Friday, August 3, 2018

మా వరంగల్/ఖమ్మం జిల్లాలో ప్రధమ ధశాబ్ధంన్నర ఎన్నికల రాజకీయం.

 58. (ఖమ్మం చరిత్ర-6) 

మా వరంగల్/ఖమ్మం జిల్లా లో ప్రధమ దశాబ్ధం ఎన్నికల రాజకీయం.


అది 1949 సంవత్సరం నవంబెర్ 26 వ తేది, వరంగల్ పట్టణంలో అఖిల భారతీయ కాంగ్రెస్ పార్టీ ఆంధ్రా కాంగ్రెస్ నాయకుల సారధ్యం లో పెద్ద ఎత్తున సమావేశాన్ని ఏర్పాటు చేసింది.  ఆ సమావేశానికి శ్రీ టంగుటూరి ప్రకాశం పంతులు నేత్రుత్త్వం వహించారు. సర్దార్ వల్లభాయి పటేల్ ముఖ్యఅతిధిగా వచ్చారు. విశాలాంధ్ర ఏర్పాటుకు హైదరాబాద్ రాష్ట్ర ప్రజల మద్దతు సంపాదించటమే ఆ సమావేశ ముఖ్యోద్దేశ్యం. సహజం గానే హైదరాబాద్ లో సార్వత్రిక ఎన్నికలొస్తే ఎవ్వరు ముఖ్య మంత్రి అనే చర్చకూడా జరుగుతుంది. అంతర్గతంగా ఆ సమాలోచనలు కుడా జరిగాయి.

ఎన్నికలు జరుగుతే వరంగల్/ ఖమ్మం నుండి ముఖ్యమంత్రి కాండిడేట్ స్థాయి వున్న నాయకుడు కాంగ్రెస్ నుండి శ్రీ జమలాపురం కేశవరావు వున్నారు. కాంగ్రెస్ పార్టీ పై నిషేధం తొలగిన తరువాత ప్రప్రధమంగా శ్రీ జమలాపురం కేశవరావు హైదరాబాద్ రాష్ట్ర కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడిగా 1946-1949 వరకు పనిచేశారు. విశాలాంధ్ర భావనకు శ్రీ జమలాపురం వ్యతిరేకించాడు. పార్టీ లో ఒంటరి అయినాడు. అప్పుడే ఆయనను రాజకీయం గా అణగ దోక్కటానికి పావులు కదిపటం ప్రారంభం అయినది.

1949 హైదరాబాద్ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష ఎన్నికలలో శ్రీ జమలాపురం కేశవరావు గారు ఓటమిచెందారు.

అప్పుడే వివిధ నాయకుల మధ్యన ముఖ్యమంత్రి పదవిపై ఆశలు మొగ్గ తొడిగినవి. ఎవ్వరి లాబియింగ్ లు వారు చాపక్రింద నీరులా ప్రారంభించారు. 1952 సంవత్సరం లో ప్రధమ సారస్వత ఎన్నికలు వచ్చేసరికి ఈ రాజకీయాలకు హైదరాబాద్ రాష్ట్రంలో ఒక  స్వరూపము సంతరించుకుంది.

శ్రీ జమలాపురం కేశవరావు గారికి ఆయన సొంత నియోజకవర్గం మధిర అసెంబ్లీ సీటు దక్కకుండా శక్తి వంచన లేకుండా కృషిచేశారు. వారిలో జిల్లా, రాష్ట్ర స్థాయి నాయకుల హస్తాలున్నవి. కమ్మ్యునిస్ట్ ల కంచుకోట నర్సంపేట్ ఏరియాలోని పాకాల అసెంబ్లీ నియోజక వర్గాన్ని ఆయనకు కేటాయించారు. వారు వుహించినట్లే ఆయన ఎన్నికలలో ఓడిపోయారు.
శ్రీ జమలాపురం కేశవరావు గారి అడ్డు తొలగబోతున్నదనే  సంకేతాలను అందుకున్న ఖమ్మం ఏరియా కాంగ్రెస్  నాయకులు హైదరాబాద్ రాష్ట్ర  ముఖ్య మంత్రి పదవి పై కన్నేశారు. విశాలాంధ్ర ఏర్పడితే శ్రీ టంగుటూరి ప్రకాశం పంతులు గారే ముఖ్య మంత్రి అని అధిష్టానానికి లోగా వారు విన్న వించి ఉన్నారు.

కాంగ్రెస్ పార్టీని వర్గాలు లేకుండా ఏనాడు వూహించ లేము. కాంగ్రెస్ పార్టీ పుట్టిన  వెంటనే అవి మొదలు అయ్యాయి. ఉదాహరణకు మహాత్మా గాంధి అభీస్టానికి వ్యతిరేకంగా శ్రీ నేతాజీ సుభాష్ బోస్ ను కాంగ్రెస్ పార్టీ అద్యక్షుడి గా కాంగ్రెస్ఎ పార్టీ సభ్యులు ఎన్నుకొంటే, అధ్యక్షుడిగా గెలిచిన నేతాజీ సుభాష్చంద్ర బోస్  రాజీనామా చేసి పార్టీ నుండి బయటకు వెళ్ళేదాకా మహాత్మా గాంధీ ఊరుకోలేదు. అప్పుడు నేతాజీ పై ఆంధ్రాకు చెందిన శ్రీ భోగరాజు పట్టాభి సీతారామయ్య ఓడిపోయారు.

ఆంద్ర రాష్ట్రం ఏర్పడటానికి ముందు నుండే ఆంధ్రా నాయకుల మధ్యన వర్గాలు ప్రారంభం అయ్యాయి. ప్రత్యేక ఆంద్ర రాష్ట్రం ఏర్పడి శ్రీ టంగుటూరి ప్రకాశం పంతులు ముఖ్యమంత్రి అయిన తరువాత  మద్యపాన నిషేధం అమలును సాకుగా చూపి ప్రకాశం గారిని పదవి నుండి దించేశారు. అదే అదనుగా రెడ్డి సామాజిక వర్గమంతా అధికారం చేజిక్కిన్చుకోవటానికి పావులు కదిపారు. ఫలితంగా శ్రీ బెజవాడ గోపాలరెడ్డి ముఖ్య మంత్రిగా, శ్రీ నీలం సంజీవ రెడ్డి ఉప ముఖ్యమంత్రి గా అయ్యారు.

అక్కడ కులాల విభజన స్పష్టం గా కనబడుతుంది. అది మారిన ఆంధ్రా రాజకీయం.  

చరిత్ర గురించి మాట్లాడాలంటే కులాల గురించి మరియు వాటి ఉప కులాల గురించి కూడా చర్చించకుండా ఉండలేము. బ్రిటిష్ ఇండియాలో అయినా, ఆంధ్రాలో అయినా, హైదరాబాద్ రాష్ట్రంలో అయినా ఉద్యమాలలో అగ్ర వర్ణం వాళ్ళు, ముఖ్యం గా బ్రాహ్మిన్స్ అగ్ర భాగంలో వుండే వారు. వాళ్ళకున్న వేలాది ఎకరాల భూమిని, నెలవారీ వచ్చే వేలరూపాయల ఆదాయాన్ని త్రుణ ప్రాయం గా త్యాగం చేసి ఉద్యమాలు ప్రారంభించారు. బలహీన వర్గాలకోసం, అణగారిన ప్రజలకోసం ఉద్యమించారు.  నైజాంలో కూడా కమ్యూనిస్ట్ పార్టీ వ్యవస్థాపకులు అగ్ర వర్ణ భూస్వాములే. ఎక్కువ మంది బ్రాహ్మిన్స్ యే. వారు తమ ఆస్తి మొత్తాన్ని ఉద్యమంలో పోగొట్టుకున్నారు.

బ్రాహ్మిన్స్ లో వైదీకి, నియోగి ఫీలింగ్స్ ఎక్కువగా వున్న రోజులవి.  వరంగల్ జిల్లా విషయానికి వస్తే  కాంగ్రెస్ పార్టీ లో నియోగులే అగ్ర భాగాన వుండే వారు. వైదీకులు, నియోగులు మరియు కమ్మ సామాజిక వర్గం వారు కమ్యూనిస్ట్ ఉద్యమంలో వుండేవారు.

1953 Decemberలో States Re organisation Committee ని భారత ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఫలితమ గా  విశాలాంధ్ర ఏర్పాటుకు భారత ప్రభుత్వం లో వున్న కాంగ్రెస్ ప్రభుత్వం పచ్చ జెండా ఊపబోతున్నదనే విషయం స్పష్టం కాగానే ప్రభుత్వ ఏర్పాటుకు అటు ఆంద్ర రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ లోని వర్గాలు మరియు ఇటు హైదరాబాద్ రాష్ట్రంలోని కాంగ్రెస్ పార్టీ లోని వర్గాలు  అప్రమత్తం అయినాయి. ఉమ్మడి ఆంద్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి పదవికి పావులు కదిపినవి. ప్రధమమం లో పండిత జవహర్లాల్ విశాలాంధ్రకు వ్యతిరేకమైనా తరువాత ఆయనను ఒప్పించారు.

వరంగల్ జిల్లా లో కాంగ్రెస్ పార్టీ లో శ్రీ జమలాపురం కేశవరావు ను అణగత్రొక్కే చర్యలు ముమ్మరం అయినై. ఆయన వ్యతిరేక వర్గం శ్రీ అయ్యదేవర కాళేశ్వర రావు ను ఆశ్రయించినవి. శ్రీ టంగుటూరి ప్రకాశం పంచన చేరాయి. ఆయనే ముఖ్య మంత్రి అని ప్రచారం లో పాల్గొన్నవి. పరోక్షంగా ఆ పదవి తమకే కావాలని ఆలోచన.  శ్రీ జమలాపురం ఉద్యమ పంధా మనిషే తప్ప రాజ్యాధికారం కోసం తపించే వ్యక్తి కాదు. ఈ మనస్తత్వాన్ని ఆసరాగా పావులు వేగంగా కదిపినవి ఆ వర్గాలు.

అటు ఆంద్ర రాష్ట్రంలో ఉపముఖ్యమంత్రిగా వున్న నీలం సంజీవరెడ్డి ఉమ్మడి ఆంద్ర ప్రదేశ్త రాష్ట్ర ముఖ్యమంత్రి పదవికి తన రాజకీయ చదరంగపు ఎత్తులను  ప్రారంభించారు. శ్రీ టంగుటూరి ప్రకాశం పంతులు వ్యతిరేక వర్గంను ఆకట్టుకొనే ప్రయత్నాలు చేశారు.

శ్రీ కళా వెంకట్రావు మద్రాస్ ప్రెసిడెన్సీలో కాబినెట్ మినిస్టర్ గా సేవలందించిన వ్యక్తి. ఆంధ్రా కాంగ్రెస్ లో పెద్ద నాయకుడు.  ప్రత్యేక  ఆంధ్ర రాష్ట్ర  ఏర్పాటుకు మద్రాస్  రాష్ట్రం ఏర్పాటు చేసిన కమిటీ లో  కీలకమైన వ్యక్తి. ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీకి జనరల్ సెక్రటరీ గా సేవలందించిన వ్యక్తి. నైజాం వ్యతిరేక పోరాటం రోజులలో కాంగ్రెస్ మరియు కమ్యూనిస్ట్ నాయకులందరికీ విజయవాడ షెల్టర్ జోన్. కాంగ్రెస్ పార్టీ  నైజాం లో ఆవిర్భవించక ముందే ఆ పార్టీ పై  నైజాంలో నిషేధించినందువల్ల  కమ్యూనిస్ట్ లతో  కలిసి ఆంద్ర మహాసభ కార్యక్రమాలలో కాంగ్రెస్ పార్టీ  నాయకులు పాలు గొనటం వల్ల ఇరు ప్రాంతాల నాయకులకు మంచి పరిచయాలు, సంభంధాలు ఉండేవి.

నైజాం విమోచనం తరువాత శ్రీ పెండ్యాల సత్యనారాయణరావు కమ్యూనిస్ట్ పార్టీకి రాజీనామా చేసి స్వగ్రామానికి వచ్చిన తరువాత అప్పటి హైదరాబాద్ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ప్రెసిడెంట్ శ్రీ రామానంద తీర్ధ మరియు శ్రీ కళా వెంకటరావు ఆయనపై కాంగ్రెస్ పార్టీ లోకి రమ్మని వత్తిడి చేశారు. ఆయన సిద్ధాంత పరంగా నైజాం ఇండియాలో విలీనాన్ని వ్యతిరేకించిన కమ్యూనిస్ట్ పార్టీని విభేదిన్చాడే గాని పార్టీ పై ఆయనకు వ్యతిరేకత ఏమి లేదు. చాలా కాలం వరకు శ్రీ పెండ్యాల సత్యనారాయణ రావు ఎటువంటి నిర్ణయము తీసుకోన లేదు. శ్రీ కళా వెంకట్రావు గారు నేలకొండపల్లి కి రెండు మూడు సార్లు వచ్చి వెళ్ళారు. ఆ విధంగా వారి సంభంధాలు ఉండేవి. ఇక్కడి వారికి ఆయన ఎవ్వరో తెలియనందు వల్ల ఎవ్వరు గుర్తు పట్టే వాళ్ళు కాదు. ఈ సంభంధాలు తెలిసిన వరంగల్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అగ్ర నాయకులు కొందరికి పెండ్యాల సత్యనారాయణ గారి పొడ గిట్టేది కాదు. జమలాపురం కేశవరావు గారితో పెండ్యాల సత్యనారాయణరావు గారికున్న ఆత్మీయ అనుభంధం వారికి తెలియనిది కాదు. ఆయన కాంగ్రెస్ పార్టీ లోకి వస్తే తమకు రాజకీయ ప్రత్యర్ధి అవుతాడని వారి భయం. కమ్యూనిస్ట్ ఉద్యమంలో ఆయన నాయకత్వ పటిమను చూసారు. జిల్లాలో "ఆయన పేరు చెబితే పిట్టలు కుడా నీళ్ళు తాగేవి కాదు అని పేరు. ఆయన పేరు చెబితే శత్రువులకు సింహ స్వప్నం". ఈ విషయం ఎన్నో సందర్భంలలో శ్రీ దాశరధి రంగాచార్య చెబుతుండేవారు.

చివరకు 1956 లో శ్రీ నీలం సంజీవరెడ్డి దూతగా శ్రీ కళా వెంకట్రావు గారు శ్రీ పెండ్యాల సత్యనారాయణ రావు గారితో జరిపిన ఆంతరంగిక భేటీలో ఖమ్మం జిల్లా రాజకీయ పరిస్థుతుల బేరీజు వేసి జరిగిన నిర్ణయం మేరకు ఖమ్మం జిల్లా అసెంబ్లీ అభ్యర్థుల నిర్ణయం జరిగింది. అన్ని వర్గాలను కలుపుకుని పోయే విధం గా నిర్ణయం జరిగింది. ఆంద్ర ప్రదేశ్ రాష్ట్రం లో ప్రప్రధమంగా జరిగిన ఎన్నికల అనంతరం శ్రీ కళా వెంకట్రావు గారు నీలం సంజీవరెడ్డి గారి మంత్రి వర్గంలో కాబినెట్ హోదాలో రాష్ట్ర రెవిన్యూ మరియు ఆర్ధిక శాకా మాత్యులు గా పనిచేశారు.

నైజాం వ్యతిరేక ఉద్యమం రోజులలో వరంగల్ జిల్లా ఆంద్ర మహాసభ అధ్యక్ష, కార్యదర్శులుగా కలిసి పనిచేసినందువల్ల శ్రీ జమలాపురం కేశవరావు గారికి శ్రీ పెండ్యాల సత్యనారాయణరావు గారికి  సత్సంభందాలు ఉండేవి. సహజంగానే కేశవరావు గారికి ఆప్తుడైనందున కేశవరావు గారి వ్యతిరేక  వర్గం వచ్చే సార్వత్రిక ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని శ్రీ సత్యనారాయణరావు పై రాజకీయ దాడికి పావులు కదిపారు. వాటి ఫలితాలె జిల్లా రాజకీయాలను ప్రభావితం చేశాయి.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడిన తరువాత 1957 లో జరిగిన సారస్వత ఎన్నికల ఎన్నికల అభ్యర్థుల ఎంపిక తదనంతర పరిణామాల ఫలితం గా ఖమ్మం జిల్లా కాంగ్రెస్ పార్టీలో నూతన నాయకత్వ ఆవిర్భావానికి హేతువు అయినవి.జిల్లా రాజకీయ సమీకరణాలు పూర్తిగా మారిపోయాయి.

ఖమ్మం జిల్లా ఏర్పడిన నాటినుంచి జరిగిన పార్లమేంట్, అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఈ జిల్లా రాజకీయ పరిణామ క్రమాన్ని, ఆయా సమయాల్లో ప్రజల రాజకీయ భావాలను తేట తెల్లం చేస్తాయి.

మొదటి మూడు లోకసభ నియోజకవర్గం ఎన్నికలు.
ఖమ్మం లోకసభ నియోజకవర్గంలో 1952 ఎన్నికలలో PDF పేరుతో పోటీచేసిన  కమ్యూనిస్ట్ పార్టీ అభ్యర్థి శ్రీ టి.బి.విట్టలరావు కాంగ్రెస్ అభ్యర్థి శ్రీ గడియారం కృష్ణారెడ్డి పై 72.000 ఓట్ల తేడాతో గెలుపొందారు. సోషలిస్ట్ అభ్యర్ధి శ్రీ దేవులపల్లి రామానుజ రావు కు 16,000 ఓట్లు మాత్రమే వచ్చాయి. ఈ  ఎన్నికలు హైదరాబాద్ రాష్ట్రంలో జరిగినవి.

