Monday, April 23, 2018

శ్రీ భక్త రామదాసు జన్మ స్థలంలో ఆయన స్మారక మందిరం విశేషాలు.

             41. (NKP-3). 

శ్రీ భక్త రామదాసు స్మారక మందిరం (ప్రస్తుత ద్యానమందిరం) విశేషాలు.
నేలకొండపల్లి గ్రామం ఖమ్మం నుండి 23 కిలోమీటర్ల దూరంలో, కొదాడు నుండి 15 కిలోమీటర్ల      దూరంలోవుంది. శ్రీ భక్త రామదాసు గారి అసలు పేరు కంచర్ల గోపన్న. ఖమ్మం జిల్లా నేలకొండపల్లి గ్రామంలోక్రి.శ. 1632 సం.ప్రాంతంలో శ్రీకంచర్ల లింగన్న, శ్రీమతి కామమ్మ దంపతులకు ఆయన జన్మించారు. ఆయన భార్య పేరు శ్రీమతి కమలమ్మ. 
               
శ్రీ భక్త రామదాసు ప్రముఖ వాగ్గేయ కారుడు. భక్త జయదేవుడు, త్యాగయ్య, అన్నమయ్య, పురందరదాసు, నారాయణ తీర్ధులు, శ్యామ శాస్త్రి, ముత్తుస్వామి దీక్షితార్, క్షేత్రయ్య ..ఇలా ఎందరో  కర్నాటక సంగీత జ్యోతిని వెలిగించిన వాగ్గేయకారుల సరసన రామదాసుకు సముచిత స్థానముంది. సాహిత్య పరిశోదనల్లో వెలుగు చుసిన ఆయన 206 కీర్తనలను కాలగర్భంలో కలసిపోకుండా రక్షించుకుంటూ ఆ కీర్తనలకు దేశవ్యాప్త ప్రచారం చేయవలసి వుంది. తిరువయ్యారులో ప్రతి ఏటా జరిగే త్యాగయ్య ఆరాధన ఉత్సవాలలాగా రామదాసు సంస్మరణ ఉత్సవాలలాగ  జరగాలనేది నేలకొండపల్లి వాసుల చిరకాల వాంచ. 

కంచర్ల గోపన్న తన రామదాసుగా మారటం వెనుక ఆయన స్వగ్రామంలో ఆయన కుటుంబం నిర్వహించిన సంతర్పణ సమయంలో ఆయన కుమారుని మరణం ప్రభావితం చేసిందంటారు. భద్రాచలం తహసిల్దారుగా బాధ్యతల స్వీకరించిన తరువాత భద్రాచలం కొండ పైన జీర్ణావస్థలో నున్న రామాలయాన్ని చూసి చలించిన శ్రీ గోపన్న, తనకు శిక్ష పడుతుందని తెలిసి శ్రీ రాముని పై నున్న భక్తితో ప్రభుత్వ నిధులను వెచ్చించి ఆ ఆలయ నిర్మాణాన్ని చేసారు. ఫలితంగా ఆగ్రహించిన తానీషా ప్రభువు 12 సం.లు శిక్ష వేసి చెరసాలకు పంపారు. సాక్షాతు శ్రీ రామచంద్రుడే వచ్చి ఆరు లక్షల వరహాలు తానీషాకు చెల్లించి రామదాసుని విడుదల చేయించాడని ప్రతీతి.

రామాలయ నిర్మాణానికి ఎంత ఖర్చు అయినదో ‘ఇక్ష్వాకుల తిలకా ఇకనైనా బలుకవు రామచంద్రా” అనే రామదాసు కీర్తనలో కనబడుతుంది. ప్రాకారాలకు పది వేల వరహాలు, భరతునికి చేయించిన పచ్చల పతకానికి పది వేల వరహాలు, శత్రజ్ఞ్యుడికి  చేయించిన బంగారు మొలత్రాడుకు పదివేల మొహరీలు, లక్ష్మనుడికి చేయించిన పతకానికి పది వేల వరహాలు, సీతమ్మకు చేయించిన చింతాకు పతకానికి పది వేల వరహాలు...ఇలా ఎన్నెన్నో ఆభరణాలకు ఎంతెంత ఖర్చు అయినదోఆయన ఏకరువు పెట్టాడు. రామదాసు కీర్తనలన్నీ బందిఖానాలోనే ప్రాణం పోసుకున్నాయి.

శ్రీ భక్త రామదాసు జన్మస్థల నిర్ధారణ.
సుమారు 1687 సం.లో చనిపోయే ముందర శ్రీ కంచర్ల గోపన్న@శ్రీభక్త రామదాసుగారు తన జన్మ స్థల మైన నేలకొండపల్లి లోని తన నివాస గృహాన్ని తనకు ఆప్తుడైన శ్రీ జోన్నాభట్ల సీతారామయ్య కు దాన పత్రాన్ని వ్రాసి నేలకొండపల్లి గ్రామ పెద్దలకు ఇచ్చారు. దానిని బట్టి అందులో పేర్కొన్న సరిహద్దుల ఆధారంగా ఆయన వినియోగించిన భావిని, జన్మస్థలాన్ని లోగానే  నిర్నయించి వున్నారు. ఆ దాన పత్రంలో ఉత్తర సరిహద్దుగా మహామ్మాయి దేవాలయం అని పేర్కొన్నారు. 


శ్రీ భక్త రామదాసు స్మారక భవన నిర్మాణానికి వెనుక చరిత్ర: 
1946 సం.లో నైజాం వ్యతిరేక పోరాటం రోజుల్లో నేలకొండపల్లి కి చెందిన స్వాతంత్ర్య సమరయోధులు శ్రీ పెండ్యాల సత్యనారాయణ రావు ఆంధ్ర మహాసభ మరియు కమ్యూనిస్ట్ పార్టీల తరఫున నిజాం సంస్థానం ప్రతినిధిగా అఖిల భారత సంస్థానాల సమావేశానికి ఢిల్లీ కి వెళ్ళటం జరిగింది. సమావేశం తరువాత మరునాడు ఉదయం ఢిల్లీ పురవీధిలో వున్న ఒక తోపుడు బండి దగ్గరకు టీ తాగేందుకు వెళ్ళటం,అక్కడ అతనితో పిచ్చాపాటి సంభాషణ సమయంలో తన స్వగ్రామం నిజాం సంస్థానం లోని నేలకొండపల్లి గ్రామమని చెప్పటం జరిగింది. వెంటనే ఆ తోపుడు బండి యజమాని సత్యనారాయణ రావు గారికి పాదాభివందనం చేసాడు. ఆశ్చర్యం చెందిన సత్యనారాయణ గారు కారణం అడుగగా సాక్షాత్తు శ్రీ రామ చంద్రుని దర్శన భాగ్యం తో పునీతమైన పరమ భక్తాగ్రేస్వరుడైన శ్రీ రామదాసు జన్మస్తలిలో జన్మించిన మీరు ధన్యజీవులు. మీ పాదాలు స్పృశిస్తే సమస్త పాపాలు పోతవని తన జన్మ పావనమైనదని చెప్పి సంతోష పడటం జరిగినది.అప్పటి వరకు శ్రీ సత్యనారాయణ రావు గారికి రామదాసు గారి గురించి అంతగాతెలియదు. ఆయన అన్న వైద్యనాధంగారు న్యాయవాద వృత్తిలో మానుకోట పట్టణంలో మకాం ఉండుటవల్ల చిన్న వయసులోనే చదువు కోసం అక్కడికి వెళ్ళటం, మెట్రిక్ చదువుచుండగానే ఉద్యమంలో అడుపెట్టి కార్యక్రమాలు చేయటం వల్ల, అప్పటి వరకు రామదాసు గారి కార్యక్రమాలేమి గ్రామంలోగాని, జిల్లాలో గాని  జరగక పోవటం వల్ల రామదాసు గారిపై అవగాహన లేదు. పై సంఘటన అయన మనో ఫలకంపై చెరుగని ముద్ర వేసింది. యావత్ దేశఖ్యాతిని పొందిన శ్రీ రామదాసుగారి స్మారకంగా గ్రామంలో ఏదైనా చిరస్మరణీయమైన కార్యక్రమం మొదలెట్టాలని ఆలోచన మొగ్గ తొడిగింది. ఉద్యమ విరమణ తరువాత స్వగ్రామం చేరుకున్నాక ఆ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. 

