు కానరాకుండా అందమైన తెల్లటి బట్టల షామియానాతో  కప్పేసి కార్యక్రమాల నిర్వహణ జరగటం విశేషం.

భవనాల కూల్చివేతలో వచ్చిన కలపను, రేకులను ఎండకు ఎండి, వానకు తడవకుండా ఏర్పాటు చేస్తే మంచిది.

నేలకొండపల్లి లోని శ్రీ భక్తరామదాసు మందిర ప్రాంగణంలో దక్షిణభాగంలో కంపౌండుగోడ కూల్చివేత జరిగేముందు ఆ స్థలాన్ని చూపించే చిత్రం. అభివృద్ధి కార్యక్రమాల నిర్వహణకు ఉపయోగపడుతుందనే ఆలోచనతో స్థానిక మహిళామండలి వారు నిర్మించిన మంగళూరు పెంకు, ఇటుక సున్నపు కట్టుబడితో వున్న  రెండు రూములు మనం చూడవచ్చు.




క్రింది  చిత్రంలో 1963 లో శ్రీభక్తరామదాసు రిక్రియేషన్ క్లబ్  నిర్మించిన ఆర్.సి.సి రూఫ్ రూము మరియు 1978 లో లిబర్టీ యూత్ క్లబ్  నిర్మించిన స్టేజీ. దీని ముందు సోలార్ దీపాన్ని చూడవచ్చు. జన్మస్థల ప్రాంగణంలో ఇది రెండవ సోలార్ దీపం. బ్యాటరీ వేయించే నాధుడు లేక సంవత్సరాల తరబడి కాంతులు ఇవ్వలేక పోతోంది.

క్రింది చిత్రంలో ఆర్.సి.సి రూఫ్ స్టేజీని  కాదని నిర్మించిన వేరే స్టేజీని చూడవచ్చు. ప్రక్కనున్న రూంను గ్రీన్ రూంగా వాడితే బాగుండేది కానీ ఎన్నడు వాడలేదు. 
క్రింది చిత్రంలో కొత్తగా ఆరులక్షల రూపాయల ఖర్చుతో నిర్మింపజేసిన పది అడుగుల శ్రీ భక్తరామదాసు కాంస్య విగ్రహాన్ని చూడవచ్చు. దానికి ఎదురుగానే వున్న సోలార్ దీపాన్ని చూడవచ్చు. దానికి సంవత్సరాల తరబడి బ్యా టరీని వేసే నాధుడే లేదు. దీపపు కాంతులు లేవు. రాత్రి వేళలలో ఆ విగ్రహానికి అది రక్షణ కూడా.

కంపౌండ్ వుంటేనే ఆవరణలో మొలిచిన గడ్డిని తినటానికి గొడ్లు వస్తుంటాయి. కంపౌండ్ లేకుంటే ఇగ చెప్పేదేమి వుంది.విగ్రహానికి మాత్రం రక్షణ ఏమిటి? సోలార్ దీపాల వెలుగులో రాత్రి కాపలాదారు వుండాలి. పగలు వచ్చిన భక్తులు/యాత్రీకుల సౌకర్యార్ధం ఒక మనిషి వుండాలి. పూజారి తప్ప అక్కడ ఎవ్వరు బాధ్యత గల వ్యక్తులుండరు. ఆయన సమయం పూజ సమయం మాత్రమేనని గమనించాలి.



క్రింద చిత్రంలో కనిపించే స్టేజీ కొత్తగా నిర్మించింది. మంగళూరు పెంకుకు రంగేశారు. అంచులకు పగిలి పోయిన  పెంకులను మార్చే తీరిక యంత్రాంగానికి లేకుండా పోయింది. ఈ కూలిన గోడలను కానరాకుండా మూసేసి కార్యక్రమాల జరిపించింది జిల్లా యంత్రాంగం అందులో భాగమైన పర్యాటక శాఖ. జన్మస్థల ప్రాంగణాన్ని దత్తత తీసుకున్న భద్రాచల దేవస్థాన అధికారుల జాడ మాత్రం కనిపించలేదు.

మళ్ళీ వచ్చే సంవత్సరంలో రాష్ట్ర సాంస్కృతికశాఖ ఆధ్వర్యంలో జరిగే జయంతి వుత్సవాలలో మాత్రమే సంబంధీకులు కనిపిస్తారు. అప్పటివరకు ఈ స్థలప్రాంగణం అనాధయే. ఎవ్వరు రారు. ఏమీ పట్టించుకోరు. అస్సలు దీనికి, నిర్వహణకు అధికారిక నాదుడు ఏవ్వరండీ బాబు.

జిల్లా యంత్రాంగం మీరు ద్రుష్టి యిలా పెట్టండి. ఎవ్వరి ఇష్టం వచ్చినట్లు వాళ్ళు నిర్మాణాలు చేయకుండా కట్టడి చేయండి. చరిత్రను సక్రమంగా చెప్పండి.