1957 ఎన్నికలలో ఖమ్మం లోకసభకు తిరిగి కమ్యూనిస్ట్ పార్టీ అభ్యర్థి శ్రీ టి.బి.విట్టలరావు కాంగ్రెస్ అభ్యర్ధి శ్రీ కొలిపాక కిషన్ రావు  పై కేవల నాలుగు వేల నాలుగు వందల ఓట్లతో గెలుపొందాడు. ఖమ్మం జిల్లా ఏర్పడ్డాక జరిగిన మొదటి ఎన్నికలు యివి.

1962 సంవత్సరం లో జరిగిన ఎన్నికలలో కాంగ్రెస్ అభ్యర్థి  శ్రీమతి లక్ష్మికాంతమ్మ కమ్యూనిస్ట్ పార్టీ అభ్యర్థి శ్రీ టి.బి.విట్టలరావు పై 17,000 ఓట్ల ఆధిక్యం తొ  గెలుపొందారు.

1964 లో ఉమ్మడి కమ్యూనిస్ట్ పార్టీ CPI, CPM లు గా విడిపోవటంతో తన ప్రాభవాన్ని తదుపరి ఎన్నికల రణరంగంలో చూప లేకపోయినవి. కాంగ్రెస్ అభ్యర్థులే వరుస విజయాలు సాధించారు.

అసెంబ్లీ నియోజకవర్గ ఎన్నికల స్వరూపం.
అసెంబ్లీ నియోజకవర్గాల విషయానికి వస్తే ఖమ్మం జిల్లా ఏర్పడనప్పుడు ఖమ్మం ప్రాంతంలో  1952 సంత్సరములో నాలుగు, 1957 లో ఐదు అసెంబ్లీ నియోజక వర్గాలు ఉండేవి. మొదటి రెండు ఎన్నికలలో ఖమ్మం మరియు ఎల్లందు అసెంబ్లీ నియోజక వర్గాలు ద్విసభ్య నియోజక వర్గాలుగావుండేవి (ఖమ్మం అసెంబ్లీ నియోజకవర్గంలో ఒక OC, ఒక SC అభ్యర్థిని, ఎల్లందు అసెంబ్లీ నియోజకవర్గంలో ఒక OC, ఒక ST అభ్యర్థిని ఎన్నుకోవలసి వుండేది).  1962 లో అసెంబ్లీ ఏడు నియోజక వర్గాలు గా పెరిగినవి. 1978 నుండి తొమ్మిది నియోజక వర్గాలుగా మారినవి. 2009 లో అవి పది నియోజక వర్గాలయినవి.

మొదటి మూడు అసెంబ్లీ నియోజక వర్గ ఎన్నికలు.

 1952 అసెంబ్లీ ఎన్నికలలో మొత్తం నాలుగు అసెంబ్లీ సీట్లలో కమ్యూనిస్ట్ అభ్యర్ధులే గెలిచారు. ఖమ్మంలో శ్రీ కర్నాటి కృష్ణయ్య, ఎల్లందులో శ్రీ కె. ఎల్. నరసింహారావు, మధిరలో  శ్రీ కొండబోలు వెంకయ్య, వేమ్సూర్ లో శ్రీ కందిమళ్ళ రామకృష్ణారావు (అశ్వారావ్ పేట బాబు) లు PDF పేరిట గెలుపొందారు. ఖమ్మం ప్రాంతంలో కాంగ్రెస్ పార్టీకి చెందిన్ నాయకులంతా ఓటమి చెందారు. ఓటమి చెందిన వారిలో సర్వశ్రీ జమలాపురం కేశవరావు (ఈయన వరంగల్ ప్రాంతం పాకాలలో  పోటిచేశారు), మాడపాటి రామచంద్రరావు (మధిర అసెంబ్లీ---మధిర, ఎర్రుపాలెం, బోనకల్లు, చింతకాని ఏరియాలు కలిగిన నియోజక వర్గం), కొలిపాక కిషన్ రావు (ఖమ్మం అసెంబ్లీ---ప్రస్తుత పాలేరు, ఖమ్మం అసెంబ్లీ నియోజక ప్రాంతాలు), బొమ్మకంటి సత్యనారాయణరావు (వేమ్సూర్ అసెంబ్లీ --వైరా, తల్లాడ, కల్లూరు, లంకపల్లి, వేమ్సూర్ ప్రాంతాలు నియోజక వర్గంలో వున్నవి) ఉన్నారు.  

1957 అసెంబ్లీ ఎన్నికలలో రాజకీయ ముఖ చిత్రం మారింది. కాంగ్రెస్ఖ పార్టీ విజయధంకా మ్రోగించింది. ఖమ్మం OC స్థానం, మధిర, వేమ్సూర్, పాల్వొంచలలో కాంగ్రెస్ అభ్యర్థులు మరియు ఎల్లందు OC, ST స్థానాలు మరియు ఖమ్మం SC స్థానంలలో  కమ్యూనిస్ట్ పార్టీ అభ్యర్థులు  గెలుపొందారు.

1962 అసెంబ్లీ ఎన్నికలో ఖమ్మం(శ్రీ నల్లమల గిరిప్రసాద్), పాల్వోంచ, బూర్గంపాడు మరియు ఎల్లందు(శ్రీ K.L.నరసింహారావు) నియోజక వర్గాలలో కమ్యూనిస్ట్ అభ్యర్ధులే గెలుపొందారు. మిగతా పాలేరు(S.C) శ్రీ కత్తుల శాంతయ్య, మధిర (శ్రీ దుగ్గినేని వెంకయ్య). వేంసూరు(శ్రీ జలగం వెంగళరావు) నియోజక వర్గాలలో కాంగ్రెస్ అభ్యర్థులు గెలుపొందారు. ఖమ్మం నియోజక వర్గంలో కమ్యూనిస్ట్ అభ్యర్థి శ్రీ నల్లమల గిరిప్రసాద్ కాంగ్రెస్ అభ్యర్థి శ్రీ పర్చా శ్రీనివాసరావు పై గెలుపొందారు.

మొదటి మూడు అసెంబ్లీ ఎన్నికలలో వరుస విజయాలను సాధించిన కమ్యూనిస్ట్ అభ్యర్థి శ్రీ K.L.నరసింహారావు మాత్రమే. అప్పటి వరకు వరుస విజయాలను నమోదు చేసుకున్న కాంగ్రెస్ అభ్యర్దులుకుడా ఎవ్వరు లేరు.

1964 సంవత్సరంలో అవిభక్త కమ్యూనిస్ట్ పార్టీ  CPI, CPM లుగా  చీలి పోవటం తొ తరువాత జరిగిన అసెంబ్లీ ఎన్నికల రాజకీయ సమీకరణ లలో మార్పులు సంభవించాయి. 1967 మరియు ఆ తరువాత జరిగిన ఖమ్మం అసెంబ్లీ ఎన్నికల చరిత్ర మహాభారతమంత వుంది. ఎత్తులు, పై ఎత్తులు రాజకీయ చదరంగాలే. సిద్ధాంత ప్రభావాలు ఏమీలేవు. 
క్రింద వున్న ఫోటో జిల్లా కాంగ్రెస్ ఆఫీస్ బిల్డింగ్ శంకుస్థాపన కార్య క్రమం. చిత్రం లో జిల్లా కాంగ్రెస్ నవ సారధులు వున్నారు. శంకుస్తాపనా కార్య క్రమాన్ని రాష్ట్ర ముఖ్య మంత్రి శ్రీ నీలం సంజీవ రెడ్డి చేశారు. మెడలో దండతో వున్న వారు శ్రీ సంజీవరెడ్డి. ఆయనకు కుడి వైపున శ్రీ జలగం వెంగళరావు, ఎడమవైపున శ్రీ శీలం సిద్దారెడ్డి వున్నారు. వెంగళ రావు గారికి కుడివేపునుండి వరుసగా సర్వశ్రీ అల్లూరి సత్యనారాయణ రాజు, J.V. నరసింగరావు, కాసు బ్రహ్మానందరెడ్డి, కోట పున్నయ్య, పెండ్యాల సత్యనారాయణరావు, గోగినేని సత్యనారాయణ, హీరాలాల్ మోరియా వున్నారు.
శ్రీ శీలం సిద్దారెడ్డి గారికి ఎడమ వయిపున సర్వశ్రీ జలగం కొండలరావు, ఎల్లంపల్లి రామచంద్రయ్య, లక్కినేని నరసయ్య, కొలిపాక కిషన్రావు  ఇతరులు వున్నారు.



మొదటి సార్వత్రిక ఎన్నికల దగ్గర నుండి వేమ్సూర్, ఖమ్మం మరియు మధిర అసెంబ్లీ నియోజక వర్గాలు ప్రత్యేకతను కలిగి వున్నాయి.  

ఆ  నియోజక వర్గాల విశ్లేషణ వచ్చే వ్యాసం లో..

                  .......PENDYALA VASUDEVARAO.

<!-- Google tag (gtag.js) --> <script async src="https://www.googletagmanager.com/gtag/js?id=G-1M93C8YK91"></script> <script> window.dataLayer = window.dataLayer || []; function gtag(){dataLayer.push(arguments);} gtag('js', new Date()); gtag('config', 'G-1M93C8YK91'); </script>

Monday, July 9, 2018

నైజాం సంస్థానంలో CPI ఆవిర్భావం -- పరిణామాలు.

57. (ఖమ్మం చరిత్ర-5) 

నైజాం సంస్థానంలో  CPI పార్టీ ఆవిర్భావం - తదనంతర పరిణామాలు.


CPI పార్టీ బ్రిటిష్ ఇండియాలో 1925 సంవత్సరంలో కాన్పూర్లో అధికారికంగా ప్రారంభించ బడినది. అంతకుముందు తాష్కెంట్లో 1920 సంవత్సరంలో పార్టీమేనిఫెస్టోను తయ్యారుచేశారు. CPI వ్యవస్థాపకులు  శ్రీ మానవేంద్ర నాథరాయ్ అనే విషయం గమనార్హం.

1934 సంవత్సరంలో బ్రిటిష్ ఇండియాలో అంతర్భాగం అయిన ఆంధ్రఏరియాలో CPI పార్టీ ఆంధ్ర ప్రొవిన్సియల్ కమిటీ పేరిట ఆవిర్భవించింది. 1940 సంవత్సరంలో బ్రిటిష్ ఇండియాలో కమ్యునిస్ట్ పార్టీని నిషేధించారు. 1939 సంవత్సరంలో నైజాం సంస్థానంలో CPI పార్టీ ఆవిర్భవించింది. అప్పట్లో నైజాంకు వ్యతిరేకంగా గ్రంధాలయోద్యమంతో పాటు  1). కామ్రేడ్స్ అసోసియేషన్, 2), ఆంద్ర మహాసభ, 3). మహారాష్ట్ర పరిషద్ మరియు 4). వందేమాతరం పేరిట కార్యక్రమాలు నడుస్తుండేవి. వీటిలో గ్రామీణ ప్రాంతాలలో ఆంద్రమహాసభ కార్యక్రమాల ప్రభావం ఎక్కువగా వుండేది. ఆంద్రమహాసభలో శ్రీ పెండ్యాల సత్యనారాయణరావు, కామ్రేడ్స్ అసోసియేషన్ లో శ్రీ ముఖ్దూం మొహియుద్దీన్, వందేమాతరంలో శ్రీ సర్వదేవభట్ల రామనాధం లాంటి సోషలిస్ట్ ఆలోచనా విధానం కలిగిన యువకులు చురుకుగా వుండేవాళ్ళు.

ఆంధ్రాలో Communist Partyపై నిషేధం విధించి వుండటంవల్ల మునగాల పరగణాలో Under Ground లో వున్న శ్రీ చండ్ర రాజేశ్వర రావు వీళ్ళతో Touch లో ఉండేవారు. ఆంద్ర మహాసభలో చురుకుగా వున్ననల్లగొండ జిల్లాకు చెందిన  శ్రీ రావి నారాయణరెడ్డి అప్పుడు మితవాదిగానే ఉండేవారు. పార్టీ ఆవిర్భవించిన తరువాత కొంతకాలానికి పార్టీలో ప్రవేశించారు. దాదాపు ఆ సమయంలోనే పై చదువులు ముగించుకొని వచ్చిన శ్రీ దేవులపల్లి వెంకటేశ్వరరావు తను ఫుల్ టైం వర్కరుగా  పనిచేయటాని ఆంధ్రా కమ్యునిస్ట్ ప్రొవిన్సియల్ కమిటీకి అనుమతికై దరఖాస్తు చేసి ఉన్నారు.

అప్పుడు శ్రీ చండ్ర రాజేశ్వరరావు బ్రిటిష్ ఇండియాకు చెందిన క్రిష్ణాజిల్లా Communistపార్టీకి జనరల్ సెక్రటరీగా ఉండేవారు.. నైజాం సంస్థానంలో ప్రవేశించాలంటే మునగాల పరగణా నుండి నేలకొండపల్లి గ్రామం ప్రవేశద్వారంగా వుండేది. ఆకారణం వల్లనే ఆంధ్రానాయకులంతా నేలకొండపల్లి వచ్చేవాళ్ళు. అక్కడ వాళ్ళకు  విరాట్రాయాంధ్ర గ్రంధాలయం సమావేశ వేదికగా వుండేది.

శ్రీ పెండ్యాల సత్యనారాయణరావు ప్రేరణతో శ్రీ పెరవెల్లి వెంకటరమణయ్య తాను మధిర పట్టణం లో చేస్తున్న S.I of Police ఉద్యోగానికి రాజీనామా చేసి కమ్యునిస్ట్  ఉద్యమంలో చేరాడు.

శ్రీ పెరవెల్లి వెంకటరమణయ్య ఆధ్వర్యంలో నైజాం రీజియన్ కమ్మ్యునిస్టుపార్టీ ఆవిర్భవించింది. స్టేట్ కమిటీలో కుడా ఖమ్మం నాయకులే ఎక్కువగా ఉండే వారు. ఒక క్రమంలో తరువాత పార్టీ విస్తరించింది. పార్టీ ఆవిర్భవించగానే మొట్టమొదటగా నేలకొండపల్లి, గోకినపల్లి, తల్లంపాడు, తిరుమలాయపాలెం, సిరిపురం, అల్లినగరం గ్రామాలలో పార్టీశాఖలు ఏర్పడ్డాయి.  చాలా కాలం వరకు కమ్యూనిస్ట్ పార్టీ నైజాంలో ఆవిర్భావం  జరిగినట్లు ప్రభుత్వవర్గాలు పసిగట్ట లేకపోయాయి. చాప క్రింద నీరులా పార్టీ నిర్మాణం జరిగింది. నైజాంలో ఫస్ట్ అండర్ గ్రౌండ్ పార్టీ కమ్యునిస్ట్ పార్టీనే.

ఇక జిల్లాకమిటీల  విషయానికి వస్తే మొట్టమొదటి కమిటీ వరంగల్లు జిల్లాలోనే ఏర్పాటు అయినది. జిల్లా జనరల్ సెక్రటరీగా శ్రీ పెండ్యాల సత్యనారాయణరావు వుండేవారు. ఆ తరువాత నల్లగొండ జిల్లా కమిటి ఏర్పాటు అయినది. ఆ జిల్లాకు శ్రీ దేవులపల్లి వెంకటేశ్వరరావు పార్టీ జనరల్ సెక్రటరీ గా ఉండేవారు. జిల్లా సెక్రటరీలంతా కుడా స్టేట్ సెక్రెటరియేటులో  వుండేవారు. పార్టీ ప్రణాళికలో భాగ స్వాములుగా వుండేవారు.

వరంగల్ జిల్లా పోరాటాలకు ఖమ్మం తాలుకా కేంద్ర బిందువుగా వుండేది. ఖమ్మం తాలూకా కమ్మ్యునిస్ట్ పార్టీ రాజకీయ కేంద్రస్థానం నేలకొండపల్లిలోనే వుండేది. ఖమ్మం తాలూకా పార్టీ జనరల్ సెక్రటరీ శ్రీ K.L.నరసింహారావు  నేలకొండపల్లిలోనే వుండి పార్టీ కార్యకలాపాలు నిర్వహించే వారు.

బ్రిటిష్ ఇండియాకు చెందిన మద్రాస్ ప్రెసిడెన్సీలోని ఆంధ్రాలో కమ్యునిస్టుపార్టీ కార్యక్రమాలు ఎక్కడ పెట్టుకున్నాఅక్కడి కాంగ్రెసుపార్టీ కార్యకర్తలతో  ఘర్షణలు జరుగుతుండేవి. కమ్యూనిస్టు  పార్టీ  స్వాతంత్రసమరంలో వాళ్ళతో పాటు భాగస్వాములు కావటంలేదని కాంగ్రెసుపార్టీ అభియోగం. నైజాం సంస్థానంలో పరిస్థితులు వేరు. నైజాంలో మాత్రం ఆంద్రమహాసభ వేదికగా కాంగ్రెస్, కమ్మ్యునిస్టులు కలిసే పనిచేసేవాళ్ళు. సిద్ధాంతాలు వేరైనా 12 వ ఆంద్ర మహాసభ వరకు కలిసే పనిచేశారు. వరంగల్లుజిల్లా ఆంద్రమహాసభకు ప్రెసిడెంటుగా శ్రీ జమలాపురం కేశవరావు, జనరల్ సెక్రటరీగా శ్రీ పెండ్యాల సత్యనారాయణరావు వుండేవారు.