శ్రీ భక్త రామదాసు గారి జన్మ స్థల సేకరణ. 
శ్రీ భక్త రామదాసు గారి రామదాసు గారి జన్మస్థలం గా భావిస్తున్న స్థలాన్ని 1954 సం.లో ఆరుగురు ప్రైవేటువ్యక్తులనుండి 1.హరివిశ్వనాథం(232.00చ.గ.లు), 2.చిలుకూరివిశాలాక్షమ్మ(132.00 చ.గ.లు), 3. చిలుకూరి సీతారామయ్య(332.00 చ.గ.లు), 4. రంగావజ్జుల రామయ్య (384.00 చ.గ.లు), 5. పెండ్యాల వరలక్ష్మమ్మ(110.00 చ.గ.లు), 6. ప్రయాగ లక్ష్మినరసయ్య(160.00 చ.గ.లు) మరియు ప్రక్కనే ఆ ప్లాట్స్ కోసం ఉన్న Govt సందు ----30.00 చ.గ.లు తో కలిపివారి ఆధీనంలో నున్న  మొత్తం చ.గ.లు.1380.00 స్థలాన్ని శ్రీ పెండ్యాల సత్యనారాయణరావు సేకరించి వారికి ప్రత్యామ్నాయ స్థలాన్ని వారి అంగీకారం మేరకు తన సొంత భూమిలో వేరే చోట ఇచ్చారు.

         స్మారక భవన శంకు స్థాపన-చరిత్ర.
               
    25 th December 1955 తేదీన శ్రీ జహీర్ అహ్మద్ IAS, Development Commissioner, Board of Revenue  Hyderabad state వారు శంకుస్థాపన చేసారు. 

1961 సం.లో నిర్మాణం పూర్తి అయినది. క్రింది చిత్రంలో నిర్మాణ పనులను పర్యవేక్షిస్తున్న శ్రీ పెండ్యాల సత్యనారాయణరావు కనిపిస్తున్నారు. ఎదురుగా కనిపిస్తున్న ఇల్లు ఆయనదే. రామదాసు స్మారక మందిరం ఎదురుగానే వుంటుంది. ఆ ఇంటి నిర్మాణం జరిగి ఇప్పటికి దాదాపు రెండు  వందల సం.ల వయస్సు వుంటుంది. Old model Duplex House అది.
           

కుడి నుండి ఎడమ వైపున నిలుచున్న నాలుగోవ్యక్తి శ్రీ పెండ్యాల. భవన నిర్మాణానికి సంబంధించిన తెల్లరాయిని మనం చూడవచ్చు. నిర్మాణం లో కొన్ని ఎదురైన ఆటంకాలతో ఆర్ధిక సమస్యలను అధిగమించటానికి ఆయన తన ఇంట్లో భార్య మెడలోని చంద్రహారాన్ని అమ్మ వలసి వచ్చింది. అయినా ఆయన వెనకడుగు వేయలేదు.

1961 సం.లో నిర్మాణం పూర్తి అయిన తరువాత మానవ సేవే మాధవ సేవ అనే స్పూర్తితో కొన్ని ప్రత్యేక పరిస్థితులలో ఆ భవనాన్ని సామాజిక అవుసరాలకు వినియోగించాలిసి వచ్చింది. కొంతకాలం ప్రైమరీ హెల్త్ సెంటర్ గాను, కొంతకాలం స్థానిక గ్రామ పంచాయత్ ఆఫీస్ గాను మరియు శ్రీ భక్త రామదాసు స్మారక లైబ్రరీ గాను వినియోగించారు. మానవసేవే మాధవసేవ అనే పద్ధతిలో సామాజిక సేవాకార్యక్రమాలకు అక్కడ స్థానమ లభించింది. ఆంధ్రప్రదేశ్ అప్పటి గవర్నర్ శ్రీ ఖందుబాయ్ దేశాయ్ ఆ భవనానికి మెదటి ముఖ్య అతిధిగా వచ్చారు. తరువాత స్వాతంత్ర సమరయోధులు శ్రీ కళా వెంకట్ రావు (ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రధమ రెవిన్యూ & ఆర్ధిక శాఖామాత్యులు), ఆతరువాత హైదరాబాద్ రాష్ట్ర హోంశాఖామాత్యులు స్వాతంత్ర సమరయోధులు శ్రీ మందుమల నరసింహారావు సందర్శించారు.

శ్రీ భక్త రామదాసు చిత్ర పట ఆవిష్కరణ 
శ్రీ భక్తరామదాసు స్మారకమందిరంలో ఏర్పాటైన లైబ్రరీ ప్రారంభసమయంలో మొట్టమొదటి సారిగా  శ్రీ భక్తరామదాసు  చిత్రపటాన్ని స్వాతంత్ర సమరయోధులు శ్రీ హయగ్రీవాచారి ఆవిష్కరించారు. ప్రస్తుతం సీతారామూల విగ్రహాలున్న ప్రదేశంలోనే ఆ చిత్ర పటాన్నుంచారు. 

           
ప్రాచిన గ్రంధాలలోని చిత్రాల ఆధారంగా రూపొందించిన శ్రీ భక్త రామదాసు చిత్రపటానిని శ్రీ హయగ్రీవాచారి  మాజీ మంత్రి, స్వాతంత్ర సమరయోదులు ప్రప్రధమంగా 1972 సం. లో ఆవిష్కరించారు.  