ఒకసారి రెండు వేల సంవత్సర ప్రాంతంలో శ్రీ భక్త రామదాసు మందిర రేనవేషణ్ కార్యక్రమమని చెప్పి అప్పటి జిల్లా కలెక్టర్ శ్రీ గిరిధర్ మరియు ఎస్.పి శ్రీ సీతారామాంజనేయులు ఆధ్వర్యంలో శ్రీ మంగళంపల్లి బాలమురళీ క్రిష్ణ గారిని ఆహ్వానిస్తే ఈ మందిరం ఇప్పుడే కట్టినట్లు "తన చేతుల మీదుగా ప్రారంభించటం మహాద్భాగ్యమన్నారు". అది కమ్యునికేషన్ గాప్. నిర్వాహకులు అతిధికి వివరాలను సక్రమంగా విశదీకరించకపోయిన ఫలితమది.  ఇంకో విచిత్రం ఏమిటంటే "ఈ మందిరాన్ని తానే యిరవై సంవత్సరాల క్రింద నిర్మించినట్లు గుర్తు" అని జిల్లాకు చెందిన ఒక సీనియర్ మంత్రి గారు అనటం. ఆయన అప్పుడు స్థానిక శాసన సభ్యుడు. ఎందుకిలా జరుగుతుందో తెలియదు. చాలామంది ఈ తరం పిల్లలేకాక, పొరుగూరు భక్తులు కూడా ఈ ధ్యాన మందిరమే శ్రీ భక్తరామదాసు నివసించిన సొంతఇంటిగా అనుకుంటారు. ఆయన స్మారకంగా ఆయన జన్మించిన స్థలంలో నిర్మించిన మందిరమని చెప్పేవారుంటే ఇలా జరుగదు.
రాష్ట్ర సాంస్కృతిక సంస్థ శ్రీ భక్తరామదాసు జయంతి ఉత్సవాల నిర్వహణ  చేపట్టటం ఎంతో గర్వ కారణం, కానీ నిరుడు  ప్రధమంగా తన చేతులలోకి తీసుకున్న జిల్లాయంత్రాంగం  అట్టహాసంగా నిర్వహణను చేసి (బెలూనుకు యిరవై అయిదు వేల రూపాయలు, హైడ్రాలిక్ స్టేజీ ఏర్పాటుకు నాలుగు లక్షల రూపాయలు ఖర్చు చేసి) ఈ సంవత్సరం సామాన్యంగా లోగడ కార్యక్రమాల మాదిరే జరగడం.......భవిష్యత్తులో మరెలా కార్యక్రమాలు జరుగుతవోననే ఆందోళనకు ఆస్కారం అవుతోంది.యిలా కాకుండా శాశ్వత పరిష్కారం ఆలోచించాలి.

విషయ విశ్లేషణతో పదిమంది దృష్టికి వాస్తవ విషయాలు తీసుకు వస్తే పరిష్కారం దొరుకుతుందనే ఆలోచన ఈ వ్యాసం వ్రాయటానికి ప్రేరణ. ఎవ్వరినో విమర్శించాలనే వుద్దేశ్యం లేదు.

                                                                ----పెండ్యాల వాసుదేవరావు 

<!-- Google tag (gtag.js) --> <script async src="https://www.googletagmanager.com/gtag/js?id=G-1M93C8YK91"></script> <script> window.dataLayer = window.dataLayer || []; function gtag(){dataLayer.push(arguments);} gtag('js', new Date()); gtag('config', 'G-1M93C8YK91'); </script>

Thursday, June 13, 2019

WHAT IS THE TRUTH? WHO KILLED MAHATHMA?



(67). (Social--46). 

What is the truth ..who killed Mahatma?


"It is an universal truth that RSS killed Mahatma Gandhi..it need not to be proved in the Court". according to INC president Rahul Gandhi.

Here is one question.


Indian National Congress party ruled the country almost 60 years but unable to ban RSS. Why?

Why Nehru called RSS in Indian Republic parade when he was Indian Prime Minister?

Why Indira Gandhi shared the stage with RSS ?

BJP in a fix--They have to keep ascertaining that Godse was not an RSS man and Congress will continue bringing RSS history, it's a role in Freedom struggle, the true face of SAVARKAR, etc...

Sardar Vallabhai Patel whom the RSS claim as their own today wrote to Golwalkar explaining his reasons for banning the RSS, he said "were full communal poison... As a final result of the poison, the country had to suffer the sacrifice of the valuable life of Gandhiji. when the RSS men expressed joy and distributed sweets after Gandhi's death..under these conditions it became inevitable for the government to take action against the RSS.

The nation wants healthy discussion and wants truth who killed Gandhi? What are the reasons behind it?


Image may contain: one or more people and text
Image may contain: Narasimhulu Gokamalla, text and close-upNo photo description available.
First published by me on Facebook on dt: 13.06.2018.

<!-- Google tag (gtag.js) --> <script async src="https://www.googletagmanager.com/gtag/js?id=G-1M93C8YK91"></script> <script> window.dataLayer = window.dataLayer || []; function gtag(){dataLayer.push(arguments);} gtag('js', new Date()); gtag('config', 'G-1M93C8YK91'); </script>

హైకోర్టులో తెలుగులో వాదించవచ్చా? జిల్లా కోర్టులో పరిస్థితి ఏమిటి?

109. GEOPOLITICAL హైకోర్టులో తెలుగులో వాదించవచ్చా? జిల్లా కోర్టులో పరిస్థితి ఏమిటి? హైకోర్టులో మాతృభాషలో వాదించడం,  లిఖితపూర్వక వాదనలు,  జిల...