నైజాంలో కాంగ్రెసువారు మరియు కమ్యూనిస్టులు 12 వ ఆంద్రమహాసభతో విడిపోయారు. మొట్టమొదటి పూర్తి కమ్యూనిస్టు ల వేదిక 12 వ ఆంద్ర మహాసభ 1945 సంవత్సరంలో మార్చ్ 26-28 తేదీ వరకు ఖమ్మం ప్రక్కనున్న ఖానాపురం హవేలీ గ్రామంలో శ్రీ పెండ్యాల సత్యనారాయణరావు ఆధ్వర్యంలో జరిగింది. ఆరోజుల్లో ఆసమావేశానికి 40 వేలమంది ప్రజలు వచ్చారు. ఆ సమావేశంలో 13 వ ఆంద్రమహాసభకు ప్రెసిడెంటుగా శ్రీ బద్దం ఎల్లారెడ్డి, ఉపాధ్యక్షులుగా శ్రీ పెండ్యాల సత్యనారాయణరావు ఎన్నికఅయ్యారు. ఈ సమావేశానికి శ్రీ పుచ్చలపల్లి సుందరయ్య అతిధిగా వచ్చారు. కమ్యూనిస్టుపార్టీపై నిషేధం వుండటంవల్ల సమావేశంలో శ్రీ సుందరయ్యగారు మాట్లాడలేదు. సమయం వచ్చినప్పుడు మాట్లాడతానని చెప్పారు. 12 వ ఆంద్ర మహా సభ జరిగిన వెంటనే 1946 సంవత్సరంలో నైజాంలో ఆంద్రమహాసభను  కూడా నిషేధించటంతో అదే చివరి సమావేశం అయినది.

1946లో న్యూడిల్లీలో జరిగిన అఖిల భారతీయ సంస్థాన సంఘటన్ సమావేశం తరువాత ఉద్యమం నైజాం వ్యతిరేక సాయుధ పోరాటం పంధాన వెళ్ళుటకు కమ్యునిస్ట్ పార్టీ నిర్ణయం తీసుకుంది. న్యూ ఢిల్లీలో జరిగిన సమావేశానికి రాష్ట్ర కమ్యూనిస్ట్ పార్టీ AD HOC కమిటీ మెంబరుగా శ్రీ పెండ్యాల సత్యనారాయణరావు హాజరు అయినారు.

పోరాటం ఆరంభం అయినది. 1946 సంవత్సరంలో కమ్యూనిస్ట్, మరియు ఆంద్రమహాసభలపై  నిషేధం వున్నకారణంగా బోర్డరు క్యాంపులు  ఏర్పాటు చేయబడ్డాయి. పార్టీఆఫీసులు విజయవాడకు మళ్ళించబడినవి.

అంతకు ముందు 1946 సంవత్సరంలో ఇండియాకు స్వాతంత్రం రాకముందే శ్రీ జవహర్లాల్ నెహ్రు ప్రధానమంత్రిగా కేంద్రంలో ప్రభుత్వంను బ్రిటిష్ వాళ్ళు ఏర్పాటు చేశారు. ఆ ప్రభుత్వంతో ఒక సంవత్సర కాలానికి నైజాంప్రభుత్వం Standstill Agreement ను కుదుర్చుకుంది. అప్పుడే నైజాం సంస్థానంలో కాంగ్రెసుపార్టీ మీద వున్న నిషేధాన్ని ఎత్తివేశారు. నిషేధం ఎత్తివేసిన  సమయంలోనే మహాత్మాగాంధి మద్రాస్ నుండి రైలులో వెళుతూ మార్గమధ్యంలో  ఖమ్మంలో  ఉపన్యసించారు. కాంగ్రెసుపార్టీపై నిషేధం ఉన్న సమయంలో కార్యకలాపాలు విజయవాడ నుండి జరిగేవి. శ్రీ V.B. రాజు ఆఫీస్ ఇంచార్జీగా వుండేవారు. నిషేధం తొలగిన తరువాత కాంగ్రెసుపార్టీకి నైజాంరాష్ట్రపార్టీ ప్రెసిడెంటు గా శ్రీ నానాల్, ప్రధాన కార్యదర్శిగా శ్రీ మాడపాటి రామచంద్రరావు వుండేవారు.

బ్రిటిష్ ఇండియా కమ్యునిస్టుఉద్యమం గురించి చెప్పేటప్పుడు శ్రీ P.C.JOSHIని మరువలేరు. ఆయన ద్రుఢమైన మాస్ లీడర్. బ్రిటిష్ ఇండియా కమ్యూనిస్టుపార్టీకి  జనరలుసెక్రటరీ. ఎంతోమంది యువకులకు దిశానిర్దేశం చేసినవారు. ఒకసారి 36 గంటల పాటు ఏకబిగిన ఉపన్యసించారు. శ్రీ పుచ్చల పల్లి సుందరయ్య వివాహంకూడా ఆయన సమక్షంలోనే బొంబాయలో నిరాడంబరంగా జరిగింది.  నైజాంలో వున్న యువకమ్యునిస్ట్ నాయకులందరికీ ఆయన గురుతుల్యుడు.

ఇండియన్ యూనియన్ సైన్యాలు నైజాంను లొంగదీసుకోవటానికి హైదరాబాదును నలువైపులా చుట్టుముట్టినవి. అతను అంతకు ముందర ఇండియన్ యూనియనుతో చేసుకున్న "STANDSTILL AGREEMENT ను కూడా విస్మరించి స్వాతంత్రాన్ని ప్రకటించు కోవటానికి చేస్తున్న ప్రయత్నాలు ఇండియాకు తెలుసు.

సెప్టెంబర్, 13, 1948 తేదిన నైజాంలో ఇండియన్ ఆర్మీ ప్రవేశించినది. నాలుగు రోజులలోనే 1947, SEPTEMBER, 17 న నైజాం, అతని సైన్యం లొంగిపొయింది. రజాకార్లు ఆయుధాలు వదలి తోక ముడిచారు. ఖాశిం రజ్విని అరెస్ట్ చేశారు. నైజాం ప్రభుత్వాన్నిరద్దు  చేశారు. దీనినే "ARMY & POLICE ACTION " అని పిలిచారు.

శ్రీ P. C. JOSHI నాయకత్వంలోని బ్రిటిష్ ఇండియా కమ్యూనిస్టు పార్టీ ఆగష్టు, 15, 1947 న ఇండియా స్వాతంత్రం పొందినట్లు బ్రిటిష్ వాళ్ళు చేసిన ప్రకటనను స్వాగతించింది.

కానీ కొరియా యుద్ధం ప్రభావం కారణంగా స్టాలిన్ ప్రమేయంతో CPI అప్పటి  వరకు అనుసరించిన రాజకీయ  పంధాను (నైజాం సంస్థానం ఇండియాలో విలీనం కావటం, ఇండియా స్వాతంత్రాన్ని గుర్తించటం ఇతరాలు)  వెంటనే మార్చుకొంది.  పార్టీలో విభిన్నవాదాలు ప్రారంభము అయినవి. శ్రీ జోషి వంటరి అయినారు . ఫలితంగా శ్రీ P.C. జోషిని ఆల్ ఇండియా కమ్యూనిస్టుపార్టీ జనరల్ సెక్రటరీ  పదవిలో నుండి డిసెంబర్ 1947 తేదీన REMOVE చేశారు. కలకత్తాలో 1948, ఫిబ్రవరి 28 నుండి మార్చ్ 6 వ తేదీ వరకు జరిగిన రెండవ కాంగ్రెసులో శ్రీ B.T. RANADIVE ను జనరల్ సెక్రటరీగా ఎన్నుకున్నారు. ఆయన నేతృత్వంలోని CPI పోరాటాన్ని కొనసాగించే నిర్ణయం చేసింది. ఇండియన్ యూనియన్ సైన్యాలు నైజాంకు రావటాన్ని తప్పుపట్టింది.

నైజాం కమ్యూనిస్టుపార్టీ కూడా ఇండియన్ యూనియన్లో విలీనం కాకుండా పోరాటం కంటిన్యూ చేయటం సమంజసం కాదని అభిప్రాయ పడినది. కానీ వారి అభిప్రాయానికి మద్దతు లభించలేదు. శ్రీ రావి నారాయణరెడ్డి  లాంటివారు కేంద్రపార్టీ ఆదేశాలను జీర్ణించుకోలేకపోయారు. ఆయన నైజాంనుండి వెళ్ళిపోయి బాంబే వెళ్లిపోయారు. నిజాంవిమోచనం తరువాత ఇండియన్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాటం కంటిన్యూ చేయటాన్ని వ్యతిరేకించిన శ్రీ పెండ్యాల సత్యనారాయణరావు లాంటివాళ్ళు పార్టీనుండి బయటకు వచ్చారు. ఆసమయంలోనే మలేసియాలో జరిగిన "Congress of Communist International లో కూడా శ్రీ సత్యనారాయణ రావు రాజీనామా ప్రస్తావనకు వచ్చింది.

ఆ సమయంలోనే  ఖమ్మం వచ్చిన నైజాంరాష్ట్ర కమ్యునిస్టుపార్టీ జనరల్ సెక్రటరీ శ్రీ పెరవెల్లి వెంకటరమణయ్యని నైజాం పోలీసులు అరెస్ట్ చేసి కారాగారానికి  పంపారు. తనను పెంచి విద్యాబుద్ధులు నేర్పించిన తననాయనమ్మ అంతిమసంస్కారాలకు ఆయన ఖమ్మం వచ్చారు. చిన్నతనంలోనే రమణయ్యగారి తల్లితండ్రులు చనిపోవటంతో వాళ్ళనాయనమ్మే ఆయనను పెంచింది. ఆయన అరెస్ట్ ఆరోజుల్లో పెద్ద సంచలనం. రైల్వే Station లోనే రమణయ్య గారిని చూసిన పోలీస్ సిబ్బందికి ఆయనను అరెస్ట్ చేసే ధైర్యంసరిపోలేదు.పైఅధికారులతో సంప్రదిపుల తరువాత అంత్యక్రియల స్థలంలో ఆయనను అరెస్ట్ చేశారు.

తప్పనిసరి పరిస్థుతులలో శ్రీ P.V.రమణయ్య స్థానంలో 1951 ఆఖరు వరకు శ్రీ పుచ్చలపల్లి సుందరయ్య రాష్ట్ర బాధ్యతల స్వీకరించారు. 1948-1951 వరకు ఆయన నైజాంలో అండర్ గ్రౌండ్ లో వున్నారు.

చివరగా శ్రీ పుచ్చలపల్లి సుందరయ్య, శ్రీ దేవులపల్లి వెంకటేశ్వరరావులు  అండర్ గ్రౌండుగా పోరాటం నడిపించారు.

ఈ పోరాటం నుండి కమ్యూనిస్ట్ సానుభూతి పరులు మినహా అన్ని రాజకీయ, రాజకీయేతర సంస్థలు వెళ్లిపోయాయి. నైజాంవిమోచనం కలుగటంతో తాము అనుకున్న పోరాటం ముగిసిందని తలచారు. కమ్మ్యునిస్టులు ఒక్కరే ఒంటరిగా గ్రామాలనుండి అడవులకెళ్ళారు. క్రమంగా ఆయుధాలు సమకూర్చుకున్నారు. ఒంటరిపోరాటం కావటంతో, సైన్యాలు నలుదిశలా మొహరించటంతో ఉద్యమకారులు ఇబ్బంది పడ్డారు. పార్టీ సానుభూతిపరులు కూడా వారికి ఏమి సాయం చేయలేని స్థితి.

ఈ సమయంలో పోరాటప్రారంభంలో తెలంగాణా కామ్రేడ్స్ అభీష్టాన్ని రష్యా పాలకులకు చెప్పి పోరాట విరమణకు అనుమతికై బ్రిటిష్ ఇండియా తరఫున నలుగుబృందము రష్యాకు వెళ్ళింది. అందులో సర్వశ్రీ  P.C.JOSHI,  S.K.DANGE, CHANDRA RAJESWARA RAO, MAKINENI BASAVAPUNNAIAH వున్నారు. ఎందుకనో నైజాం నాయకుల ప్రాతినిధ్యం రష్యా వెళ్ళిన బృందంలో లేదు. రష్యా అధినేత శ్రీ JOSEPH STALIN ఎనిమిదినెలల దాకా వాళ్లకు INTERVIEW ఇవ్వలేదు. ఈలోపు కొన్ని వందలమంది నాయకులు కార్యకర్తలు మరణించారు. ఎంతమంది, ఎక్కడెక్కడ మరణించారో కుడా గణాంకాలు సేకరించలేని స్థితి.

చివరగా 1951 SEPTEMBERలో CPI కేంద్ర నాయకత్వం వాస్తవపరిస్థితిని గమనించి, అర్ధం చేసుకుని సాయుధ పోరాట విరమణకు అంగీకరించింది.

సెప్టెంబర్, 1948 తేదీననే ఇండియన్ యూనియనులో కలువటానికి ఒప్పుకుని, అప్పటివరకు ప్రశాంతంగా సాగిన పోరాటాన్ని విరమించి తమ డిమాండ్లను ఇండియా కాంగ్రెసు గవర్నమెంటు  పై వత్తిడి తెచ్చి సంస్కరణలు తీసుకొచ్చే మార్గం వేస్తె బాగుండేదని చరిత్ర పరిశీలకుల భావన.  అలా జరగనందున భూపంపిణీకి ఎవ్వరిమీద వాళ్ళు పోరాటంచేశారో వాళ్ళే రాజ్యాధికారంలో కాంగ్రెసుపార్టీ నీడన భాగస్వాములైనారని, బలహీనవర్గాలు నష్టపోయారని (భూ పంపిణీ వగైరా..)  విశ్లేషణ.

నైజాం ప్రభుత్వం విమోచనం/ స్వతంత్ర భారతావనిలో విలీనం అయిన తరువాత  తెలంగాణాలో రాజకీయ, సామాజిక మార్పులు వచ్చినవి. 1951 సెప్టెంబరులో కమ్యునిస్టులు  సాయుధపోరాట విరమణ చేశారు. తరువాత 1972 సంవత్సరంలో  శ్రీ పుచ్చలపల్లి సుందరయ్యగారు కూడా తెలంగాణా సాయుధ పోరాటం నేర్పిన LESSONS ను  గ్రంధపరంగా  వెలువరించారు.

క్రింది చిత్రం కమ్యూనిస్టుపార్టీ వ్యవస్థాపకసభ్యులు మరియు వరంగల్లుజిల్లా ఆంద్రమహాసభ నాయకులు.


(1).క్రింద కూర్చున్న వారు: కుడి నుండి ఎడమ వైపుకు. సర్వశ్రీ 1. గుండపనేని హనుమంతరావు ,2. K. L. నరసింహారావు, 3. కందిమళ్ళ శేషగిరిరావు, 4. కొండపల్లి గోపాలరావు.

(2).కుర్చీలలో కూర్చున్నవారు: కుడి నుండి ఎడమ వైపుకు : సర్వశ్రీ 1. పారుపల్లి రామయ్య, 2. చిర్రావూరి లక్ష్మినరసయ్య, 3. పెరవెల్లి వెంకటరమణయ్య, 4. పెండ్యాల సత్యనారాయణరావు, 5. వట్టికొండ నాగేశ్వర రావు, 6. సర్వదేవభట్ల రామనాధం.

(3).వెనుక నిలుచున్నా వారు: కుడి నుండి ఎడమ వైపుకు :సర్వశ్రీ 1. రావెల్ల జానకిరామయ్య, 2. పబ్బరాజు రంగారావు, 3. మచ్చా వీరయ్య, 4. సామినేని అచ్యుతయ్య, 5. దశరధ రామయ్య, 6. పర్చా దుర్గా ప్రసాదరావు, 7. వాసిరెడ్డి వెంకటపతి, 7.నేదునూరి జగన్నాధరావు.
    
                                                           -----పెండ్యాల వాసుదేవరావు.


<!-- Google tag (gtag.js) -->
<script async src="https://www.googletagmanager.com/gtag/js?id=G-1M93C8YK91"></script> <script> window.dataLayer = window.dataLayer || []; function gtag(){dataLayer.push(arguments);} gtag('js', new Date()); gtag('config', 'G-1M93C8YK91'); </script>

Sunday, July 1, 2018

నా జీవన పోరాటం --రాజకీయ పరిణామాలు.1991-94 మధ్యన


56. (NKP-9). 

నా జీవన  పోరాటం --రాజకీయపరిణామాలు.1991-94 మధ్యన  


నా మూడవ టర్మ్ నేలకొండపల్లి సహకార గ్రామీణ బ్యాంకు ఎన్నికలు......అనంతర రాజకీయ పరిణామాలు.

1992 జనవరి నెలలో సహకార గ్రామీణ బ్యాంకు  ఎన్నికలోచ్చాయి. 1991 సంవత్సరం డిసెంబర్ నెల 25 వ తేదిన మా తండ్రి గారు మరణించారు. ఆయన మరణించిన నెలరోజులకు మొదటి మాసికం 23rd January నాడే నేలకొండపల్లి గ్రామీణ బ్యాంకు ఎన్నికలు జరిగాయి. మా తండ్రిగారి మరణంతో జరిపించవలసిన సాంప్రదాయ కార్యక్రమాలతోనే, పలుకరించ వచ్చినవారితో మాట్లాడటంతోనే నాకు సమయం సరిపోవటంతో ఎన్నికల నిర్వహణపై ఎక్కువ శ్రద్ధ చూపలేకపోయాను.