     చిత్రపటాన్ని ఆవిష్కరించిన ఫోటోలో స్వాతంత్ర్య సమరయోధులు, మాజీ రాష్ట్ర మంత్రివర్యులు శ్రీ హయగ్రీవాచారి, గ్రంధాలయం  చైర్మన్ శ్రీ  పెండ్యాల సత్యనారాయణ రావు, పాలేరు MLA శ్రీ కత్తుల శాంతయ్య, పాలేరు సమితి మాజీ అధ్యక్షులు శ్రీ రావులపాటి సత్యనారాయణ రావు తదితరులు వున్నారు. ఫోటోలో కుడి వైపున వున్న మొదటి వ్యక్తి శ్రీ పెండ్యాల. చిత్రపటానికి పూలమాల వేస్తున్న శ్రీ హయగ్రీవాచారి. ప్రక్కన శ్రీ రావులపాటి సత్యనారాయణరావు మరియు లోకల్ MLA శ్రీ కత్తుల శాంతయ్య.



                వివిధ సమయాలలో శ్రీ భక్త రామదాసు స్మారక మందిరం లో భక్తుల వితరణలు.
1993 సం.లో శ్రీమతి పెండ్యాల అన్నపూర్ణమ్మగారు ఇత్తడి మకరతోరణం చేయించారు. సీతారాముల, లక్ష్మణుల విగ్రహాలపైన కనిపించేది అదే.2005 సం.ములో ఉత్శవ విగ్రహాలను శ్రీ వాకా రామచంద్రరావు చేయించారు. వాటికి కావలసిన వస్తు సామాగ్రిని డాక్టర్ పెండ్యాల వెంకటేశ్వర రావు, డాక్టర్ యాచవరపు హైమవతి మరియు పెండ్యాల వాసుదేవ రావు సమకూర్చారు. శ్రీ భక్త రామదాసు స్మారక మందిరమునకు తూరుపు దిక్కున ఆగ్నేయం మూల నుండి రాతి స్థభం వరకు శ్రీ భక్త రామదాసు స్మారక కమిటీ అధ్యక్షులు శ్రీ పెండ్యాల వాసుదేవరావు సొంతసొమ్ములతో కాంపౌండ్ నిర్మాణం చేస్తున్న సమయంలో అక్కడికి అనుకోకుండా వచ్చిన స్థానిక మాజీ MLA , అప్పటి భద్రాచల సీతారామచంద్రస్వామి దేవస్థానం చైర్మన్ శ్రీ కత్తుల శాంతయ్య నిర్మాణ వివరాలు తెలుసుకొని "ఇప్పటివరకు మీ కుటుంబం పెట్టింది చాలు నేను భాద్రాచల దేవస్థానం నుంచి కొంత ఇస్తానని" చెప్పి Rs 25,000/-ఇచ్చారు. వెంటనే అప్పటి MLA శ్రీ సండ్ర వెంకటవీరయ్య తన నిధులనుంచి Rs 25,000/-ఇచ్చారు. ఈవిధంగా రామదాసు మందిరం చుట్టూ తూరుపు, దక్షిణ మరియు పడమర దిక్కులలో కాంపౌండ్ నిర్మాణం జరిగింది. ఈశాన్యంవేపు గేటును మరియు compound ను శ్రీ రావులపాటి రంగారావు నిర్మించారు. అంతకు ముందు స్థానిక కస్తుర్బా మహిళాసంఘం పేరిట స్మారకమందిరం నైరుతిమూల బెంగుళూరుపెంకు పైకప్పుగా రెండురూమ్స్ నిర్మాణం జరిగింది. 1960 దశకం చివరలో శ్రీ భక్త రామదాసు రిక్రియేషన్ తరఫున సిమెంట్ స్లాబుతో ఆగ్నేయం మూలన ఒక రూమ్ నిర్మాణం చేసారు. దాని ముందర తూర్పుదిక్కుగా ఓపెన్ ఎయిర్  ధియేటరును లిబర్టీయూత్ క్లబ్ వారు 1978 సం.ములో నిర్మించారు. శ్రీ భక్త రామదాసు స్మారకోత్షవాలు అన్నిటికీ అదే వేదికైంది. వెనుక వున్న రూమ్ కార్యక్రమాలకు గ్రీన్ రూమ్ గా ఉపయోగపడింది. 2006 సం.ములో RS 1,50.000/-ఖర్చుతో రెండు సోలార్ లైట్సను రామదాసు స్మారకమందిరం ఆవరణలో ఉత్తర మరియు పడమర దిక్కులలో శ్రీ పెండ్యాల వాసుదేవరావు శ్రీ భక్త రామదాసు మెమోరియల్ కమిటి సౌజన్యంతో పెట్టించారు. స్థానిక అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలో  సోలార్ దీపాలు పెట్టటం ఇదే మొదటిసారి. 2009 సం.ములో శ్రీ భక్త రామదాసు విద్వత్ కళాపీఠం వారు పడమర నైరుతి దిక్కున మరో స్టేజి నిర్మాణం చేసారు.

2011 సం.ములో శ్రీ సీతారామచంద్రస్వామి వారి దేవస్థానం భద్రాచలం వారు శ్రీ భక్త రామదాసు స్మారక మందిరం ఈశాన్యం మూలన వున్న రూమ్ ను కూలగొట్టి పడమర దిక్కున వరండాను మరియు వాయవ్యం మూలన ఒక రూమ్ ను కట్టించారు. శ్రీ భక్త రామదాసు ప్రాజెక్ట్ వారు రామదాసు భవన పునరుద్దరణ  సమయములో మెమోరియల్ హాలుకు నైరుతిదిక్కున వున్న రూము ఫ్లూరింగును పూర్తి చేయకుండా వదిలేసిన దానిని మరియు భద్రాచల దేవస్థానంవారు అసంపూర్తిగా వదిలేసిన  వాయవ్య రూమ్ & ఉత్తర వరండా అసంపూర్తి నిర్మాణమును శ్రీ కుంచకర్ర రాధాకృష్ణ  2013 సం.ములో పూర్తి చేసారు.

శ్రీ భక్త రామదాసు మందిరం ఆవరణలో ఏర్పాటు చేసిన సోలార్ లైట్స్ సంవత్సరాల తరబడి వెలుగకున్న ఎవ్వరు ఈనాటికి కూడా పట్టించుకోలేదు. వాటిని వెలిగించవలసి వుంది. పలైర్ అసెంబ్లీ పరిధి మొత్తంలో వున్న సోలార్ లైట్స్ అవి మాత్రమే. ఆశించిన అభివృధి జరుగకపొగా మందిరం రూపురేఖలను ఎవ్వరి ఇష్టం వచ్చినట్లు వారు మార్చటం గురించి, మందిరం మీద నియంత్రణ లేకపోవటం గురించి ఆందోళనతో లోగడ ఇచ్చిన లేఖలను చర్యలకై సంభందిత అధికారులకు సమర్పించనైనది. అలాగే ఆలయం కాని స్థలంలో ఆగమశాస్త్ర విరుద్ధ కార్యక్రమాలను కట్టడి చేయవలసి వుంది. జన్మ స్థల ప్రాంగణం మధ్యలో నున్న భావి దోష నివారణకు తూర్పు, పడమరలుగా భావికి ఉత్తర భాగంలో గోడను బేస్ మట్టం లెవెల్ వరకైనా నిర్మించ వలసి వుంది.