ఆయన మరణించటంతోనే నా రాజకీయ జీవితం అంతమొంధించటానికి మా వ్యతిరేకులంతా సమావేశమై వ్యూహం రచించారు.ఈ సమయం దాటితే మళ్ళీ నన్ను ఎదుర్కోవటం సాధ్యం కాదని వారి భావన. నాకు అత్యంత దగ్గరగావున్న వ్యక్తులు శ్రీ వాక కృష్ణ లాంటి వాళ్ళు నన్ను వదలి వెళ్లి పోయారు. వ్యతిరేక పానెల్ లో పోటిచేశారు. మాకులం వాడైన శ్రీ భగవాన్లు లాంటి వాళ్ళు వ్యతిరేకం చేశారు.

అయినా ఎన్నికలలో పోటీచేయటానికి వార్డ్ ల వారీగా పానెల్ తయ్యారు చేసి కదన రంగంలోకి దిగాము. ఎన్నికల రోజు రానే వచ్చింది. ఆ రోజు మా తండ్రి గారి మొదటి మాసికం కావటంతో సాయంకాలం దాకా నాకు ఆ కార్యక్రమమే సరిపోయింది. ఆ రోజు ఎన్నికల పోలింగ్ నిర్వహణను Poling Agents మరియు Contesting Candidates కే అప్పగించి  సాయంకాలం నేను కౌంటింగ్ ప్రదేశానికి వెళ్ళే సమయానికి అక్కడ పోలీస్ మోహరింపు అధికంగా కనిపించింది. ఫలితాలు ప్రకటించే సమయం ఆసన్నం అయింది.

ప్రశాంతంగా వున్న ఆ వాతావరణంలో పోలీసుల హడావిడి అధికంగా కనిపించింది. ఎన్నికల ఫలితాలు బహిర్గతం అయ్యే సమయంలో కనిపించిన జనాన్ని కనిపించినట్లు లాటీ ఛార్జ్ చేయటం మొదలెట్టారు. అలా పది మంది జనాలకు కాళ్ళు, చేతులు విరిగాయి. రక్తం వరదలై పారింది. దాన్ని చుసిన నేను సమీపంలో వున్న కూసుమంచి సర్కిల్ ఇన్స్పెక్టర్ శ్రీ ప్రభాకర్ ను ఇదేమిటని ప్రశ్నించాను. వాళ్ళు మా మీధ రాళ్ళు వేశారని చెప్పారు. అది అవాస్తవం.

ఆ ఎన్నికలు అంతకు ముందు జరిగిన విధానంలా ప్రెసిడెంట్ ఎన్నిక ప్రత్యక్ష పద్హతిలో జరుగక పరోక్ష పద్దతిలో  జరుపుతున్నారు.  మా పానెల్ నుండి 5 గురు డైరెక్టర్స్ గెలిచారు. తెలుగు దేశానికి రెండు, CPM కు రెండు.  CPI కు రెండు డైరెక్టర్స్ వచ్చాయి. నేను ఎన్నికల అధికారి దగ్గరకు వెళ్లి వార్డ్ కు గెలిచినట్లు ధ్రువ పత్రాన్ని తీసుకుని బయటకు వచ్చాను. అంతే. పోలీసులు నన్ను చుట్టు ముట్టి లాటీ ఛార్జ్ చేశారు. అరెస్ట్ చేస్తున్నామని చెప్పి పోలీస్ స్టేషన్ కు రమ్మన్నారు. కారణం అడిగితే చెప్పలేదు.

అక్కడున్న పోలీస్ వాళ్ళు, మరియు జనాలు వందల్లో వెంటరాగా స్టేషన్ కెళ్ళాను. నావెంట వస్తున్న పేరాల గాంధి లాంటి యువకులను వద్దని వారించినా వినలేదు. నా వెన్నంటే స్టేషన్ కు  వచ్చారు.

అప్పటికే ఊరంతా ఈవార్త దావానలంలా వ్యాపించింది. ఆసమయంలో జనాన్ని రెండు కిలోమీటర్స్ దాకా తరిమి కొట్టారు. అందులో పోలీసుల చేతులలో దెబ్బలు తిన్న జనాలందరూ  నేలకొండపల్లిలోని, అనాసాగరం గ్రామము లోని  B.C లు మరియు  S.C లే ఎక్కువగా వున్నారు. శ్రీ దెశబొయిన గడ్డయ్య లాంటి వయసు మళ్ళిన పెద్దలు వున్నారు.

విషయం తెలిసిన పత్రికా విలేఖరులు స్టేషన్ కు వచ్చి నన్ను కలిశారు. పోలీస్ స్టేషన్ లోనే విలేఖరుల సమావేశాన్ని ఏర్పాటు చేసి పోలీస్ వాళ్ళ అరాచకాన్ని వివరించాను. మరుసటి రోజు ఉదయం అన్ని దిన పత్రికలలో ఈ వార్త ప్రముఖంగా ప్రచురితము అయినది. ఏమనుకున్నారో ఏమో పోలీస్ అధికారులు  నన్ను, నా సమావేశాన్ని అడ్డగించలేదు. ఆ సమయంలో విషయం తెలుసుకుని అక్కడకు వచ్చిన స్థానిక మండల రెవిన్యూ అధికారి శ్రీ రాములు అక్కడనే వున్న కూసుమంచి C.I. of Police తో చర్చించటం జరిగింది. "ఒక వ్యక్తి కొసము ఇంత హంగామా జరుగుతుందా? ఇంత మంది జనాలు వస్తారా?" అనే C.I ప్రశ్నకు "అవును. వాళ్ళ కుటుంబ చరిత్ర అలాంటిదని"  MRO సమాధానం చెప్పటం జరిగింది. ఆ సమయంలో అక్కడనే వుండి సంఘటనను చూసిన శ్రీ వంగవీటి వెంకట సుబ్బయ్య "వాసుదేవరావు కు రాజకీయం గా మళ్ళీ ప్రాణం పోశారని" వ్యాఖ్యానించాడు.

విషయం తెలుసుకున్న ఖమ్మం పట్టణ కాంగ్రెస్ కమిటీ ప్రెసిడెంట్ శ్రీ కౌటూరు దుర్గాప్రసాద్ జోక్యంతో ఆ రోజు నేను స్టేషన్ నుండి బయటకు వచ్చాను. "రేపు ఉదయం ఒకసారి రమ్మని, ఇప్పుడు వెళ్ళండని" పోలీస్న స్టేషన్ హౌస్ ఆఫీసర్  పంపించారు. శ్రీ కౌటూరు దుర్గాప్రసాద్ శ్రీ జలగం ప్రసాదరావు కు కుడి భుజంగా ఉండేవాడు. జిల్లా కేంద్రంలో ఆయన తరఫున కార్యక్రమాలన్నీ ఈయనే చూసేవాడు.

మర్నాడు ఉదయం పోలీస్ అధికారులు చెప్పిన ప్రకారం పోలీస్ స్టేషన్ కు బయలు దేరాను. ఇంట్లోనుండి ఒక్కడినే బయలుదేరాను. నేను పోవటం చూసి బజారులో అరుగుల మీద, షాప్స్ ముందర, షాపు లలో వున్న మరియు ఇంటి ముందర వున్న జనాలందరు నన్నేమి ప్రశ్నించ కిండానే మౌనంగానే నన్ననుసరించారు. పోలీస్ స్టేషన్ entrance ముందర వెనక్కి తిరిగి చూసే సరికి సుమారుగా ఒక వెయ్యి మంది జనాలు నిలబడి వున్నారు. వారంతా క్రమశిక్షణగా ఒకే వరుసలో TRAFFIC కు ఇబ్బంది లేకుండా రోడ్ కు ఆవలి ప్రక్కన నిలబడ్డారు. అందులో అన్ని పార్టీల వారున్నారు. అన్ని కులాల వారున్నారు.

అప్పుడు నేలకొండపల్లి  స్టేషన్ లోనే వున్న ఖమ్మం DSP ఒక పది నిమిషాలలోనే "మిమ్ముల తరువాత పిలుస్తాం వెళ్ల"మని పంపించేశారు.

ఆ తరువాత 30 మంది మీద FIR ISSUE చేశారు, నేను ప్రధమ ముద్దాయిని.  సహకార ఎన్నికల సమయంలో విధులను నిర్వర్తిస్తున్న  KUSUMANCHI C.I OF POLICE ను కొట్టానని, విధులకు ఆటంక పరిచానని నా మీద అభియోగం. క్రింద మున్సిఫ్ కోర్ట్ లో నేను మినహా అందరి మీదా అభియోగాలు రుజువు కాలేదని కేసు ను కొట్టి వేశారు. అప్పీల్ లో అడిషనల్  జిల్లా కోర్ట్ లో నా మీద కేసు ను కొట్టి వేశారు.



ఇగ సహకార గ్రామీణ బ్యాంకు ఎన్నికల ఫలితాల విషయానికి వస్తే ....
ఆంద్ర ప్రదేశ్ ప్రభుత్వం ప్రవేశ పెట్టిన నూతన సంస్కరణల ఫలితంగా అధ్యక్ష ఎన్నిక INDIRECT పద్ధతి కి మారటమే కాకుండా ప్రభుత్వం ఇద్దరు స్త్రీలను నామినేట్ చేయటం ప్రవేశ పెట్టింది. దొడ్డిదోవలో అధికారాన్ని హస్తగతం చేసుకోవటం దాని లక్ష్యం.

కాంగ్రెస్ ప్రభుత్వం NOMINATE  చేసిన యిద్దరు లేడీ డైరెక్టర్స్ ను పాలేరు MLA శ్రీ సంభాని చంద్రశేకర్ కాంగ్రెస్ కు వ్యతిరేకంగా మొహరించిన విపక్షానికి సపోర్ట్ గా యివ్వటం వలన ఆరెగూడెం గ్రామానికి చెందిన శ్రీ గుత్తా వెంకటేశ్వరరావు(TDP) PRESIDENT గా ఎన్నికయ్యాడు. నేను డైరెక్టర్ గా వున్నా ప్రెసిడెంట్ గా ఎన్నిక కాలేక పొయ్యాను. తనను MLA గా గెలిపించిన లోకల్ కాంగ్రెస్ కు శ్రీ సంభాని చంద్రశేఖర్  అలా వెన్ను పోటు పొడిచాడు.

కాల చక్రం గిర్రున మూడు సంవత్సరాలు తిరిగింది. రాజకీయంగా పెను మార్పులు కూడా చాలా జరిగినవి.

శ్రీ జలగం ప్రసాదరావుకు ఎవ్వరిని నమ్మేతత్వం లేనట్లు అనిపించింది. ఆయన వెంటనేవుండి రాజకీయంగా ఆయనకే పనిచేసినా నావ్యతిరేకులకే అధిక ప్రాధాన్యత నిచ్చాడు. సహకార ఎన్నికలలో నాకు వ్యతిరేకంగా పనిచేసిన వాళ్ళనే దగ్గరకు తీసి నన్ను రాజకీయంగా మైనస్ చేయటానికి ప్రయత్నించాడు. శ్రీ సంభానికి వ్యతిరేకంగా వాడుకోవటానికి మాత్రమే నన్ను ఉపయోగించుకున్నాడు.

ఆ సమయంలోనే ఒకసారి MLA సంభాని చంద్రశేకర్ కు వ్యతిరేకంగా AP CM శ్రీ నేదురుమల్లి జనార్ధనరెడ్డి వద్దకు ప్రజాభిప్రాయాన్ని వినిపించటానికి  శ్రీ జలగం ప్రసాదరావు సలహాతో హైదరాబాద్ వెళ్ళాము. ఖర్చు అంతా శ్రీ కూసుమంచి రంగారావు పెట్టుకున్నట్లుంది. హైదరాబాద్ చేరుకోగానే ప్రసాదరావు గారితో ఆయన వెంట శ్రీ జలగం వెంగళ రావు గారింటికి వెళ్ళాము   అక్కడి నుండి CM Camp office కు వెళ్లాలని ఆలోచన.

జలగం వెంగళ రావు గారు ఎవ్వరిని వ్యక్తిగతంగా కలువటానికి అవకాశము ఇవ్వలేదు. నాపేరు వ్రాసి ప్రత్య్హేకంగా నేను స్లిప్ పంపాను. వెంటనే నాకు  పిలుపు వచ్చింది. ఒక్కడినే వెళ్లాను. హాల్ లో వున్న థ్రెడ్ మిల్ ప్రక్కనే చైర్ లో కుర్చుని వున్నారు. నన్ను చూడగానే సాదరంగా ఆహ్వానించారు. మా తండ్రిగారు చనిపోయిన తరువాత నన్నదే చూడటం కాబట్టి కుటుంబ స్థితి గతుల విచారించారు. "సహకార ఎన్నికలలో చంద్రశేఖర్ కాంగ్రెస్ నామినేటెడ్ సభ్యులను మీకివ్వలేధట కదా?" అని అడిగారు. అవునని చెప్పాను. "అన్ని విపులంగా CM గారికి చెప్పండని నాతో అన్నారు. మీరే నాయకత్వం వహించాలి Representation కు అన్నారు. ఫలానా వారు చెబుతారని నేనంటే "లేదు, లేదు--మీరే నాయకత్వం వహించాలన్నారు. మా కుటుంబం పట్ల ఆయన కున్న అభిమానం అలాంటిది. 1975 సంవత్సరంలో కుడా మా తండ్రి గారితో కలిసి వెంగళరావు గారు AP CM గా వుండగా ఆయనను కలవటానికి వెళ్తే మానాయన గారు స్లిప్ పంపిన 5 నిమిషాలలోనే లోపలకు పిలిచారు. అక్కడ అప్పుడు ఆయన కోసం MINISTERS, MLAS, MPS మరియు స్టేట్ TOP OFFICIALS వేచియున్నారు.

జలగం ప్రసాద రావు గారికి ఆయన తండ్రి వెంగళరావు గారికి మా కుటుంబం పట్ల వున్నవైఖరిలో, గౌరవించడంలో  తేడాకు  నిదర్శనం ఆ సంఘటన.

శ్రీ జలగం ప్రసాదరావు వర్గం నుండి బయటకు వచ్చిన తరువాత గవర్నమెంట్ కాంగ్రెస్ అయి వున్నారాజకీయం గా నాది వంటరి పోరాటమే అయినది. నా వెంట వున్నది అంతా బలహీన వర్గాల వాళ్ళే. రాజకీయ పోరాటం చేయాలంటే జనబలం వుంది కాని,ఆర్ధిక బలం లేదు. ఆర్ధిక బలం లేక, సొంత పార్టీ అధికారంలో వున్నా ప్రభుత్వం అండ కూడాలేక వున్న జనాన్ని రక్షించుకో వటం ఎలానో తెలీక సతమతమై పోయాను.

ఇక్కడ ఒక విషయం ప్రస్తావించవలసి వుంది. నేలకొండపల్లి నూతన బస్ స్టాండ్  ప్రారంభోత్సవానికి స్థానిక MLA శ్రీ సంభాని చంద్రశేఖర్ ముహూర్తం నిర్ణయం చేశాడు. ప్రారంభ ఆహ్వాన పత్రికలో శ్రీ పెండ్యాల సత్యనారాయణ రావు గారి పేరు లేదు. మండల కాంగ్రెస్ కమిటీ ఆధ్వర్యంలో జరుగుతున్నట్లు వ్రాసివుంది. తనకు రాజకీయ భిక్షను ప్రసాదించిన సత్యనారాయణ రావు గారిని అవమానించటం గానే దాన్ని భావించాము. శ్రీ పెండ్యాల సత్యనారాయణ రావు గారు అప్పుడు గ్రామ సర్పంచ్ గానే వున్నారు. దాంతో నేను సహకార ఎన్నికలకు ముందరే నేను లోకల్ పాలేరు MLA శ్రీ సంభాని చంద్ర శేఖర్ ఏకపక్ష నిర్ణయాలను విభేదించి ఆయనకు వ్యతిరేకంగా శ్రీ జలగం ప్రసాదరావు దగ్గరకు వెళ్ళటం జరిగింది. దానితో అసంతృప్తి గా వున్న శ్రీ చంద్రశేఖర్ దగ్గరకు అంతకు ముందే అప్పుడే తెలుగు దేశం పార్టీ నుంచి వచ్చిన కొందరు పొరుగు గ్రామాల నాయకులు, వచ్చిన అవకాశాన్ని తమకు అనుకూలంగా మార్చుకొనుటకు పాచికలు విసిరారు. ఫలితమే నేలకొండపల్లి గ్రామంలో ఎన్నడు జరుగని ఈ సంఘటన కు  ఆస్కారం లభించింది.

నాకు వ్యతిరేకంగా చంద్రశేకర్ దగ్గర పాచికలు విసిరిన నాయకులకు నాకు మధ్యన కొంత కాలం క్రితం ఒక సంఘటన జరిగింది.

1984 సంవత్సరంలో నేలకొండపల్లి గ్రామంలోని మెజారిటీ జనాల దగ్గరనుండి అందరము శ్రీ నందమూరి తారక రామారావు నాయకత్వంలోని TDP పార్టీ లోకి వెళ్లాలని వత్తిడి వచ్చింది. దానికి మా తండ్రి గారినుండి వ్యతిరేకత రానందున ఆ ఆలోచన చేశాము. అప్పుడే పైనంపల్లి గ్రామానికి కి చెందిన శ్రీ నాగుబండి లక్ష్మి నారాయణ, ముజ్జిగూడెం గ్రామం నుండి శ్రీ వున్నం వెంకయ్య, అనాసాగారం గ్రామం నుండి శ్రీ జోగుపర్తి వీరభద్రయ్య, పాత కొత్తూరు నుండి శ్రీ రావెల్ల అచ్యుతరావు తదితరులు కుడా నాదగ్గరకు వచ్చి "తాము కుడా మీతో పాటు TDP లో చేరుతామని" నాతో చెప్పారు. శ్రీ పెండ్యాల సత్యనారాయణ రావు గారి ఆసీస్సులతోనే తాము TDP లోకి వెళుతున్నామని చెభితే తమ పెద్ద వాళ్ళు తమని తప్పు పట్టరని, కోపగించరని వారి ఉద్దేశ్యం. శ్రీ కరణం రామచంద్రరావు రాష్ట్రమంత్రి మరియు జిల్లా INCHARGE MINISTER  ప్రోగ్రాం నేలకొండపల్లిలో తాము ఏర్పాటు చేయాలని అన్ని సవ్యంగా జరుగుతే తామంధరము TDP లో చేరాలని నిర్ణఇంచుకోన్నాము. మంత్రిగారి సమావేశాన్ని జయప్రదం చేయమని  కరపత్రాన్ని CO-OPERATIVE రూరల్ బ్యాంకు ప్రెసిడెంట్ హోదాలో పంచిపెట్టాను.

అప్పటికి ఇంకా శ్రీ తుమ్మల నాగేశ్వరరావు జిల్లా నాయకత్వ హోదాలోకి రాలేదు. శ్రీ కోనేరు నాగేశ్వరరావు (కోత్తగూడెం MLA) జిల్లా నుండి రాష్ట్రమంత్రిగా వున్నారు. శ్రీ పెందుర్తి మధుసూదనరావు మరియు ఖమ్మంకు చెందిన జ్యోతి ఎడ్యుకేషనల్ సొసైటీ ప్రెసిడెంట్ శ్రీ రామమోహనరావు ద్వారా శ్రీ కరణం రామచంద్రరావు, రాష్ట్ర మంత్రి గారి ప్రోగ్రాం శ్రీ భక్త రామదాసు మందిరంలో ఏర్పాటు చేశాము. ఆరోజు రానే వచ్చింది. అనాసాగారం నుండి జనం మేళ తాళాలతో వచ్చారు. మిగతా గ్రామాల జనాలు కూడా బాగానే హాజరు అయ్యారు.

నేను TDP అధికార పార్టీ లోకి వస్తే తమ రాజకీయ మనుగడకు ప్రమాదమని భావించిన మా వ్యతిరేకులంతా ఏకమయ్యారు. మంత్రిగారిని మా ప్రోగ్రాముకు  రాకుండా ఉండటానికి పావులు కదిపారు. సమావేశం ఫెయిల్ అవుతే మేం Defame కావాలని, అధికార పార్టీ ప్రవేశాన్ని అడ్డుకోవచ్చని వారి ప్రణాళిక. పోటి సమావేశాన్ని శ్రీ యీగా వెంకటేశ్వరరావు రైస్ మిల్ లో ఏర్పాటు చేసి కోధాడ వైపు నుంచి వస్తున్న మంత్రిగారిని ఆపి వాళ్ళు ఏర్పాటు చేసిన సమావేశానికి తీసుకెళ్ళి మా సమావేశాన్ని కాన్సిల్ చేయటానికి TDP జిల్లా పార్టీ పెద్దలపై వత్తిడి చేశారని తెలిసింది.

ఆసమావేశాన్ని TDP పార్టీ గ్రామ సమావేశమని పేరు పెట్టినా అక్కడ హంగామా అంత CPM మరియు దాని  మిత్ర పక్షాలదే ఎక్కువ హడావిడి గా వుంది. అప్పుడు నేలకొండపల్లి గ్రామ శాఖ శ్రీ P.D.KRISHNARAO సారధ్యంలో వుండేది. CPM తరఫున శ్రీ రాజపుత్ర నవరతన్ సింగ్, శ్రీ నూతక్కి గంగాధరరావుల సారధ్యం లో వుంది.

మంత్రి కరణం రామచంద్రరావు గారి కార్యక్రమం అక్కడ అయిపోయినదని తెలిసి, మా సమావేశానికి వస్తారా లేదాని తెలుసు కోవటానికి శ్రీ నాగుబండి లక్ష్మి నారాయణ , శ్రీ ఉన్నం వెంకయ్యలతో కలసి మిల్లు (మూల్పూరి) సుబ్బారావు గారి ఇంటికి వెళ్ళాను. మంత్రిగారి దర్శనం లభించలేదు. మంత్రి గారి కార్యక్రమం ఏర్పాటు చేసిన శ్రీ పెందుర్తి మధుసూదనరావు మరియు శ్రీ జ్యోతి రామమోహనరావులు నిశ్యబ్ధంగా వుండిపోయారు. ఆ సమయంలో మా ప్రక్కనే వున్న సిద్ధిపేట MLA శ్రీ కల్వకుంట్ల చంద్రశేకరరావు మౌన ప్రేక్షకుడిగా ఉండిపోయాడు. ఆయన మంత్రి గారి కాన్వోయ్ లో వున్నాడు. అస్సలు సమావేశం సంగతి మంత్రి గారి దృష్టిలో వున్నదా, లేదా  అని అనుమానం వచ్చింది. నమ్మిన వారు వెన్నుపోటు పొడిచారని స్పష్టమైంది.

అందరం సమావేశ స్థలికి తిరిగి వచ్చాము. సమావేశం రద్దు అయినదని అనౌన్స్ చేయటమే కాకుండా TDP పార్టీ లోకి వెళ్ళే ఆలోచన కుడా విరమించామని వేదికపైననే ప్రకటించాను . ఆలోచన విరమించటం అనే మాటతో నా వెంట వున్న నాయకులు అసంతృప్తి చెందారు. తరువాత శ్రీ నాగుబండి లక్ష్మి నారాయణ నాయకత్వంలో  వాళ్ళు సొంత ప్రయత్నాలతో TDP పార్టీ లో చేరటం, ఫలితంగా వాళ్ల పెద్దలతో ఆయా గ్రామాల్లో విభేదాలు రావటం జరగటంతో నేను వారితో పాటు TDP పార్టీ లోకి  రాకపోవటం వల్లనే  అది జరిగిందని వాళ్ళు నా శత్రు వర్గంగా మారటం జరిగింది. వారే తరువాత శ్రీ సంభాని పంచన చేరి పై గంధరగోళన్ని సృష్టించినట్లు తెలిసింది. దీనితో శ్రీ జలగం ప్రసాదరావు కు విషయం అవగతమై వాళ్ళపై కన్నెర్ర చేయటం, వెంటనే వారు భయపడి జలగం వర్గంలో చేరి పోవటం జరిగాయి.

అలా నియోజక వర్గం లో కాంగ్రెస్ పార్టీ లో పరిణామాలు సంభవించాయి.

నేను రాజకీయాలలోకి వచ్చిన దగ్గరినుండి "నేనెంతో కాలం రాజకీయాలలో ఉండలేను, ఆర్ధిక పరిస్థితి అడ్డం వస్తుందని" నా దగ్గర వాళ్ళతో అంటుండే వాడిని. ఈమాట ప్రతి దశాబ్దం తరువాత వస్తూనే వుండేది. "నువ్వు మొదటి నుండి అదే మాట అంటున్నావు.బయటకు రావాలను కుంటున్న ప్రతీసారి ఏదో కార్యకర్తల సమస్యలతో వారిని విడిచి రాలేక ఆగిపోయ్యే వాడివి" అని ఒక మిత్రుడు T. విజయకుమార్ జ్ఞాపకం చేశాడు ఒకసారి. ఎన్నికలలో ఓట్ల కోసం  ధనం ఖర్చు పెట్టాలిసిన అవుసరం రాకపోవటం, వాళ్లకు నేను సేవ చేసే విషయంలో మా పలుకుబడి, కుటుంబ చరిత్ర ఉపయోగ పడటంతో ఆర్ధిక ఇబ్బందులు అడ్డం రాలేదు.

వాస్తవంగా మా తండ్రి గారు మరణించటానికి (25.12.1991) కొద్ది కాలం ముందుగా(22.11.1990)  నేను అడ్వొకేట్ గా నమోదై ఖమ్మం కోర్ట్ కు ప్రాక్టీసు కై వెళ్ళేవాడిని. నేలకొండపల్లి నుండి రోజు ఖమ్మం నుండి బస్సు లో వెళ్ళే వాడిని. బస్సు స్టాండ్ నుండి RICKSHAW లో కోర్ట్ కు వెళ్ళే వాడిని.  అప్పటికింకా ఖమ్మం రహదారుల పైన ఆటోలు తిరుగం మొదలు కాలేదు. RICKSHAW లో వెళుతుంటే మార్గ మధ్యంలో కొన్ని సార్లు న్యాయవాది శ్రీ పొట్ల మాధవరావు లాంటి వాళ్ళు  RICKSHAW ను ఆపి వాళ్ళ కారులో బలవంతంగా ఎక్కిన్చుకొనే వాళ్ళు.

రాను రాను ఆర్ధిక ఇబ్బందు ఎక్కువై , ఖమ్మం వెళ్ళటానికి బస్సు చార్జెస్ కుడా లేక కోర్ట్ కు వెళ్ళటం బంద్ చేశాను. కొంతమంది అడ్వకేట్ మిత్రులు "అడ్వకేట్ వృత్తి కంటే రాజకీయాలే బాగున్నావా" అని ప్రశ్నించే వారు. నవ్వి వురుకుండే వాడిని. నా ఆర్ధిక స్థితి గురించి చాలా మందికి లోతుగా తెలీదు. ఖమ్మంలో చాలా మంది మిత్రులు, సహా న్యాయవాదులు "పొలాలు కౌలుకు ఇచ్చారా " అని ప్రశ్నించేవారు. సమాధానం ఏమి చెప్పాలో తెలీక సతమత మయ్యేవాడిని. అడ్వకేట్ గా నమోదు కాకముందు కొందఱు మిత్రులు అనేవారు"వాసుదేవరావు ఏమిచేస్తున్నాడని అంటే ఏమిచెప్పాలో తెలియటం లేదనే "వారు. రాజకీయాలు వృత్తి కాదు. మరేమీ చెప్పాలో తెలీదు. తరువాత నేను అందరికి నేను అడ్వకేట్ ను అని చెప్పగలిగే పరిస్థితి వచ్చింది.

పై రాజకీయ సంఘటనల తరువాత తప్పనిసరిగా రాజకీయ ఒంటరి పోరాటమే చేయవలసి వచ్చింది. నన్ను నమ్ముకుని వున్న వ్యక్తులను వీడిపోలేక దశల వారీగా వారికి ధూరం కావాలని నిర్ణ యించాను.

దాని ఫలితమే మళ్ళి శ్రీ సంభాని చంద్రశేఖర్ కు దగ్గరైనట్లు నటించాను. ఫలితంగా ముఖ్య మైన కార్యకర్తలు నాకు దూరము అయ్యారు. సంభానికి నేను దగ్గరైనా అతను నాకు ఇచ్చిన గౌరవ మర్యాద లేమి లేకపోగా అవమానాలు కుడా జరిగాయి. ఎవ్వరి కారణం వల్ల నేను జలగంకు దురంగా జరిగానో వాళ్ళే మళ్ళీ శ్రీ సంభానికి  చేరువ అయినారు. శ్రీ నాగుబండి లక్ష్మినారాయణ & కో..  జలగంను వీడి సంభాని దగ్గరకు వచ్చారు. 1994 సంవత్సరంలో పాలేరు షుగర్ ఫ్యాక్టరీ డైరెక్టర్ పదవికి రాజీనామా చేసి అదే సంవత్సరం లో జరిగిన అసెంబ్లీ ఎన్నికలలో కాంగ్రెస్ అభ్యర్ధి శ్రీ సంభాని చంద్రశేఖర్ కు వ్యతిరేకంగా పనిచేసినాము. నన్ను చూసి నియోజక వర్గంలో ముఖ్యులు చాలామంది అతనికి వ్యతిరేకంగా బహిరంగంగా వచ్చారు. CPM అభ్యర్ధి శ్రీ సండ్ర వెంకటవీరయ్య గెలుపుకు తోడ్పడ్డాము.

ఫలితంగా 1995 సంవత్సరంలో వచ్చిన గ్రామపంచాయత్ ఎన్నికలు మరియు సహకార ఎన్నికలలో ఇండిపెండెంట్ గానే పోటీ చేయాల్సి వచ్చింది. కాంగ్రెస్ పార్టీలో ఉంటూనే ఇండిపెండెంట్ గా వుండి  పోవలసి వచ్చింది.

                                                                                         -----పెండ్యాల వాసుదేవరావు.

<!-- Google tag (gtag.js) --> <script async src="https://www.googletagmanager.com/gtag/js?id=G-1M93C8YK91"></script> <script> window.dataLayer = window.dataLayer || []; function gtag(){dataLayer.push(arguments);} gtag('js', new Date()); gtag('config', 'G-1M93C8YK91'); </script>




Thursday, June 28, 2018

HEAT ON DELHI ASSEMBLY ELECTIONS

          55. (SOCIAL-40) 

HEAT ON DELHI ASSEMBLY ELECTIONS

As the election campaign in Delhi reaches fever pitch, the Bharatiya Janata Party (BJP) and the Aam Aadmi Party (AAP) traded charges over a BJP advertisement in newspapers, purportedly targeting AAP leader Arvind Kejriwal on his ‘gotra’ (clan) and raising questions over donations to his party.The two controversies prompted a war of words between the two main political adversaries in the capital with the BJP claiming that the AAP was “indulging in hawala at midnight” and the AAP accusing the BJP of insulting Mr. Kejriwal’s clan. Both rushed to the Election Commission to file complaints against each other.   


Demanding a Supreme Court-monitored probe into funding of Congress, BJP and itself, the AAP on Tuesday rubbished allegations of dubious funding and dared the government to launch any inquiry against it. Putting up a strong defence in the wake of controversy over receiving donations of Rs 2 crore from four "dubious" companies last year, a battery of AAP leaders addressed a press conference here claiming the party vetted all donations with "due diligence". AAP sources said it was not the party's responsibility to check the source of money of everyone who donates as the PAC just ensures that there is no quid pro quo between the donors and the references.


Five days ahead of the Delhi assembly polls, BJP has alleged that we receive funding from 'dubious sources'. "Since it's a serious allegation we want to make it clear that all our transactions are transparent and digitalised. 

The row over funding and donations to the AAP erupted with AAP Volunteer Action Manch (AVAM), a breakaway group of the AAP, alleging that the party had received Rs. 2 crore from “dubious sources” last year. According to AVAM, the party accepted four donations of Rs. 50 lakh each at midnight on April 5, 2014. While the AAP denied the charges, the BJP was quick to seize the moment and brand the money received as “Hawala at Midnight.”

                                                                        ----------PENDYALA VASUDEVARAO.

 <!-- Google tag (gtag.js) -->

<script async src="https://www.googletagmanager.com/gtag/js?id=G-1M93C8YK91"></script> <script> window.dataLayer = window.dataLayer || []; function gtag(){dataLayer.push(arguments);} gtag('js', new Date()); gtag('config', 'G-1M93C8YK91'); </script>
     

TRIPLE TALAQ in INDIA.

54. (SOCIAL-39) 
TRIPLE TALAQ in INDIA.

The Indian Union ministry in a response to a clump of petitions against polygamy and Triple filed an affidavit to the Supreme Court of India against such practices on 7th October 2016. Practices such as Triple Talaq, poly gamy, nikah halala can't be considered as a part of religious practices and needs to reconsidered by the top court in the light of the principles of Gender justice, overriding principles of equality, dignity and nondiscrimination as well as evolution of women.

Saira Bhanu, first woman to challenge the Muslim personal Law in India moved to the Supreme court against the practice of instantaneous Talaq under Muslim Law. This case was popular as "SHAH BANO" case. A report from the Indian union to the top court in this case suggested Specific amendments in the dissolution of marriage Act,1939 but also provides for interim maintenance.

As of now 22 countries have abolished Triple Talaq taken  in one sitting including Iran, Iraq, Bangladesh, Indonesia and Pakistan. However "All India Muslim personal Law Board" has been opposing Muslim personal Law. It is to be noted that only Sunni Muslims follow this practice not Shia.

Muslim marriage is a contract. Hence it can't be rescinded unilaterally. Divorce can't be taken without the other party's consent. Declaration of Talaq shall not be given force as it is detrimental to the fundamental rights of the person.

The Supreme Court of India acted on a plea filed by six petitioners which included Shayara Bhano, Ishrat Jahan, Bharatiya Muslim Mahila Andolan, Gulshan parveen,  Afreen Rehman and Atiya Sabri. After multiple hearings, the practice was declared void by the top court last year 2017. A five Judge Constitution bench was set up to hear the plea in May 2017. The Court made it very clear in its proceedings that “we will only look at Triple Talaq and whether it is constitutional and not go into issues such as polygamy.” The Supreme Court, in a landmark judgment, set aside the centuries-old practice of triple talaq.

When the Hon'ble Supreme Court declared the practice of instant talaq is illegal, the government hailed the decision by calling it a red letter day for women rights in India. The government said it was ready to bring in a new law to regulate the practice of divorce among Muslims.

However the All India Muslim Personal Law Board has been against with the government decision to bring into a law to criminalise the practice of instant talaq.
                                                                                                  ---------PENDYALA VASUDEVA RAO

<!-- Google tag (gtag.js) --> <script async src="https://www.googletagmanager.com/gtag/js?id=G-1M93C8YK91"></script> <script> window.dataLayer = window.dataLayer || []; function gtag(){dataLayer.push(arguments);} gtag('js', new Date()); gtag('config', 'G-1M93C8YK91'); </script>


Tuesday, June 12, 2018

What is the Truth..Who killed Mahatma?