పిశాచస్థలంలో కొత్తగా నిర్మించిన స్టేజిపై దైవికకార్యక్రమాలు నిర్వహించటం ఆగమ శాస్త్ర విరుద్ధం. భద్రాచల దేవస్థానం అధీనంలో వున్న స్థలంలో అనుమతిలేని నిర్మాణాలు, మార్పులు మందిరం అభివృద్ధికి  అవరోధాలు అవుతున్నవి. ఎవ్వరి ఇష్టంవచ్చినట్లు వాళ్ళు నిర్మాణాలు చేస్తున్నారు. కాలంచెల్లిన దర్వాజాలు, కిటికీలు మార్చవలసి వుంది.

శ్రీ భక్త రామదాసు ఆరాధనోత్సవాలు మరియు జయంతి కార్యక్రమాలు తెలంగాణా రాష్ట్ర సాంస్కృతిక శాఖ చేపట్ట టానికి గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖర రావు గారు సంమతించటం హర్షణీయం. ఇప్పటికైనా ఈ ప్రాంత వాసుల చిరకాల వంచ నెరవేరుతున్నంధుకు సంతోషం.

తెలంగాణారాష్ట్ర దృష్టికి వచ్చిన తరువాత ఇప్పటికైనా మందిరంలో కొన్ని మరమ్మతులు చేసి మందిరానికి కలర్స్ వేయిస్తే బాగుండేదనే ప్రజల అభిప్రాయాన్ని స్థానికదినపత్రిక వెలిబుచ్చినది. క్రింద వున్నది ఆక్లిప్పింగుయే. సంబంధీకులు గమనించగలరని మనవి. ఆమందిరానికి రంగులు పదిహేడు సంవత్సరాల క్రిందవేసినవి.



                                     
                                        -----పెండ్యాల వాసుదేవరావు. 
<!-- Google tag (gtag.js) --> <script async src="https://www.googletagmanager.com/gtag/js?id=G-1M93C8YK91"></script> <script> window.dataLayer = window.dataLayer || []; function gtag(){dataLayer.push(arguments);} gtag('js', new Date()); gtag('config', 'G-1M93C8YK91'); </script>

                     

             .

    

Sunday, April 22, 2018

మా వూరి బస్సు స్టాండ్--పాత జ్ఞాపకాలు..

40.(NKP-2). 

అయ్యో బస్సు స్టాండు వెళ్లి పోయావా?
మొన్న నేలకొండపల్లి వెళ్ళినప్పుడు చూశాను. బస్సు స్టాండు కూలగోట్టేసారు.  అది చూడగానే పాత సంగతులు కనుల ముందర కదలాడాయి.ఆ సంగతులకు ఈ ఫొటోలే సాక్ష్యం.

నేలకొండపల్లి బస్సు స్టాండ్ ఇక్కడ కట్టటానికంటే ముందునుంచే అక్కడ జనాలు బుస్సులకై వేచివుండేవాళ్ళు. 1955 సంవత్సరం లో స్థానిక గ్రామ పంచాయతీ దాన్ని కట్టించింది. పోరాటం తోనే దాని నిర్మాణం పూర్తి చేశారు. జిల్లాలో బస్టాండ్ ల నిర్మాణం ఆలోచన లేని రోజుల్లోనే దాన్ని ప్రారంభించారు. సర్పంచ్ శ్రీ పెండ్యాల సత్యనారాయణ రావు గవర్నమెంట్ రోడ్ లో ఇల్లు కట్టుకుంటున్నాడని మోపిన అభియోగాలని అధిగమించి కట్టారు. 
బస్స్టాండ్ ప్రశాంతమైన వాతావరణంలో వుండేది.ముందర రోడ్ కు  ఆవల చెరువు నీళ్ళ నుంచి, వెనుక వేపు నుంచి పచ్చని పొలాల నుంచి  వచ్చే చల్లని గాలి ఆహ్లాదంగా వుండేది.
ఈ క్రింది ఫోటో 1955 సంవత్సరంలో తీసినది.



1955 నుంచి 1975 దాకా నిరాటంకం గా అక్కడ బస్సులు ఆగినవి. 1975 నుండి 1980 దాకా బస్సులు ఆగటానికి పోరాటం చేయాలిసి వచ్చింది. బస్సులు ఆగటానికి అక్కడ రోడ్ వెడల్పు సరిపోదని ఆర్టీసీ చెప్పిన అభ్యంతరం వల్ల ఛివరకు సాంప్రదాయాలకు విరుద్ధంగా అక్కడ ఉన్న ఆంజనేయస్వామి విగ్రహాన్ని వెనక్కు జరపాల్సి వచ్చింది.  సాంప్రదాయ వాదులు దాన్ని తీవ్రంగా వ్యతిరేకించారు.ఫోటోలో ఉన్న రాతి గోడ రోడ్ సగం వరకు మీదకు ఉండేది. కొంత కాలం తరువాత దానిని  చెరువుకట్ట బస్సు స్టాండ్ అనే  పేరుతో పిలుచుకోనేవారు.
క్రింది చిత్రాలు రెండు  1979 లో తీసినవి.


స్త్రీ, పురుషులకు మరియు ఆర్టీసీ కంట్రోలర్ కోసం రూమ్ ను వేరు వేరుగా ఆరోజుల్లోనే కట్టారు. 2000 సంవత్సరం తరువాత రిపేర్లు లేక కృంగి కృశించి పోయింది. పట్టించుకున్న నాధుడే లేకపోయాడు.chiవరకు కులగొట్టేశారు. మళ్లీ కడితే ప్రయాణీకులకు సౌకర్యం. సంతోషం.
 ఈ ఫోటో ను 1979 సంవత్సరం లో తీశారు.

                          -------------పెండ్యాల వాసుదేవరావు 
.
<!-- Google tag (gtag.js) --> <script async src="https://www.googletagmanager.com/gtag/js?id=G-1M93C8YK91"></script> <script> window.dataLayer = window.dataLayer || []; function gtag(){dataLayer.push(arguments);} gtag('js', new Date()); gtag('config', 'G-1M93C8YK91'); </script>

Tuesday, April 17, 2018

నా రాజకీయ జీవిత ప్రారంభపు జ్ఞాపకాలు

39. (NKP-10). 

యూత్ క్లబ్ ప్రెసిడెంట్ గా సమాజ సేవ ఆరంభం.
1977 సం.లో నేలకొండపల్లి గ్రామంలోని అన్ని వర్గాల యువకులంతా కలిసి నన్ను ఏకగ్రీవంగా యూత్ క్లబ్ ప్రెసిడెంట్ గా ఎన్నుకున్నారు. లిబర్టీ యూత్ క్లబ్ గా దానికి నామకరణం చేసాము. ప్రెసిడెంట్ గా నేను, వైస్ ప్రెసిడెంట్ గా శ్రీ కంకిపాటి శ్రీనివాస రావు, సెక్రటరీగా చెరుకూరి సాంబశివరావు, జాయింట్ సెక్రటరీగా శ్రీ కొల్లి జగన్మోహనరావు, కోశాధికారిగా శ్రీ ఠాకూర్ రాంగోపాల్ సింగ్ మరియు శ్రీ కోనేరు కిశోరు యిత్యాదులు కార్యవర్గ సభ్యులుగా వున్నారు.