53. (SOCIAL-38) 

What is the truth ..Who killed Mahatma?


"It is an universal truth that RSS killed  Mahatma Gandhi..it need not to be proved in the Court". According to  INC president Rahul Gandhi.

Here is one question.


Indian National Congress party ruled the country almost 60 years but unable to ban RSS.Why?
Why Nehru called RSS in Indian Republic parade when he was Indian Prime Minister ?
Why Indira Gandhi shared the stage with RSS ?

BJP in a fix--They have to keep ascertaining that Godse was not an RSS man and Congress will continue bringing RSS history, it's role in Freedom struggle, the true face of SAVARKAR etc...




Sardar Vallabhai Patel  whom the RSS claim as their own today wrote to Golwalkar explaining his reasons for banning the RSS, he said "were full communal poison.. As a final result of the poison, the country had to suffer the sacrifice of the valuable life of Gandhiji. when the RSS men expressed joy and distributed sweets after Gandhi's death..under these conditions it became inevitable for the government to take action against the RSS. 


The nation wants healthy discussion and wants truth who killed Gandhi? 
What is the reasons behind it?

                                                                                                -----PENDYALA VASUDEVA RAO

<!-- Google tag (gtag.js) --> <script async src="https://www.googletagmanager.com/gtag/js?id=G-1M93C8YK91"></script> <script> window.dataLayer = window.dataLayer || []; function gtag(){dataLayer.push(arguments);} gtag('js', new Date()); gtag('config', 'G-1M93C8YK91'); </script>


Monday, June 4, 2018

ఉద్యమాల గుమ్మం మా ఖమ్మం.

52. (ఖమ్మం చరిత్ర-4) 

ఉద్యమాల గుమ్మం మా ఖమ్మం. 


ఖమ్మం ఉద్యమాల గుమ్మం అంటారు. నేను పుట్టిన దగ్గరనుండి వింటున్న మాట.
ఏ ఉద్యమాల ఫలితంగా ఖమ్మం ఉద్యమాల గుమ్మం అయినది? ఆ ఉద్యమాలేమిటి?
అవి ఎప్పుడెప్పుడు ఏ విధంగా జరిగాయి? 

ఏమో!

చాలామంది కాంగ్రెస్ వీరాభిమానులకు, ఎర్ర చొక్కా కామ్రేడ్స్ కు కూడా తెలీదు? ఎందుకు?
చరిత్ర ఎవ్వరు చెప్పలేదు. వ్రాయలేదు. నల్లగొండ చరిత్ర చెబుతారు. ఆ జిల్లా నాయకుల పేర్లు చెబుతారు.

ఖమ్మం యాడికి పొయింది. నల్లగొండకే దగ్గులు చెప్పిన నేల ఖమ్మం నేల.
ఖమ్మం/వరంగల్ చరిత్ర పై కమ్ముకున్న మేఘాలు తొలగుతాయా?
చరిత్రలో దాగిన వాస్తవాలు వెలుగులోకి వస్తాయా?

“బాంచెన్ దొరా కాల్మొక్తా” రోజుల స్థానంలో “ఆ దొర ఏందిరో ...వాడి పీకుదేన్దిరో”...  అని నిలదీయగలిగిన స్థానానికి జనాలెలా మారగలిగారు? రెండు గ్లాసుల ఆచారం మారి "SCHEDULED CASTE" వాళ్ళు కొన్ని ప్రాంతాలలోనైనా జనజీవన స్రవంతిలో ఎలా కలువ గలిగారు?

మంత్ర దండాలేమి ఉద్యమ నాయకుల దగ్గర ఉండవుగా?  ఒక్క రోజులో మార్పు రాదుగా? దాని వెనుక వున్న కృషి ఏమిటి? ఎప్పుడెప్పుడు చేసారు? చేసింది ఎవ్వరు? వాళ్ళు పడ్డ కష్ట నస్టాలేమిటి?
నాదగ్గర అన్ని ప్రశ్నలే? నాకు తెలిసిన వాళ్ళెవరి దగ్గర జవాబులు సమగ్రంగా లేవు..

నాతో కొంధరంటున్నారు “అన్ని ప్రశ్నలేనా? నువ్వేమీ తెలిసిన విషయాలు చెప్పవా?” అని.
నిజమే. చెప్పొచ్చు. కానీ "నాకు తెలిసింది తక్కువేమో, ఎవ్వరైనా పూర్తి సమాచారం చేభుతారేమోనని ఆశ. ఆరోగ్యకర చర్చకు అవకాశం యివ్వాలని తపన".

చరిత్ర తెలియక పోవటం శాపం. చరిత్రను వక్రీకరించటం పాపం.

దురదృష్టవశాత్తు చరిత్ర ను వక్రీకరించే ప్రయత్నమూ జరిగింది.

నాకు తెలిసి ‘గ్రంధాలయోద్యమం‘ మొదట ప్రారంభమై జనాన్ని మేలుకొలుపు చేయటం జరిగింది. తరువాత “ఆంద్ర మహాసభ “ సమావేశాల నిర్వహణ, తరువాత “కమ్యూనిస్ట్ పార్టీ నిర్వహించిన ఉద్యమాలు మరియు సాయుధ పోరు" ప్రముఖముగా చెప్పుకోవాలి.

అల్లాగే పాలేరు పట్టి రైతాంగ సమస్యల పరిష్కారం  కోసం 1938 సంవత్సరంలో స్థాపించిన “పాలేరు రైతు ప్రాజెక్ట్” సంస్థ చేసిన సేవలు మరువ లేనివి. ఆ సంస్థ శ్రీ పెండ్యాల సత్యనారాయణ రావు గారి ఆధ్వర్యంలోనే వుండేది. ఆ రోజుల్లో పాలేరు కాలువ నేలకొండపల్లి వరకే వుండేది. సరిగ్గా నీళ్ళు వచ్చేవి కాదు.కరువు వస్తే శిస్తు మాఫీకై ఆందోళన తప్ప మార్గం లేదు. ఆంధ్రా నుంచి వచ్చిన రైతుల బాధలు అనేక రకాలుగా ఉండేవి. ఆ సమస్యల విముక్తికై  ఆ రైతు ప్రాజెక్ట్ చేసిన ఆందోళనలు రాష్ట్రం దృష్టిని ఆకర్షించాయి.

'చాలాలి ఐలమ్మ". నేడు తెలంగాణా నీలాకాశంలో కనిపిస్తున్న విప్లవ తార.

ఆమె ఒక్కరోజులో బంధూకు తీసుకుని బజారుకు రాలేదండి. ఆమె వెనుక "సంగాపోల్ల" సాముహిక శక్తి వుంది. ఆ సంఘాలను ఏర్పరిచిన జిల్లా కమ్యూనిస్ట్ పార్టీ నాయకత్వముంది. ఆ పార్టీకి రాష్ట్ర నాయకత్వ ఆదేశాలున్నవి. ఖమ్మం మరియు నల్లగొండ జిల్లా నాయకులు, కార్యకర్తల మోహరింపు వుంది. పక్కా ప్రణాళిక వుంది.

తాజ్మహల్ నిర్మాణం గొప్పదే అవుతే ఆ నిర్మాణానికి రాళ్ళు ఎత్తిన కులీలెంత ముఖ్యమో నిర్మించాలనుకొన్న షాజహాన్ కుడా అంతే ముఖ్యము. శాజహానే లేకుంటే కులీలేమి చేస్తారు? నిర్మాణం ఎక్కడి నుంచి వస్తుంది?

1.గ్రంధాలయ ఉద్యమం ----విరాట్రాయాంధ్ర గ్రంధాలయం.

గ్రంధాలయోద్యమం పేరు చేభితే రాష్ట్ర నాయకత్వంలో శ్రీ మాడపాటి హనుమంత రావు, ఆదిరాజు వీరభద్ర రావు, సురవరం ప్రతాప రెడ్డి, కొత్వాలు వెంకట్రామిరెడ్డిల పేరు వినిపిస్తుంది. ఉమ్మడి వరంగల్లు జిల్లాలో నేలకొండపల్లీ, గోకినేపల్లీ, ఎల్లందు,ఖమ్మం, జమలాపురం మరియు హనుమకొండలలో వున్న గ్రంధాలయాలు ప్రముఖమైనవి. 

ఆ గ్రంధాలయాలలో నేలకొండపల్లి లోని శ్రీ విరాట్ రాయాంధ్ర గ్రంధాలయాన్ని ప్రముఖంగా చెప్పుకోవాలి. అక్కడ వెల్లివిరిసిన చైతన్యమే జిల్లా చరిత్రని మార్చివేసింది.

1912 సంవత్సరంలో ప్రారంభమైన ఆ గ్రంధాలయమును  1934 సంవత్సరంలో శ్రీ పెండ్యాల సత్యనారాయణ రావు దాన్ని పునరుద్ధరించి సామాన్య జనానికి అవుసరమైన సాహిత్యాన్ని అందించి జనాన్ని సమీకరించటం ద్వారా చైతన్యాన్ని తీసుకు వచ్చారు. సర్వశ్రీ పుచ్చలపల్లి సుందరయ్య, చండ్ర రాజేశ్వర రావు, తరిమెల నాగిరెడ్డి, కొండపల్లి సీతారామయ్యలతోపాటు రావి నారాయణరెడ్డి, బద్దం ఎల్లారెడ్డి, జమలాపురం కేశవరావు, హయగ్రీవాచారి, కొమరగిరి నారాయణ రావు, ప్రజాకవులు దాశరధి, కాళోజి, వట్టికోట  ఆళ్వార్ స్వామి లాంటి వాళ్ళు వచ్చేవారు. ఒకసారి తరిమెల నాగిరెడ్డి నేలకొండపల్లి నుంచి కరీంనగర్ వెళ్ళుతూ మార్గమధ్యంలో అరెస్ట్ కాబడ్డాడు.

అక్కడ శ్రీ విరాట్ రాయాంధ్ర  గ్రంధాలయంలో జరిగిన రహస్య సమావేశాల ఫలితమే 1939 సంవత్సరంలో “నైజాం సంస్థానంలో కమ్యూనిస్ట్ పార్టీ ఆవిర్భావం”. ఇది చాలా కాలం అండర్ గ్రౌండ్ పార్టీ గానే వుండేది. ఒక స్త్రీ గర్భం దాల్చి బిడ్డను ప్రసవించాలంటే తొమ్మిది నేలాలు అనేది ప్రకృతి సహజం. అలాంటిది ఉద్యమాల పార్టీ పుట్టాలంటే ఎంత కాలం ఎంత శ్రమతో గ్రౌండ్ వర్క్ చేసివుండాలి? ఎంత పకడ్బందీ ప్లాన్ వేసివుండాలి. అన్ని నిర్భందాల నడుమ, రవాణా సౌకర్యాలు లేని రోజులలో జిల్లాలోని గ్రామాలన్నిటిని చుట్టి వచ్చి జనాన్ని సమీకరించి--మరొకవేపు బ్రిటిష్ ఇండియా పార్టీ పెద్దల లతో  సంప్రదింపులు చెస్తూ, పోరాటం నిర్మించటం ఎంతో కత్తి మీద సాము లాంటిది.

అప్పటి వరకు హైదరాబాద్ నగరానికి పరిమితమై ముఖ్దుం మొహియుద్దీన్ ఆధ్వర్యంలో “కామ్రేడ్స్ అసోసియేషన్” మాత్రమే వుండేది.

ప్రస్తుతం జనాలు చెబుతున్నట్లు కమ్యూనిస్ట్ పార్టీ “పాత సూర్యాపేట” లో పుట్టలేదు. ఖమ్మం నడిబొడ్డున పుట్టింది. ఖమ్మం నాయకులతోనే రాష్ట్ర పార్టీ ఏర్పాటై ఆ తరువాత విస్తరించింది. నైజాంలో జిల్లా పార్టీ ల ఏర్పాటు కుడా వుమ్మడి వరంగల్ జిల్లాతోనే మొదలయింది. ఖమ్మం ఉద్యమాల గుమ్మం అని అందుకే అన్నారు. ఖమ్మం ఖిల్లా ఉద్యమాల ఖిల్లా అన్నారు. నల్లగొండ ఉద్యమాల కొండ అనలేదు.

నిజాం రాష్ట్ర పార్టీ వ్యవస్థాపక జనరల్ సెక్రటరీగా శ్రీ పెరవల్లి వెంకటరమణయ్య వుండేవారు. మధిరలో SUBINSPECTOR OF POICE  గా వున్నఆయన ఆ పదవికి రాజీనామా చేసి రంగంలోకి వచ్చాడు.ఆయన శ్రీ పెండ్యాల సత్యనారాయణ రావు గారికి స్వయానా మేనల్లుడు మరియు బావమరిది. సత్యనారాయణ రావు గారి ప్రభావంతో ఆయన చేస్తున్న వుద్యోగం వదలి ఉద్యమంలోకి వచ్చాడు.

ఉమ్మడి వరంగల్ జిల్లాకు కమ్యూనిస్ట్ పార్టీ  వ్యవస్థాపక జనరల్ సెక్రటరీగా శ్రీ పెండ్యాల సత్యనారాయణ రావు వుండేవారు. ఉద్యమం రోజులలో ఖమ్మం తాలుకా కమ్యూనిస్ట్ కార్య కలాపాలకు నేలకొండపల్లి గ్రామమే కేంద్ర స్థానంగా వుండేది. ఖమ్మం తాలుక జెనరల్ సెక్రటరీ శ్రీ K.L.నరసింహరావు నేలకొండపల్లి లోనే వుండేవారు. కమ్యూనిస్ట్ పార్టీ పత్రికకు కుడా శ్రీ పెండ్యాల సత్యనారాయణ రావు గారు ఎడిటర్ గా  వుండేవారు. శ్రీ సర్వదేవభట్ల రామనాధం ట్రేడ్ యూనియన్ కార్యకలాపాలు చూసేవాడు. వరంగల్ లో వుంటూ ఆజంజాహి మిల్లు కార్మికుల సంష్కేమం కోసం పాటుపడేవాడు. సింగరేణిలో కార్మికుల యూనియన్ స్థాపన -వారి సంక్షెమం కోసం ద్రుష్టి పెట్టేవారు. ఖమ్మం టౌన్ పార్టీ సెక్రటరీ గా శ్రీ చిర్రావూరి లక్ష్మి నరసయ్య వుండేవారు.

ఆ రోజుల్లో కమ్యూనిస్ట్ పార్టీ తరఫున జరిగిన రైతు పక్ష ఉద్యమాల్లో 1944 సంవత్సరంలో జరిగిన “బండి పట్టాల ఉద్యమం” చెప్పుకోతగ్గది. అంతవరకు ప్రభుత్వం బండి పట్టాలు, ఇరుసులు కంట్రోల్ ధరలకే సఫరా చేసేవారు. అట్టి సరఫరాను అమాంతం ఆపటంతో ఉద్యమం అనివార్యం అయింది. నిజాం అధికారులు, పోలీసులు వాటిని వర్తకులను బెదిరించి వాటిని  బ్లాక్ లో అమ్మేవారు. ఖమ్మంలో జరిగిన ఆ ఉద్యమంలో శ్రీ పెండ్యాల సత్యనారాయణ రావు గారితోబాటు శ్రీ K. L. నరసింహారావు, శ్రీ గంగవరపు శ్రీనివాస రావు, శ్రీ బుగ్గవీటి కృష్ణయ్య తదితరులు పాల్గొన్నారు. అప్పుడు ఉద్యమకారులపైన ప్రభుత్వం పెట్టిన కేసును వాదించటానికి స్థానిక న్యాయవాదులు ఎవ్వరు ముందుకురాలేదు. హైదరాబాద్ నుండి శ్రీ కొండా లక్ష్మణ్ బాపూజీ వచ్చి వాదించారు.

2. ఆంద్ర మహాసభ.