కొంతకాలం తరువాత జూనియర్ కాలేజీలో జరిగిన ఇంటర్ ఫైనల్ క్లాసు ప్రతినిధి ఎన్నిక పరిణామాల పర్యవసానంగా గ్రామ వాతావరణం మారిపాయింది. యూత్ క్లబ్ లో లిబర్టీ కరువై పాయిందని కొందరు బయటకు వెళ్ళటం, నేను తప్పనిసరి పరిస్థితులలో రాజకీయాలలోకి రావటం జరిగింది. అప్పుడు వున్న నిబంధనల ప్రకారం సీనియర్ ఇంటర్ లో  గెలిచిన ప్రతినిధే  కాలేజీ ప్రెసిడెంట్ అవుతాడు.

రాజకీయాలలోకి వచ్చిన తరువాత మొట్టమొదటి సారిగా సుందరయ్య చౌక్ లో కాంగ్రెస్ గద్దె నిర్మాణం ప్రారంభించాము. అప్పుడు CPM పార్టీ సానుభూతిపరుడు  ఒక్కరు గద్దె నిర్మాణ స్థలాన్ని ఇందిరాగాంధీ సమాధి అనటంతో గ్రామంలో ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. అందువల్ల కార్యక్రమాన్ని భారీఎత్తున చేయాలిసి వచ్చింది. దానికి సంబంధించిన ఫొటోనే ఇది. ముఖ్య అతిధిగా ఖమ్మం MLA శ్రీ కీసర అనంతరెడ్డి వచ్చారు. 1979 సంక్రాంతి పర్వదినాన (14.01.79) జరిగిన ఈ కార్యక్రమంకు సంబంధించిన ఈ ఫోటోలో మైక్ స్టాండ్ ఎదురుగా కూర్చున్న వ్యక్తి  శ్రీ పెండ్యాల సత్యనారాయణరావు గారు.ఆయన కుడి ప్రక్కన శ్రీ అనంతరెడ్డి గారు. సత్యనారాయణరావు  గారికి ఎడమ ప్రక్కన అప్పటి DCC PRESIDENT శ్రీ సోమ్లానాయక్, ఆయనకు ఎడమ వేపున శ్రీ కిలారు వెంకయ్య, (ఖమ్మం టాక ప్రెసిడెంట్) వున్నారు. సభలో మాట్లాడుతున్న వ్యక్తి శ్రీ కొత్త యోగానందరావు, (ఉప సర్పంచ్), ఆయన ప్రక్కన కూర్చున్న వ్యక్తి శ్రీ పెండ్యాల వాసుదేవ రావు.
ఈ కార్య క్రమం తరువాత గ్రామరాజకీయాలు శరవేగంగా మారిపోయాయి.

1978 సం.లో జూనియర్ కాలేజీ లో ఇంటర్ ఫైనల్ లో ఎవ్వరు క్లాసు ప్రతినిధి అవుతే వాళ్ళే కాలేజీ ప్రెసిడెంట్. గెలుపుకు చేరువలో వున్న యనమండ్ర ప్రసాద్ అనే స్టూడెంట్ ను కొంత మంది యువకులు కిడ్నాప్ చేసారు.అతనితో పాటు మన్నే కోటేశ్వర్ రావు అనే స్టూడెంట్ ను కుడా కిడ్నాప్ చేసారు. యూత్ క్లబ్ ప్రెసిడెంట్ గా వున్న నాపై ఆ సమస్య పరిష్కారానికి వత్తిడి పెరిగింది. వాళ్ళను విడిపించి అప్పటి ప్రిన్సిపాల్ సూచించిన రాజీ మార్గానికి అందరమూ ఎకీభవించాము. ఆ సమస్య ఆ సం. పరిష్కారమైంది. కాని తరువాతి సం. ము ఎన్నికల విధానం మారటం తో కాలేజీ ఎన్నికలు జనరల్ ఎన్నికలను తలపించాయి. అందరు ఇండిపెండెంట్లు గానే రంగ ప్రవేశం చేసినా గెలిచిన వాళ్ళు మేం PDSU అన్నారు. ఇవతల వాళ్ళు NSUI అనక తప్పలేదు. దాదాపు పది సం.లు హోరా హోరి యుద్ధం జరిగింది. ఫలితం గా నేను రాజకీయాల్లో వుండి పోవాలిసి వచ్చింది. అప్పటి వరకు O.U లో NSUI ఉనికి లేదు. Membership books ను నేను ఢిల్లీ లో AICC ఆఫీస్ నుండి తీసుకు వచ్చాను.

NSUI అనగానే వాకా శ్రీనివాస రావు ప్రముఖం గా గుర్తుకు వస్తాడు.
మున్నా పాపయ్య, హరి వెంకటేశ్వర్లు, తిరునగరి మల్లయ్య(భుట్టో), రాయపూడి నారాయణ రావు, నున్నా సుధాకర్, మామిడి వెంకన్న,పేరాల సత్యనారాయణ (GANDHI), దేవరశెట్టి వెంకటేశ్వర్లు, పేరాల సత్యనారాయణ (గాంధీ), సోడేపొంగు LAXMAIAH, నర్సీరెడ్డి, వున్నం వెంకటనరసయ్య, యరసంగి సైదులు, లక్కం రామారావు, చెరుకు నాగభూషణం, ప్రేమసాగర్ .....ఇలా ఎందరో స్మృతి పథంలో కనిపిస్తారు. ఖమ్మంలో ABVP నాయకుడైన శ్రీ తడికమళ్ళ విజయకుమార్ ఇక్కడ NSUI కే సహకారాన్నందించే వారు. క్రింది చిత్రంలో ఎడమ నుండి కుడికి ఆనాటి NSUI leaders పేరాల సత్యనారాయణ (గాంధీ), వున్నం  వెంకటనరసయ్య, దేవరశెట్టి వెంకటేశ్వర్లు వున్నారు.

క్రింది ఫోటోలో యూత్ క్లబ్ ప్రెసిడెంట్ గా వున్ననేను ప్రసంగిస్తున్న దృశ్యం.
ఈ చిత్రం లో కుడి నుండి వరుసగా సర్వశ్రీ పెండ్యాల సత్యనారాయణ రావు, జిల్లా కాంగ్రెస్ నాయకులు సోమ్ల నాయకే, ఖమ్మం MLA, TELANGANA PLANNING COMMITTEE CHAIRMAN శ్రీ కీసర అనంత రెడ్డి మరియు జిల్లా కలెక్టర్ (మాజీ RBI GOVERNOR)శ్రీ దువ్వురి సుబ్బా రావు వున్నారు. మాట్లాడుతున్న వ్యక్తి శ్రీ పెండ్యాల వాసుదేవ రావు.                   

నేలకొండపల్లిలో కాంగ్రెస్ పార్టీ కార్య కర్తల సమావేశం.
క్రింది చిత్రంలో మాట్లాడుతున్న స్వాతంత్ర  సమరయోధులు శ్రీ పెండ్యాల సత్యనారాయణ రావు, మరియు చిత్రంలో శ్రీ సంభాని చంద్రశేఖర్ (స్థానిక శాసనసబ్యులు), శ్రీ కొమ్మినేని అనంతరామయ్య, శ్రీ వున్నం వెంకయ్య తదితరులు వున్నారు. చంద్రశేఖర్ కు ముందర కూర్చున్న వ్యక్తి శ్రీ పెండ్యాల వాసుదేవ రావు(చేతికి కడియం).


గత కాలపు జ్ఞాపకం---ప్రస్తుత రాజకీయ పునరేకీకరణ పరిణామాల నేపధ్యంలో ఏరియాలో రాజకీయంగా Congress పార్టీ కనుమరుగు అవుతున్నదన్న ప్రచార సమయాన......పాత జ్ఞాపకాలు కనుల ముందు కదలాడినవి.

1984 సంవత్సరంలో కుసుమంచి సెంటర్ లో ఎలెక్ట్రిసిటీ ఆఫీస్ ప్రక్కన కాంగ్రెస్ పార్టీ దిమ్మె ఆవిష్కరణ
ఈ చిత్రంలో సర్వశ్రీ పెండ్యాల సత్యనారాయణ రావు, సంభాని చంద్రశేఖర్,పెండ్యాల వాసుదేవ రావు, కొమ్మినేని ఆనంతరామయ్య, పటేల్ రామచంద్రసింగ్, కనపర్తి వెంకటేశ్వర్లు, తిరునగరి మల్లయ్య, కనపర్తి సీతయ్య, పల్లపు రాములు, గోళ్లమూడి భద్రయ్య, రాయపూడి నారాయణ రావు, వాసుగంటి రాములు తదితరులు ఉన్నారు.

                                                                                                              ----పెండ్యాల వాసుదేవ రావు.

<!-- Google tag (gtag.js) --> <script async src="https://www.googletagmanager.com/gtag/js?id=G-1M93C8YK91"></script> <script> window.dataLayer = window.dataLayer || []; function gtag(){dataLayer.push(arguments);} gtag('js', new Date()); gtag('config', 'G-1M93C8YK91'); </script>

ఖమ్మంలో మహాత్మా గాంధి--ప్రజల మదిలో జాతి పిత జ్ఞ్యాపకాలు..

38. (KHAMMAM) 

Mahatma Gandhi's meeting was held in my ancestral land in Khammam town near Venkatagiri Railway gate 5 August 1946.— 


1942 సంవత్సరం ఆగస్ట్ నెలలో ప్రారంభమైన క్విట్ఇండియా ఉద్యమం 1945 లో ముగియటంతో వెంటనే గాంధీజీ దక్షిణ భారత హింది భాషా ప్రచార ఉద్యమాన్ని చేపట్టి పర్యటనలు ప్రారంభించారు.  

ఖమ్మం టౌన్ కాంగ్రెస్ ఈసమావేశాన్ని ఏర్పాటు చేసింది. ఆ సమయంలోనే 1946 సంవత్సరంలో నిజాం ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ పై వున్న నిషేధాన్ని ఎత్తి వేసింది. కమ్యూనిస్ట్ పార్టీ పై నిషేధాన్ని విధించింది. 1946, ఫిబ్రవరి 3, 4 తేదీలలో మద్రాస్ లో నిర్వహించిన  దక్షిణ భారత హింది భాషా ప్రచార కార్యక్రమం నుండి వస్తున్న గాంధీజీ, ఖమ్మం టౌన్ కాంగ్రెస్ కోరిక మేరకు మార్గ  మధ్యమంలో రైల్ ఆగగా ఫిబ్రవరి 5 వ తేదిన మహాత్మాగాంధి ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు. ఖమ్మం టౌన్ కాంగ్రెస్ కు అప్పుడు శ్రీ గెల్లా కేశవా రావు ప్రెసిడెంట్ గా వున్నారు.

స్వాతంత్య్ర దినోత్సవమ్ సందర్భము గా స్వాతంత్ర్య సమర యోధులను సత్కరించే కార్యక్రమంలో భాగం గా జిల్లా కాంగ్రెస్ పార్టీ ప్రతినిధులుగా శ్రీ చింతనిప్పు లాలయ్య, కొత్త సీతారాములుతో కలిసి నేను వెళ్లినప్పుడు శ్రీ గెల్లా కేశవా రావు గారు ఆ మరపురాని ఘట్టాన్ని వివరించారు. "బాబు మేము ఏర్పాటు చేసిన సభా వేదిక స్థలం మీదే, ఇప్పుడు మీకు లేదులెండి" అని నాతో చెప్పారు. అలాగే గాంధిజీ ఆసీనులైన సభా వేదికను చెక్క బల్లలతో సుమారు ఇరవై అడుగుల ఎత్తు లో నిర్మించామని చెప్పారు. 15 నిమిషాల పాటు హింది లో సాగిన ఆయన ప్రసంగాన్ని శ్రీ మోటూరు సత్యనారాయణ తెలుగు అనువాదం చేసారని కూడా చెప్పారు. గాంధిజీ వెంట ఆయన కార్యధర్స్యులు ప్యారేలాల్ గాంధీ, మహాదేవ దేశాయ్ వున్నారని చెప్పారు. కమలాదేవి బజాజ్ కూడా వెంట వున్నారు.

అది ఖమ్మం పట్టణ చరిత్రలో మరచిపోలేని చారిత్రక ఘట్టం. మధుర క్షణాలు. అప్పుడు ఖమ్మం నిజాం రాష్ట్ర ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఉండేది. నిజాం విమోచనం/ఇండియాలో విలీనం అయిన తరువాత హైదరాబాద్ రాష్ట్రంలో 1953 సంవత్సరంలో ప్రత్యేక జిల్లాగా ఏర్పడినది.

1946 సంవత్సరంలో ముస్లిం మెజారిటీ ప్రాంతాలకు ప్రత్యేక ప్రతిపత్తిని ఇవ్వాలనే ఆలోచనతో బ్రటిష్ ప్రభుత్వం "బ్రిటిష్ కాబినెట్ మిషన్ " ప్రతిపాదనను తీసుకవచ్చింది. ఇది దేశంలో అలజడికి కారణం అయినది. దేశ విభజనకు అది దోహద పడుతుందనే అనుమానం తో గాంధి దీనిని నిరాకరించాడు. కాని నెహ్రు, పటేల్ లు దేశం ముస్లిం లీగ్ పరం అవుతుందనే భయంతో గాంధి మాటను త్ర్హోసిపుచ్చారు. హిందూ-ముస్లిం కొట్లాటలు తారాస్థాయికి వెళ్లి అయిదు వేల మంది ప్రజలకు పైగా హత్య గావించ బడ్డారు. పర్యావ సానమే కొన్ని శక్తులు గాంధిని హత మార్చ ప్రయత్నిన్చాయి.