ఆంద్ర మహాసభ వేదికగా కాంగ్రెస్ మరియు కమ్యూనిస్ట్ నేతలంతా కలిసే పనిచేసేవారు. ఖమ్మం జిల్లా ఆంద్ర మహాసభ కు జమలాపురం  కేశవరావు గారు ప్రెసిడెంట్ గా, శ్రీ పెండ్యాల సత్యనారాయణ రావు గారు జెనరల్ సెక్రటరీ గా పనిచేశారు. పాలేరు పట్టి ఆంద్ర మహాసభలన్ని శ్రీ పెండ్యాల సత్యనారాయణ రావు గారి ఆధ్వర్యంలో జరిగాయి. మొట్ట మొదటి మహాసభ 1938 సంవత్సరంలో నేలకొండపల్లి లోనే జరిగింది. ఆ సమావేశానికి సర్వశ్రీ పెండ్యాల సత్యనారాయణ రావు, పెరవెల్లి వెంకట రమణయ్య,  రావి నారాయణరెడ్డి, జమలాపురం కేశవరావు, హయగ్రీవాచారి, కాళోజి నారాయణ రావు, కొమరగిరి నారాయణ రావు తదితర నాయకులు  ఎన్ధరో వచ్చారు. ఆంద్ర మహాసభ సమావేశాలన్ని ఎక్కువగా రహస్యంగా UNDER గ్రౌండ్ గానే జరిగేవి.
1943 సంవత్సరంలో రెండవ పాలేరు పట్టి ఆంద్ర మహాసభ చెన్నారం గ్రామంలో జరిగింది. న్యాయవాది పోల్కంపల్లి వెంకటరామా రావు గారు ఆ సభకు అధ్యక్షత వహించారు. పెండ్యాల సత్యనారాయణ రావు గారి ఆధ్వ్యంలో జరిగిన ఆ సమావేశానికి పెరవెల్లి వెంకటరమణయ్య, సర్వదేవభట్ల రామనాథం, వట్టికొండ ఆళ్వార్  స్వామి మొదలైన వారు హాజరు అయినారు.  సభకు రైతు ప్రతినిధులను, ప్రజానీకాన్ని రాకుండా చేయడానికి ప్రభుత్వం ఎన్నో విఫల యత్నాలను చేసింది. రైతులకు ప్రభుత్వానికి మధ్యన ప్రతిష్టాత్మకంగా జరిగింది. ఆ సమయంలో పాలేరు పట్టి ప్రాంతంలో కరవు వచ్చింది. శిస్తు మాఫీకి నాయకులు జిల్లా కల్లెక్టర్కు అర్జీలు ఇచ్చి వున్నారు. ఆ ఆంధ్ర మహాసభకు రైతులు హాజరు అవుతే శిస్తు మాఫీ చేయమని ప్రభుత్వం బెదిరించింది.అయినా జనం ఆగలేదు.సమావేశాన్ని జయప్రదం చేసారు.ఆ మహాసభ చేసిన డిమాండ్ వల్ల, వారి పోరాటం వల్ల రైతులకు ఆ సంవత్సరం శిస్తు మాఫీ జరిగింది. వరంగల్ జిల్లా కలెక్టర్ వారు రైతులకు సంభందించి ఆ రోజులలో మూడు వేల రూపాయల చిల్లర శిస్తు మాఫీ చేయటం జరిగింది.

ఆ సమావేశం జరుగుతున్న సమయంలో శ్రీ పెండ్యాల సత్యనారాయణ రావు గారి రెండవ కుమార్తె సుశీల అనారోగ్యంతో చనిపాయిందని కబురు వచ్చింది. అయినా ఆయన ధైర్యాన్ని కోలుపోకుండా సభను వీడి పోకుండా సభను నిర్వహింఛి జయప్రదం చేశారు. అనేక నిర్భందాల నడుమ జరుగుతున్న సమావేశం అది. ఆ సమయంలో సమావేశాన్ని వీడుతే సభ నిర్వహణ ఫలితం దక్కకుండా పోతుంది. కనుక “అమ్మాయి చనిపోయాక నేను వచ్చి చేసేది లేదు కాబట్టి కుటుంబీకులనే కార్యక్రమం చేయమని” వర్తమానం తెచ్చిన వ్యక్తికి చెప్పటం జరిగింది. తరువాత విషయం తెలిసిన సభికులు  ఆయన కార్య దీక్షతకు అచ్చెరువొందారు.

ఆసమయంలో పెండ్యాల సత్యనారాయణ రావు గారి భార్య శ్రీమతి అన్నపూర్నమ్మ గారు విజయవాడలో డాక్టర్ అచ్చమాంబ గారి ఆత్మరక్షనా శిభిరంలో శిక్షణ కోసమై వున్నారు. ఆ శిబిరంలోనే ఆ అమ్మాయి చనిపాయింది. శ్రీమతి అన్నపూర్ణమ్మ గారే ఆ అమ్మాయిని ఖమ్మం తీసుకుని వెళ్లి భందువుల సాయంతో కార్యక్రమం జరిపారు. బ్రిటిష్ ఇండియా కమ్యూనిస్ట్ పార్టీ ఆధ్వర్యంలో ఆ శిక్షణా శిబిరం నడుస్తోంది. శ్రీమతి అన్నపూర్ణమ్మ గారితో పాటు చిర్రావూరి నరసయ్య గారి భార్య, సర్వదేవభట్ల రామనాధం గారి భార్య మరియు పెరవెల్లి రమణయ్య గారి భార్య కూడా ఆ శిబిరంలో శిక్షణ లో వున్నారు. చేస్తున్న పనిపై వారి అకుంఠీత కార్య దీక్ష అటువంటిది.

ఆంద్ర మహాసభల నిర్వహణా సమయంలోనే సాంప్రదాయ వ్యతిరేక/విప్లవాత్మక సంస్కరణల కార్యక్రమాల నిర్వహణలు కుడా జరిగినవి. నైజాం ప్రాంతంలో మొట్టమొదటి సారిగా రెండుగ్లాసుల విధానాన్ని నేలకొండపల్లి లో ప్రధమంగా పోయేటట్లు చేసారు. ఆ చర్యల ఫలితంగా శ్రీ పెండ్యాల సత్యనారాయణ రావు గారి కుటుంబాన్ని ఆయన కులం వెలివేసింది. ఆ ఇంట్లో సాంప్రదాయ కార్యక్రమాలకు ముజ్జిగూడెం, ఖమ్మంల నుంచి బ్రాహ్మిన్స్ వచ్చి కార్యక్రమాలు జరిపేవారు.

ఆ తరువాత 11 వ ఆంధ్రమహాసభలో ఉద్యమ కార్యాచరణ విషయంలో కాంగ్రెస్ మరియు కమ్యూనిస్ట్ పార్టీ వారికి విభేదాలు వచ్చాయి. ఆంద్ర  మహాసభ వేదిల పై వామపక్ష భావజాలాన్ని ఖమ్మం నాయకులే ప్రముఖంగా వినిపించేవారు. శ్రీ రావి  నారాయణరెడ్డి లాంటి వాళ్ళు మొదట మితవాదులుగా వుండి ఆ తరువాత వామపక్ష భావ జాలం వేపు మారారు.1945 సంవత్సరంలో మార్చ్ 25,26,27 తేదీలలో  ప్రధమంగా పూర్తి కమ్యునిస్ట్ ల వేదిక 12 ఆంద్ర మహాసభ ఖమ్మం ప్రక్కనే వున్న ఖానాపురం హవేలిలో శ్రీ పెండ్యాల సత్యనారాయణ రావు ఆధ్వర్యంలో జరిగింది. ఆయన ఆహ్వాన సంఘం జనరల్ సెక్రటరీగా, జిల్లా కమ్యూనిస్ట్ పార్టీ జనరల్ సెక్రటరీగా ఆ కార్యక్రమ భాద్యతల నిర్వర్తించారు. ఆ సమావేశానికి శ్రీ పుచ్చలపల్లి సుందరయ్య ముఖ్య అతిధిగా హాజరయ్యారు. సమావేశానికి ఆ రోజుల్లోనే 40.000 వేల మంది ప్రజలు వచ్చారు. ఆ సమావేశంలో 13 వ ఆంద్ర మహాసభకు శ్రీ బద్దం ఎల్లారెడ్డిని ప్రెసిడెంట్ గా శ్రీ పెండ్యాల సత్యనారాయణ రావు గారిని వైస్ ప్రెసిడెంట్ గా ఎన్నుకున్నారు. కాని అదే చివరి సమావేశము అయినది.ఆ సమావేశం తరువాత ఆంధ్ర మహాసభ కార్యకలాపాలు నిలిచి పోయాయి.

౩. సత్యాగ్రహం.

ఖమ్మం లో 1935 సంవత్సరంలో జరిగిన సత్యాగ్రహం సర్వశ్రీ మాడపాటి రామచంద్ర రావు, పెండ్యాల సత్యనారాయణ రావు,జమలాపురం కేశవరావు, పెరవెల్లి వెంకటరమణయ్య, సర్వదేవభట్ల రామనాధం, పండిట్ రుద్రదేవ్, నేదునూరి జగన్నాధం, పబ్బరాజు రంగారావు  మొదలైనవారు పాల్గొన్నారు.

1947 సంవత్సరంలో శ్రీ జమలాపురం కేశవ రావు గారి ఆధ్వర్యంలో మధిరలో జరిగిన కీలకమైన సత్యాగ్రహం ఉద్యమంలో సర్వశ్రీ హీరాలాల్ మోరియా, కొలిపాక కిషన్రావు, గెల్లా కేశవరావు తదితరులు పాల్గొన్నారు. ఆ సమయంలో జరిగిన లాఠీ చార్జీ లో జమలాపురం కేశవరావు గారు తీవ్రంగా గాయపడినారు. భవిష్యత్తులో అది ఆయన ఆరోగ్యాన్ని తీవ్రంగా దెబ్బ తీసింది. 1953 సంవత్సరంలో 45 సం.వయస్సు లోనే  ఆయన మరణిన్ చారు.
1942 లో వరంగల్ జిల్లా లోని గ్రామాలలో చాలాచోట్ల రాజకీయ పాటశాలలను, రాత్రి పాటశాలలను కమ్యూనిస్ట్ పార్టీ తరఫున శ్రీ పెండ్యాల సత్యనారాయణరావు ఏర్పాటు చేసి జనాల సమీకరణ చేశారు.

స్థూలంగా ఇదీ మా ఖమ్మం/వరంగల్  జిల్లా చరిత్ర. ఇంకా అనేకం వెలుగు లోకే రాలేదు. అన్నీతెలుసుకొనే యత్నమే ఈ చిన్ని ప్రయత్నం. సమాజం ముందుకు రావటం. విషయాల వివరించటం.

ఈ క్రింది చిత్రం 29.09.1944 సంవత్సరంలో నేలకొండపల్లి గ్రామంలో అవిభక్త కమ్యూనిస్ట్ పార్టీ ఆఫీస్ ముందర గ్రామ స్థాయి నుండి రాష్ట్ర స్థాయి వరకు కమ్యూనిస్ట్ నాయకులు మరియు కార్యకర్తలు.

చిత్రంలో సర్వశ్రీ పెరవెల్లి వెంకటరమణయ్య నైజాం రాష్ట్ర పార్టీ జనరల్ సెక్రటరీ, పెండ్యాల సత్యనారాయణ రావు వరంగల్ జిల్లా పార్టీ జనరల్ సెక్రటరీ మరియు ఆంద్ర మహాసభ జిల్లా జనరల్ సెక్రటరీ , రావి నారాయణ రెడ్డి రాష్ట్ర ఆంద్ర మహాసభ నాయకులు, బద్దం ఎల్లారెడ్డి ఆంద్ర మహాసభ నాయకులు, శ్రీ సర్వదేవభట్ల రామనాధం జిల్లా ట్రేడ్ యూనియన్ జనరల్ సెక్రటరీ, K.L.నరసింహా రావు ఖమ్మం తాలూకా పార్టీ జనరల్ సెక్రటరీ, రావెళ్ళ జానకిరామయ్య ఆంద్ర మహాసభ ఖమ్మం తాలుకా జనరల్ సెక్రటరీ, చిర్రావూరి లక్ష్మి నరసయ్య ఖమ్మం టౌన్ సెక్రటరీ,  జిల్లా నాయకులు వట్టికొండ ఆళ్వార్ స్వామి, నేదునూరి   జగన్నాధం, మచ్చా వీరయ్య, సామినేని అచ్యుతయ్య, తమ్మినేని సుబ్బయ్య, గానగావరపు శ్రీనివాసరావు మొదలైన వారున్నారు. గ్రామస్తులు సర్వశ్రీ కర్నాటి కోటయ్య, కనమర్లపూడి వాసుదేవ్, మున్నంగి వెంకటేశ్వర్లు, కుమ్మరికుంట్ల నారాయణ, వడ్ల బ్రహ్మానందం, వెలగపూడి కృష్ణ మూర్తి  మొదలైన వారున్నారు. ముందర ఫోటో మధ్యలో నిలుచున్న పాప పెండ్యాల సుగుణ. సత్యనారాయణ రావు గారి పెద్ద కూతురు. కమ్యూనిస్ట్ పతాకాన్ని పట్టుకున్న వారు  కుడి వైపున శ్రీ తోట వెంకటరత్నం, ఎడన వైపున శ్రీ రాజపుత్ర  జాలం సింగ్. నేను గుర్తు పట్టగా మరియు నాకు తెలిసినవారు గుర్తుపట్ట గా  ఇంకా గుర్తుపట్టని ఎందరో ముఖ్యులు వున్నారు.

                                                                                                      ---------పెండ్యాల వాసుదేవ రావు 
<!-- Google tag (gtag.js) --> <script async src="https://www.googletagmanager.com/gtag/js?id=G-1M93C8YK91"></script> <script> window.dataLayer = window.dataLayer || []; function gtag(){dataLayer.push(arguments);} gtag('js', new Date()); gtag('config', 'G-1M93C8YK91'); </script>

Tuesday, May 29, 2018

నిజాం వ్యతిరేక పోరాటం తరువాత ఖమ్మం జిల్లా రాజకీయ చరిత్ర?

51. (ఖమ్మం చరిత్ర-3)

నిజాం వ్యతిరేక పోరాటం తరువాత ఖమ్మం జిల్లా రాజకీయ చరిత్ర.


ప్రతీ తరానికి, వెనుక తరం చరిత్ర తెలుసుకోవాలని కుతూహలము వుంటుంది.

అందులోను ప్రభుత్వాలు మన పిల్లలకు చరిత్ర పాఠాల భోధనలను చాలా వరకు చదువులో భాగంగా పెట్టారు. రాయని చరిత్ర గురించి కుతూహలం ఇంకా అధికంగా వుంటుంది. మా ఖమ్మం చరిత్ర ఇంత వరకు అముద్రితం. రాయని చరిత్ర పై ఎన్నెన్నో ప్రశ్నలు. మాతరం అడగని ప్రశ్నలు. ఈ తరానికి తెలీని సమాధానాలు.

1952 సంవత్సరంలో వేమ్సూరు అసెంబ్లీ నియోజకవర్గంలో అధికార కాంగ్రెస్ అభ్యర్థి శ్రీ బొమ్మకంటి సత్యనారాయణ రావు పై పార్టీ ఆదేశాన్ని ధిక్కరించి ఇండిపెండెంట్ గా అసెంబ్లీ అభ్యర్థిగా రంగంలోకి దిగిన శ్రీ జలగం వెంగళ రావును  కాంగ్రెస్ పార్టీ ఆరు సంవత్సరాలు బహిష్కరించింది. ఆయన బహిష్కరణ సమయం పూర్తి కాకుండానే 1957 సంవత్సరంలో జరిగిన అసెంబ్లీ ఎన్నికలలో ఆయన తమ్ముడు శ్రీ జలగం కొండలరావు కాంగ్రెస్ టికెట్ పై పోటీచేసి ఎలా MLA అయ్యాడు? అసలు టికెట్ ఎలా వచ్చింది? అప్పటి వరకు శ్రీ జలగం వెంగళరావు జిల్లా నాయకత్వ హోదాలో లేడు. నిషేధ కాలం పూర్తి కాగానే ఖమ్మం DCC PRESIDENT ఎలా అయ్యాడు? తరువాత వెంటనే జిల్లా పరిషత్ PRESIDENT గా ఎలా ఎన్నికయ్యాడు. దీని వెనుక రాజకీయాలేమిటి? ఎవ్వరి హస్తాలున్నవి?

శ్రీ వెంగళరావు రాజకీయంగా ఏ నిచ్చెన మెట్లేక్కాడు? నిచ్చెన పట్టుకున్నది ఎవ్వరు? నిచ్చెన మెట్లు ఎవ్వరు? ఆయన ఖమ్మం జిల్లాలో పుట్టి పెరిగిన వ్యక్తి కాదు. అంతకు ముందు జిల్లాను శాసించగలిగిన స్థితిలో వున్న వ్యక్తి కాదు.

ఉమ్మడి వరంగల్ జిల్లాలో గాని, తరువాత ఖమ్మం జిల్లాలోగాని పోరాట సమయమైనా తరువాతైనా ఖమ్మం మరియు మధిర తాలూకా నాయకులదే  పైచేయిగా వుండేది. విచిత్రంగా వలసదారులదే పైచేయి అయింది. శ్రీ తమ్మినేని వీరభద్రం KHAMMAM MP గా గెలిచేటంత వరకు ఆతరువాత శ్రీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి గెలిచేటంత వరకు వలసదారులే పార్లమెంట్ సభ్యులయ్యారు.  

ఎందుకు?

ఎలా?

ఉద్యమకారుల జిల్లాలో అదెట్లా సాధ్యం?


ఈ ప్రశ్నలకు వచ్చే జవాబుల సారమే 

నిజాం వ్యతిరేక పోరాటం తరువాత ఖమ్మం జిల్లా చరిత్ర.


పై ఫోటోలోని వున్నది శ్రీ జలగం వెంగల రావు. ఈ చిత్రాన్ని 27.07.1965 సంవత్సరంలో శ్రీ మెట్రో వెంకట్రావు తీసింది.

ఇంకా కొన్ని ఆసక్తికర విషయాలు ఈ జిల్లా ముఖ చిత్రం పై కనిపిస్తాయి.అందులో ఒకటి క్రింద పేర్కొన్నది.

1962 సంవత్సరంలో ఉమ్మడి ఆంద్రప్రదేశ్ రాష్ట్రంలో రెండవసారి జరిగిన అసెంబ్లీ ఎన్నికల ముందు అసెంబ్లీ నియోజకవర్గాల పునర్విభజన జరిగింది. ఆసమయంలో వేంసూరు అసెంబ్లీ నియోజకవర్గంలో అక్కడ వున్న SC POPULATION ఆధారం గా SC లకు రిజర్వు చేయాల్సి వచ్చింది .  కానీ వేంసూరు బదులుగా అప్పుడే కొత్తగా ఏర్పడిన PALAIR నియోజక వర్గాన్ని SC RESERVED CONSTITUENCY మార్చారు. ఈ మార్పు వెనుక చాలా రాజకీయ తతంగం నడిచింది. అదేమిటి? కారకులెవ్వరు?