మహాత్మా గాంధి మరణం --ప్రజల్లో తీరని విషాదం.

1948 జనవరి 30వ తారీఖున ఢిల్లీలో బిర్లా నివాసంవద్ద ప్రార్థన సమావేశానికి వెళ్తుండగా ఆయనను నాథూరామ్ గాడ్సే కాల్చి చంపాడు. 1944 నుంచి 1948 వరకూ మహాత్మా గాంధీకి ఆంతరంగిక కార్యదర్శిగా పనిచేసిన వెంకిట కల్యాణం ఆయన హత్య జరిగినప్పుడు పక్కనే ఉన్నారు. ఆయన మాటల ప్రకారం"1948 జనవరి 30వ తేదీ సాయంత్రం 5:17 గంటలకు మహాత్మాగాంధీ ఢిల్లీలోని బిర్లాహౌస్లో ప్రార్థనా సమావేశాన్ని ముగించి బయటకు వస్తున్నప్పుడు నాథూరాంగాడ్సే ఆయనకు ఎదురుగా వచ్చారు. అప్పుడు గాంధీ పక్కనే ఉన్న సహచరి అషా ఛటోపాధ్యాయ గాడ్సేను పక్కకు నెట్టివేస్తూ ఆలస్యమైంది పక్కకు జరగండి అంటూ తోస్తూనే ఉంది. కానీ గాడ్సే పాయింట్ 380 ఏసీపీ, 606824 సీరియల్ నెంబర్ కలిగిన బెరెట్టా ఎం 1934 అనే మోడల్ సెమి-ఆటోమెటిక్ పిస్టల్తో గాంధీ ఛాతిలోకి మూడుసార్లు కాల్చారు. దీంతో బాపూజీ అక్కడికక్కడే కుప్పకూలారు. కాల్చిన ఒక బుల్లెట్ గాంధీ ఛాతిలోకి దూసుకొని పోగా మిగిలిన రెండు బుల్లెట్లు పొట్ట నుంచి దూసుకెళ్లాయి. 
అంతే.
జాతి పిత నేల కొరిగాడు. దేశం యావత్తూ విషాదం లో మునిగి పొయింది.

<!-- Google tag (gtag.js) --> <script async src="https://www.googletagmanager.com/gtag/js?id=G-1M93C8YK91"></script> <script> window.dataLayer = window.dataLayer || []; function gtag(){dataLayer.push(arguments);} gtag('js', new Date()); gtag('config', 'G-1M93C8YK91'); </script>

Friday, April 13, 2018

మా వూరి వెంకటేశ్వరస్వామి దేవాలయం విశేషాలు.

37. (NKP-1)   
దేవాలయం చరిత్ర.
ఆరు వందల సంవత్సరాల పైగా చరిత్ర గల నెలకొందపల్లి లొని శ్రీ వేంకటేశ్వర స్వామి దేవాలయాన్ని పూర్వకాలం లో "నాగుల్ దేవాలయం"గా పిలిచేవారు. నిజాం కాలం నుంచి 1967 సంవత్సరం రాష్ట్ర దేవాదాయ శాఖ స్వాధీనం చేసుకొనే వరకు "దేవల్ బాలాజీ" అని పిలిచేవారు.

ఇక్కడ స్వామి స్వయంభూ మరియు శేషావతారం. ఇక్కడ కొలువై ఉన్న దేవుడు కోరిన కోరికలు తీర్చే స్వామియని భక్తుల విశ్వాసం.

320 ఎకరాలు పైగా పొలం ఉన్నా అందులో 100 ఎకరాలు సుమారుగా సాగర్ కాలువ క్రింద పోయింది. మిగిలిన భూమిలో రేగులగడ్డా తండాలో 150 ఎకరాలు పోను నేలకొండపల్లి మరియు పరిసర గ్రామాల్లో ఉంది. 1967 వరకు ముంతకల్దారులు గా మరియు స్థానాచార్యులు గా 17 తరాలు "ముడుంబాయ్" వంశస్థులు వున్నారు. వారి కోరిక ప్రకారం తదుపరి శ్రీ మరింగంటి కృష్ణమాచార్యులు వచ్చారు. ఉత్సవ సమయాల్లో స్వామి వాహన దారులుగా బెస్త కులస్థులు ఆనాటినుంచి ఈనాటి వరకు తరాలు మారినా సాంప్రదాయం కొనసాగిస్తున్నారు. మహిమ మరియు చరిత్ర ఉన్న ఈ దేవాలయం గురించిన చారిత్రక ఆధారాలు/ శిలా శాసనాలు లేకపోవటం దురదృష్టకరం.
దేవాలయం తో అనుభంధం.
మా వూరికి (నేలకొండపల్లి) తూరుపు దిక్కున పొలాల మధ్యన, వూరికి దూరంగా ఉన్న వెంకటేశ్వర దేవాలయం చుట్టూ వాగు(తూరుపు మినహా) ఉంటుంది. ఈదులు గీయటానికి వచ్చే గౌడలు, వాగులో చాకళ్ళు ఉదయం నుంచి సందడి.1958 ప్రాంతంలో ధ్వజస్థంభాన్ని వేశారు. నేను మా జీప్ లో మా ఫాథర్ తో వెళ్లిన గుర్తుంది. వీధి దీపాలు లేకున్నా అ చీకెట్లోనే ప్రతి శనివారం వెంకటేశ్వర దేవాలయానికి స్నేహితులతో వెళ్ళేవాడిని. ధర్మకర్తల కమిటీ వచ్చేవరకు గ్రామ మాలీ పటేల్ శ్రీ రావులపాటి రంగారావు గారు ప్రతి శనివారం భజన హార్మొనీ వాయిస్తూ చేసేవారు. నేనూ అందులో పాలుపంచుకొనే వాడిని. దేవాలయం లోనికి వెళ్ళాలంటే కత్వా పైనున్న రాతి గోడ ఎక్కి దిగవల  సిందే. యువకులతో బాటు వ్రుద్హులు అయినా, స్త్రీలు అయినా పిల్లలు అయినా దైవ దర్శనం కావాలంటే అలా వెళ్ళవలసిందే. దేవాలయానికి దాహ్షిణ దిక్కుగా చారిత్రాత్మక బైరాగుల గుట్ట వుంటుంది. యువకులము అందరము గుట్ట ఎక్కటానికి ప్రతేకంగా వెళ్ళే వాళ్లము. ఆ రోజులు ఆ అనుభవాలే వేరు.


అభివృధ్హి పధాన దేవాలయం--దేవాదాయ శాఖ నియామక కమిటీ ఆవిర్భావం.
1967 సంవత్సరం లో శ్రీ పెండ్యాల సత్యనారాయణరావు చైర్మన్ గా నేలకొండపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామి దేవ స్తానానికి  ధర్మకర్తల మండలిని రాష్ట్ర ప్రభుత్వం నియమించింది.వారి ఆధ్వర్యంలో దేవాలయం అభివృద్ధి తో శోభను సంతరించుకుంది. దేవాలయ ప్రవేశానికి వాగుపై సిమెంట్ వంతెన కట్టారు. ఎలక్ట్రిసిటీ సదుపాయం కల్పించారు. తిరుమల నుంచి మైక్ సెట్ తెప్పించారు, చుట్టూ రాతి కాంపౌండ్ కట్టించారు.పూజారి కుటుంబ అవుసరాల నిమిత్తం రూమ్ కట్టించారు. కొంత కాలం గోశాల నిర్వహించారు. వాగు అవతల వున్న రాతి మండపంలో శ్రీరామనవమి ఉత్సవాలు భారీ ఎత్తున నిర్వహించారు. ఉప్పుదిమ్మెల దగ్గరనుండి దేవాలయం వరకు విద్యుత్ వీధి దీపాలు వేయించారు. దేవాలయ ప్రాంగణం అంతా నల్లరాయి కావటంతో వాస్తు కూడా అవుసరం కావటం వల్ల భావి తవ్వించే ప్రయత్నాలు ఫలించలేదు. ఆదాయ పెంపు మార్గాలకు మాత్రం ప్రయత్నాలు ప్రారంభించారు.
క్రింది ఫోటో దేవాలయ ప్రవేశం తరువాత దేవాలయ ప్రాంగణం.


క్రింది ఫోటోలో దేవాలయం ముందర కనిపిస్తున్న తెల్ల రాతి కట్టడమే  ముజ్జిగుడెం మరియు అనాసాగరం గ్రామాలకు రహదారి ఒకప్పుడు.కత్వాకు వరద వచ్చినప్పుడు జనాలు ప్రాణాలకు తెగించి నడిచే వాళ్ళు.
  
ఈ క్రింద ఫోటోలో వెంకటేశ్వర స్వామి దేవాలయం ముందు కనిపించే రాతి గోడ కట్టడమే దేవాలయ ప్రవేశానికి పోయే రోడ్డు1968 వరకు. 

చాలా దశాబ్దాల కాలం వరకు శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయం ముందు వున్న క్రింద కనిపిస్తున్న కట్టయే ముజ్జుగూడెం, అనాసాగరం గ్రామాలకు వున్న ఏకైక రహదారి. కత్వా పొంగి, కట్టపై మోకాళ్ళ వరకు నీళ్ళు వస్తున్నా అలాగే ప్రాణాలు అరచేత పట్టుకుని ప్రయాణించేవారు.

                                                                                              =======పెండ్యాల వాసుదేవరావు/

<!-- Google tag (gtag.js) --> <script async src="https://www.googletagmanager.com/gtag/js?id=G-1M93C8YK91"></script> <script> window.dataLayer = window.dataLayer || []; function gtag(){dataLayer.push(arguments);} gtag('js', new Date()); gtag('config', 'G-1M93C8YK91'); </script>



Saturday, February 3, 2018

MUST RETHINK ABOUT VIP SYSTEM IN INDIA.





36.(SOCIAL-36)  

MUST RETHINK ABOUT VIP SYSTEM IN INDIA


VIP Traditions in various countries.
Needs a public opinion.

Britain has an official number of 84 VIPs!
France has 109 VIPs!
Japan has 125 VIPs!
Germany has 142 VIPs!
The total number of VIPs!
The USA has 252 VIPs!
Russia has 312!
The total number of VIPs in China is 435!
India has a total no of 5,79,092 VIPs!
Just imagine the mounting bills of Security, Flight Bills, Foreign Travel & Vacation, Conveyance, Free Electricity, Free Water, Subsidized High-Quality food in Canteens & other perks!
It is sickening!
Cutting down this number to below 300 is as urgent is the best reform for our country
Remember this huge Army of largely political VIPs who are squandering valuable national resources meant for the common people of this country!

Needs public opinion in India against this ridiculous nonsense.


                                                                                       -----PENDYALA VASUDEVARAO

<!-- Google tag (gtag.js) --> <script async src="https://www.googletagmanager.com/gtag/js?id=G-1M93C8YK91"></script> <script> window.dataLayer = window.dataLayer || []; function gtag(){dataLayer.push(arguments);} gtag('js', new Date()); gtag('config', 'G-1M93C8YK91'); </script>

Thursday, October 13, 2016

SURGICAL STRIKES BY INDIAN ARMY.

 
35. (SOCIAL-35) 
PHOTO COURTESY: HINDUSTAN TIMES.

SURGICAL STRIKES BY INDIAN ARMY.


In the wake of September 18 th just a week after 18 soldiers of Indian Army were killed by a militant attack at Indian Army Brigade head quarters in Uri, India has carried out Surgical strikes targeting against Pakistan sponsored terror groups like Lashkar-E-Toiba terrorist Launch-Pads in Pakistan occupied Kashmir  for terrorists across the Line of Control (Loc). During the counter-terrorist operations, significant casualties have been caused to the terrorists and those who were trying to support them. The operations have since ceased,” 

The Director General of Military Operations (DGMO) Lt. Gen Ranbir Singh pointed out that during the investigation of the terror attack; the proof of involvement of Pakistani elements was clearly discovered. Based on very specific and credible information which the Indian Army received yesterday that some terrorist teams had positioned itself along the line of control, the Army carried out surgical strikes last night at these launch pads. The operations were focused to ensure that these terrorists do not succeed in endangering lives of citizens in our country. 

Opposition in India had supported the surgical strikes unanimously. 

But the Pakistan claims that India has not shared any evidence about the assault on an Army camp in Uri while accusing New Delhi of blaming others for terror attacks.  Jammu and Kashmir dispute is an unfinished agenda of the partition of the sub-continent,” says the Prime Minister and denies the Surgical strikes too.

Pakistan was isolated from the SAARC countries and rest of the world too.

The defense minister of India says that the credit of Surgical strikes goes to Indian Army, 127 crores of Indians and Prime Minister Narendra Modi who has taken decision for strikes and Parrikar  had claimed that there had been no surgical strikes conducted in the past and all such strikes were covert operations. The former defense minister added Parrikar insulted both the Army and the country with his statement. Parrikar’s statements have drawn wide criticism from opposition parties with Congress saying that he should seek pardon from the armed forces for “undermining” their sacrifices for the country.

At long last, the country had shown that it was capable of "responding: Not even during the 1999 Kargil war had India crossed the LoC.

                                                                              ....PENDYALA VASUDEVA RAO.

<!-- Google tag (gtag.js) --> <script async src="https://www.googletagmanager.com/gtag/js?id=G-1M93C8YK91"></script> <script> window.dataLayer = window.dataLayer || []; function gtag(){dataLayer.push(arguments);} gtag('js', new Date()); gtag('config', 'G-1M93C8YK91'); </script>

హైకోర్టులో తెలుగులో వాదించవచ్చా? జిల్లా కోర్టులో పరిస్థితి ఏమిటి?

109. GEOPOLITICAL హైకోర్టులో తెలుగులో వాదించవచ్చా? జిల్లా కోర్టులో పరిస్థితి ఏమిటి? హైకోర్టులో మాతృభాషలో వాదించడం,  లిఖితపూర్వక వాదనలు,  జిల...