ఇంకోవిచిత్రం వుంధండి.


1959 సంవత్సరంలో జరిగిన పాలేరు పంచాయతి సమితి ఎన్నికలలో. అధ్యక్ష మరియు ఉపాధ్యక్ష ఎన్నికల సమయంలో అధికార కాంగ్రెస్ పార్టీ --అవిభక్త కమ్యూనిస్ట్ పార్టీలు రెండు కలిసాయి. అధ్యక్ష మరియు ఉపాధ్యక్ష పదవులను పంచుకున్నాయి. గెలిచిన గ్రామ పంచాయతి సర్పంచులను వదిలి వేసి CO-OPTION MEMBERS కు అవకాశాన్నిచ్చారు. అప్పటి వరకు అవి ఉప్పు నిప్పుగా ఉండేవి. ఎవ్వరిని టార్గెట్ చేసి అవి కలిశాయి? కలిసి ఏమి సాధించారు? చివరికి ఎవ్వరు ఏమి కోల్పోయారు?  ఈ ప్రశ్నలకు సమాదానాలలోనే ఆధునిక ఖమ్మం చరిత్ర దాగివుంది.


పై చిత్రంలో కుడివేపున కుర్చిలలో కూర్చున్న మొదటివారు శ్రీ జలగం వెంగళరావు, రెండవ వారు శ్రీ శీలం సిద్దారెడ్డి, మూడవవారు శ్రీ పెండ్యాల సత్యనారాయణరావు మరియు ప్రక్కన శ్రీ కోట పున్నయ్య. సమావేశంలో మాట్లాడుతున్న వ్యక్తి శ్రీ హీరాలాల్ మోరియా. ముందు వరుసలో కుర్చిపై కూర్చున్న వ్యక్తిని నేను గుర్తించలేదు. ఈ కాంగ్రెస్ కార్య కర్తల సమావేశం జరిగింది ఖమ్మం తాలూకా ముదిగొండ గ్రామంలో.

పైన పేర్కొన్నవన్ని  ఒకదానికొకటి ముడివడి వున్న అంశాలు. 
పై అంశాల విశ్లేషణ యే ఆధునిక ఖమ్మం చరిత్ర.

                                                                                                      -----పెండ్యాల వాసుదేవరావు.

<!-- Google tag (gtag.js) --> <script async src="https://www.googletagmanager.com/gtag/js?id=G-1M93C8YK91"></script> <script> window.dataLayer = window.dataLayer || []; function gtag(){dataLayer.push(arguments);} gtag('js', new Date()); gtag('config', 'G-1M93C8YK91'); </script>

Monday, May 21, 2018

ఉద్యమాల గుమ్మం విరాట్ రాయాంధ్ర గ్రంధాలయం.

50. (ఖమ్మం చరిత్ర-2) 

ఉద్యమాల గుమ్మం విరాట్ రాయాంధ్ర గ్రంధాలయం.


క్రింది చిత్రం నేలకొండపల్లిలోని శ్రీ విరాట్ రాయాంధ్ర గ్రంధాలయం. ఈ చిత్రంలో 1935 సంవత్సరంలో శ్రీ పెండ్యాల సత్యనారాయణ రావు విరాట్ రాయాంధ్ర గ్రంధాలయం ముందర జనాన్ని ఉద్దేశించి ప్రసంగిస్తున్నారు. నడుమ మీద చేయివుంచి మాట్లాడుతున్న వ్యక్తే శ్రీ పెండ్యాల. ఈయనకు ఎడమ ప్రక్కన శ్రీ దుగ్గిరాల శ్రిరామయ్య. 


ఈ గ్రంధాలయాన్ని 1912 సంవత్సరంలో స్థాపించారు. ఆనాటి గ్రామ పెద్ద్దలు శ్రీ పెండ్యాల వాసుదేవ సోమయాజులు తన ఆత్మీయ మిత్రుడు నేలకొండపల్లి గ్రామ కరణం/పట్వారి  శ్రీ రావులపాటి గోపాలరావు సహకారంతో గ్రంధాలయానికి శ్రీకారం చుట్టారు. శ్రీ వాసుదేవ సోమయాజుల గారి ఐదుగురు కుమారులు ఆ రోజులలో న్యాయవాద వృత్తిలోవుండేవారు. ఆయన పెద్ద బూస్వామి. బ్రిటిష్ ఇండియాలోని కృష్ణ, గుంటూరు జిల్లాలలో కూడా భూములు వుండేవి. ఆ ప్రాంతంలోని భూములకోసం తరచు ఆప్రాంతాలకు వెళ్ళుచుండేవాడు. ఆ ప్రాంతాల ప్రభావముతో ఆంధ్రభాషాభిమానం పట్ల ఆవిధంగా ఆకర్షించ బడ్డాడు. ఆ విధంగా ప్రభావితమైన భావజాలంతో తెలుగు/ఆంద్ర భాషా వ్యాప్తికై నడుం బిగించి ఈ గ్రంధాలయం ద్వారా కార్యాచరణకు శ్రీకారం చుట్టారు. ఆనాడు అందులో తెలుగు మరియు సంస్క్రుత సాహిత్య పుష్తకాలు వుండేవి. 
క్రింది చిత్రంలో గ్రందాలయ వ్యవస్థాపకులు శ్రీ పెండ్యాల వాసుదేవ సోమయాజులు వున్నారు.



కాలం తెచ్చిన మార్పులు, జనం ఆలోచనా విధానంలో కలిగిన మార్పుల ఫలితంగా సామాజిక స్పృహవున్న వ్యక్తులలో సామాజిక భాధ్యతలను  తట్టి లేపాయి. 1934 సంవత్సరంలో శ్రీ పెండ్యాల సత్యనారాయణ రావు, విరాట్ రాయాంధ్ర గ్రంధాలయాన్ని పునరుద్ధరించి సామాజిక విప్లవం దిశగా దాన్ని నడిపించారు. ప్రపంచంలో వస్తున్న మార్పులను జనబాహుళ్యం లోకి తీసుకొని వెళ్ళే ఆలోచనలో భాగంగా  ఆధునిక సాహిత్యాన్ని, కమ్యూనిస్ట్ సాహిత్యాన్ని ప్రజలకు అందు బాటులో ఉంచారు. జనాన్ని అక్షరాస్యులుగా తీరిచి దిద్దుటకు ప్రయత్నిచారు. రాత్రి పాతసాలలు నెలకొలిపి వారిని గ్రంధాలయం వేపు అడుగులేసేటట్లు మార్గం వేశారు.

గ్రామసరిహద్దులలో వున్న బ్రిటిష్ ఇండియా నాయకులతో, నిజాం సంస్థానంలో వున్న ఇతర ప్రాంత పెద్దలతో సంభంధాలను కలిగి వుండేవారు. ఆయన తన రాజకీయ ప్రారంభ దినాలలో ఎక్కువ భాగం ఆ గ్రంధాలయం లోనే గడిపేవారు. ఇక్కడ జరిగిన రహస్య సమావేశాల పరిణామాల ఫలితమే నిజాం సంస్థానంలో నిజాం రీజినల్ కమ్యూనిస్ట్ పార్టీ ఆవిర్భవించింది. ఈ సమావేశాలకు బ్రిటిష్ ఇండియా నుంచి శ్రీ పుచ్చలపల్లి సుందరయ్య, శ్రీ చండ్ర రాజేశ్వర్ రావు, శ్రీ తరిమెల నాగిరెడ్డి, శ్రీ కొండపల్లి సీతారామయ్య వచ్చి వెళ్ళేవారు. స్థానికంగా శ్రీ పెరవెల్లి వెంకట రమణయ్య, శ్రీ దేవులపల్లి వెంకటేశ్వర రావు, శ్రీ రావి నారాయణ రెడ్డి, బద్దం ఎల్లారెడ్డి, శ్రీ కాలోజి, శ్రీ హయగ్రీవా చారి, శ్రీ దాశరధి, శ్రీ వట్టికోట ఆల్వార్ స్వామి  మరియు శ్రీ జమలాపురం కేశవరావు తదితరులు వచ్చీవారు.
ఈ క్రింది  చిత్రం విరాట్ రాయాంధ్ర గ్రంధాలయం యొక్క ముందరి భాగం. మహాత్మా గాంధీ యొక్క విగ్రహాన్ని కుడా చూడవచ్చు. ఇక్కడి గాంధి విగ్రహానికి కూడా ఒక విశిష్టత వుంది. 

ఈ విగ్రహాన్ని శ్రీ పెండ్యాల సత్యనారయ రావు గారి ఆదేశం మేరకు లోకల్ కమ్యూనిస్ట్ నాయకులే విరాట్ రాయాంధ్ర  గ్రంధాలయం ఆవరణ లో నెలకొలిపారు. ఉద్యమ సమయం కావటంతో తన మనిషి అయిన శ్రీ మండవ రత్తయ్య ద్వారా ఈ కార్యక్రమం జరిపించారు. ఆ కార్యక్రమం భారీ ఎత్తున జరిగింది.

The Statue of Mahatma Gandhi was unveiled by Communist Sympathysors in 1940's. It was the evidence of the previous history archive. 



ఇక్కడ గాంధి జయంతి ని స్థానికులు జరుపుకోనటం అలవాటు. ఆ సందర్భ మైన దే ఈ చిత్రం.శ్రీ పెండ్యాల వాసుదేవ రావు నాయకత్వంలోని యువకులు ఇందులో వున్నారు.Gandhi Jayanthi celebrations at Girls School, Nelakondapally by Youth Congress workers in 1980's.

నేలకొండపల్లి గ్రామం లో బాలికల కోసం ప్రత్యేకంగా ఒక ప్రైమరీ స్కూల్ ను శ్రీ పెండ్యాల సత్యనారాయణ రావు ప్రభుత్వం ఆధ్వర్యంలో నెలకొలిపారు. ఆ స్కూల్ వసతికి అప్పుడు విరాట్ రాయాంధ్ర గ్రంధాలయాన్ని ఎంపిక చేసారు.అందులోని పుష్తకాలను బీరువ లలో  నిక్షిప్తం చేసి అక్కడే ఒక మూలన ఉంచారు. ప్రైమరీ స్కూల్ గా వున్నఆ స్కూల్ UP GRADE కావటం వల్ల కొత్త కాలం ఆ పుష్తకాలలో మిగిలినవి మా ఇంట్లో భద్రపరిచినారు. కొంత కాలం తరువాత శ్రీ భక్త రామదాసు స్మారక గ్రంధాలయాన్ని ప్రారంభించాక ఆ పుష్తకాలను ఆ గ్రంధాలయంలో ఉంచారు. ఆ గ్రంధాలయానికి శ్రీ పెండ్యాల సత్యనారాయణ రావు గారే చైర్మన్ గా వుండేవారు. 

ఆ భక్త రామదాసు స్మారక గ్రంధాలయాన్ని స్వాతంత్ర సమరయోధులు శ్రీ హయగ్రీవాచారి ప్రారంభించారు. 


శ్రీ భక్త రామదాసు స్మారకమందిరంలోనే ఈ గ్రంధాలయం నడిచింది.


దాదాపు ఈ సమయం లోనే శ్రీ భక్త రామదాసు చిత్రపటాన్ని కుడా ఆవిష్కరించారు. పై చిత్రం లో రిబ్బన్ కత్తిరిస్తున్న శ్రీ హయగ్రీవాచార్యం కుడి ప్రక్కన శ్రీ పెండ్యాల సత్యనారాయణ రావు, ఆయన వెనుక లోకల్ MLA శ్రీ కత్తుల శాంత య్యఎడమ వేపున శ్రీ పెండ్యాల కృష్ణమూర్తి వున్నారు.


పై చిత్రంలో శ్రీ భక్త రామదాసు చిత్రపటాన్ని ఆవిష్కరిస్తున్న శ్రీ హయహ్రీవాచారి, కుడి ప్రక్కన శ్రీ పెండ్యాల సత్యనారాయణ రావు, ఎడమప్రక్కన శ్రీ రావులపాటి సత్యనారాయణ రావు, వెనుక శ్రీ కత్తుల శాంతయ్య లోకల్ MLA వున్నారు.

ఇది సంక్షిప్తంగా గొప్ప చరిత్ర కలిగిన మా నేలకొండపల్లి విరాట్ రాయాంధ్ర  గ్రంధాలయం చరిత్ర.


    -----పెండ్యాల వాసుదేవరావు.

<!-- Google tag (gtag.js) --> <script async src="https://www.googletagmanager.com/gtag/js?id=G-1M93C8YK91"></script> <script> window.dataLayer = window.dataLayer || []; function gtag(){dataLayer.push(arguments);} gtag('js', new Date()); gtag('config', 'G-1M93C8YK91'); </script>

Friday, May 18, 2018

నాకు అన్నీ ప్రశ్నలే...జవాబులు లేవు...


49. SOCIAL-44) )

భరతమాత శిరోభారంకు మందే లేదా? అసలు మందివ్వాలనే జ్ఞానం ఎవ్వరికై నా ఉందా?


నాకు అన్ని ప్రశ్నలే....


ఎవ్వరి దగ్గర సమాధానం లభించలేదు. 


ఈ తరానికైనా సమాధానం దొరికేనా?


బ్రిటిష్ ఇండియాకు స్వతంత్రం ప్రకటించగానే దేశానికి పురిటి నొప్పు లెందు కొచ్చాయి. అవి పురిటి  నొప్పులా? హింస తాలుకు రోధనలా? 

ఇండియా విభజనకు ముందర మతకల్లోలాలు ఎందుకు జరిగాయి. భారత ప్రధాన మంత్రి పదవికై మొహమ్మదాలి జిన్నా మరియు జవహర్ లాల్ ల పదవీకాంక్ష కొట్లాట ఇందుకు కారణమా? జిన్నా ప్రధాన మంత్రిగా గాంధి ఒప్పుకోవటానికి సిద్ధపడినందుకే గాంధీ హత్య జరిగిందా? మెజారిటీ కాంగ్రెస్ నాయకుల అభీష్టం మేరకు సర్దార్ వల్లభాయి పటేల్ ను గాంధీ ఆమోదించి వుంటే జిన్నా ప్రధాన మంత్రి పదవికై పోటీకి రాకుండా వుండే వాడా? సర్దార్ పటేల్ భారత ప్రధాన మంత్రి అవుతే జమ్మూ & కాశ్మీర్ వివాదం సమసి పోయి ఉండేదా? రావణ కాష్టంలా కాల కుండా వుండి ఉండేదా?
సంవత్సరాల తరబడి లక్షల కోట్ల రూపాయల ధనం కాశ్మీర్ మీద వెచ్చించడం, వేల మంది భారత వీర సైనికుల మరణం ..దేశానికి ఎంత వరకు లాభం చేకూరింది. ఆ భూభాగం కోసం దేశం మొత్తము ఇబ్బందుల పాలుకావటం ఏమి రాజనీతి?

బంగ్లాదేశ్ విమోచనం సమయంలో అపరాకాళీ గా పేరుపొందిన అప్పటి భారత ప్రధాన మంత్రి శ్రీమతి  ఇందిరా గాంధీ వేలమంది పాకిస్తానీ సైనికులను తన దగ్గరనుండి బేషరతుగా విడుదల చేయటమెందుకు? జమ్మూ కాశ్మీర్ వివాదానికికు అప్పుడే   తెలివి గా ముగింపు పలుకవచ్చును గదా? అది మన వైఫల్యం కాదా?

ఆనాటి భారత ప్రధాన మంత్రి శ్రీ పండిట్ జవహలాల్ నెహ్రూ అనాలోచిత చర్యలు కాశ్మీర్ వివాదానికి ఆజ్యం పోస్తే, తరువాత ప్రధాని ఇందిరా గాంధి  నిర్లక్ష్యానికి  కాశ్మీర్ ఆజ్యం ఆకాశానికి ఎగసింది. భారత యువత భవిత అంధకారం లో కొట్టు మిట్టాడుతోంది.

            విషయ విశ్లేషణ ఏనాడైనా జరిగేనా?            రావణ కాష్టం ఆరిపోయేనా?

                                 భారత మాత సిరో భారం తగ్గేనా? 

             దీనికి కారణం ఎవ్వరు?            పరిష్కర్తలు ఎవ్వరు?



పై ఫోటోలో భారత అగ్ర నాయకులు వరుసగా బాబు రాజేంద్ర ప్రసాద్, నెహ్రు, సర్దార్ వల్లభాయి పటేల్, రాజగోపాలా చారి,  డాక్టర్ అంబేద్కర్  మరియు మౌలానా అబ్దుల్ కలాం ఆజాద్ 
 
                                                                                         ----పెండ్యాల వాసుదేవరావు. 

<!-- Google tag (gtag.js) --> <script async src="https://www.googletagmanager.com/gtag/js?id=G-1M93C8YK91"></script> <script> window.dataLayer = window.dataLayer || []; function gtag(){dataLayer.push(arguments);} gtag('js', new Date()); gtag('config', 'G-1M93C8YK91'); </script>

హైకోర్టులో తెలుగులో వాదించవచ్చా? జిల్లా కోర్టులో పరిస్థితి ఏమిటి?

109. GEOPOLITICAL హైకోర్టులో తెలుగులో వాదించవచ్చా? జిల్లా కోర్టులో పరిస్థితి ఏమిటి? హైకోర్టులో మాతృభాషలో వాదించడం,  లిఖితపూర్వక వాదనలు,  జిల...